Monday, September 28, 2026
More
    HomeOpinionTGPanchayatElectionSymbols : గుర్తుగుర్తుంచుకో...గుర్తులు కేటాయించడంలో తుంగతుర్తిలో అభ్యర్థుల ప్రచారజోరు

    TGPanchayatElectionSymbols : గుర్తుగుర్తుంచుకో…గుర్తులు కేటాయించడంలో తుంగతుర్తిలో అభ్యర్థుల ప్రచారజోరు

    📰 Generate e-Paper Clip

     

    TGPanchayatElectionSymbols : ప్రజా దీవెన, తుంగ తుర్తి: తుంగతు ర్తి నియోజకవర్గ కేంద్రంలో కాం గ్రెస్ బిజెపి బిఆర్ఎ స్ ఇండిపెండెంట్ పా ర్టీల చతుర్ముఖ పోటీ నెల కొంది. ప్రధాన రాజ కీయ పార్టీలు ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న తుంగతుర్తి సర్పంచ్ ఎన్ని క హోరాహోరీ వాతావరణం ఏర్పడింది. ఈ నేపద్యంలో స్థానిక స ర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు కేటాయించడంతో తుంగతుర్తి మండలం లోని వివిధ గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది.

    పార్టీ పరంగా గుర్తులు లేకపోవడం తో అభ్యర్థులు తమకు కేటా యించిన గుర్తులను గ్రామాల్లోని ప్రజలకు ఓటు వరకు గుర్తుండేలా ప్రచారం ప్రారంభించారు. వార్డు సభ్యులకు ఒక గుర్తు సర్పంచ్ అభ్య ర్థికి మరో గుర్తు ఉండడంతో సర్పంచ్ అభ్యర్థి వార్డు మెంబర్లు కలిసి ప్రచారం ప్రా రంభించారు. ఒక్కో గ్రామంలో త్రి ముఖ పోటీ కొన్ని గ్రా మాల్లో ద్విముఖ పోటీలు సాగుతున్నాయి.

    కాంగ్రెస్ పార్టీలో కొన్ని గ్రామాల్లో రెబెల్ అభ్యర్థుల బెడద ఉంది. బిఆర్ ఎస్ పార్టీకి సైతం ఒకటి రెండు గ్రా మాల్లో ఇలాంటి పరిస్థితు లే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తనకు బలమున్న గ్రామాల్లో తమ అభ్యర్థు లను నిలబెట్టారు. ప్రధానంగా తుంగతుర్తి నియోజక వర్గ కేంద్రంలో చతుర్ముఖ పోటీ బలంగా ఉంది. వరుసగా ఆరుసార్లు తమ అధిపత్యా న్ని కనబరిచి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకు న్న సంకినేని సోదరు లు మరోమారు బిజెపి పార్టీ బలపరిచిన అభ్య ర్థిని గెలిపించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

    బిజెపి అభ్యర్థి మల్లెపాక సాయి బాబు తుంగతుర్తి పట్టణంలో అం దరికీ సుపరిచితుడు కావడం గ్రామంలో పలుమార్లు గ్రామాభివృద్ధి పట్ల ఉ ద్యమాలు చేసిన సాయిబాబు ఈ సారి ఎన్నికల్లో తనను తప్పక గె లి పిస్తారని ధీమాతో ఉన్నారు. అలాగే దశాబ్దాలుగా తా ము తుంగతుర్తి అభివృద్ధి చేస్తున్నామని తాము బలపరిచిన అభ్య ర్థిని గెలిపించాలని సంకినేని సోదరులు ప్రజలను కోరుతున్నారు .భారతీయ జనతా పార్టీ నాయకులు సంకినేని రవీందర్రావు సర్పం చ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నామినేషన్ వేసిన నాటి నుండి అభ్యర్థిని వెంట తీసుకుని గ్రామంలో పర్యటిస్తున్నారు.

    అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్థా నిక శాస నసభ్యులు మందుల సా మెల్ అలాగే ఎఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి డిసి సి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య ఆశీ స్సులతో విద్యావంతుడైన బొంకూ రు సుదర్శన్ సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామంలో సుద ర్శన్ కుటుంబం అందరికీ సుపరిచితులే. నా మి నేషన్ వేసిన నాటి నుండి గ్రామం లో ఇంటింటికి తిరుగుతూ తనను ఈసారి గెలిపిం చాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బిజె పిల మధ్య ఉంటుందని మాట వినవస్తున్న నేపథ్యంలో సుదర్శన్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

    వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో పర్యటిస్తున్నారు. అలాగే బి ఆర్ ఎస్ అభ్యర్థి తడకమల్ల రవికుమార్ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభి వృ ద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. తనతో పాటు వార్డుల్లో నిలిచిన అభ్యర్థులను ప్రజ లకు పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించి చివరి నిమి షంలో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా ఇండి పెండెంట్ అభ్యర్థిగా బొంకూరి అరుణ ఎన్నికల బరిలో నిలిచారు.

    తనకు ఓటేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థిస్తూ ఇంటింటా ప్రచారం ముమ్మరంగా నిర్వహి స్తున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరిగినా బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం తన పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని తాము ఎవరితో పొత్తు పెట్టుకోమని తెలపడంతో తుంగతుర్తిలో చతు ర్ముఖ పోటీ నెలకొంది.

    కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బిఆర్ఎస్ పార్టీల అధినాయక త్వా లు బలంగా ఉండడంతో తమ అ భ్యర్థుల ప్రచారం ముమ్మ రంగా చే యడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆరుసార్లు సర్పంచ్ అభ్యర్థిని గెలి పించుకున్న సంకినేని బ్రదర్స్ పై ఈ సారి ఎలాగైనా గెలుపొంది తమ ఆ ధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో కాం గ్రెస్ ముందు సాగుతుండగా, బిఆర్ఎస్ పార్టీ సైతం త మ ఓటు బ్యాంకు చెదరకుండా ప్ర చారాన్ని ముమ్మరం చేస్తుంది .తమ ఆధి పత్యం ఏమాత్రం చెక్కుచెదరద ని తిరిగి తుంగతుర్తి అభ్యర్థిని గెలి పించుకుంటామని గెలుపు తమదే నని ధీమాతో సంకినేని సోదరు లు ప్రచారం నిర్వహిస్తున్నారు.

    సాయిబాబు తాను విజయం సాధిస్తానని తుంగతుర్తి అభివృద్ధి చే స్తానని తనను గెలిపించాలని ప్రజల ను అభ్యర్థిస్తున్నారు. ఏది ఏ మైనా తుంగతుర్తిలో జరుగుతున్న పోటీ ఆయా పార్టీల బలాబలా లను తెలు పనుందని విశ్లేషకులు భావిస్తున్నా రు. విజయం ఎవరి ని వరిస్తుందో పోలింగ్ తేదీ 11 వరకు వేచి చూడాల్సిందే. ఏది ఏ మైనా గుర్తులు కేటాయించడంతో తుంగతుర్తి పంచాయితీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.