Sunday, September 27, 2026
More
    HomePoliticsRajaiah Rural Development : పల్లెకు ప్రజోపయోగకరం, రాజయ్య రాజలాంఛనం

    Rajaiah Rural Development : పల్లెకు ప్రజోపయోగకరం, రాజయ్య రాజలాంఛనం

    📰 Generate e-Paper Clip

    –అప్పుడెప్పుడో సర్పంచ్, ఇప్పటికీ

    మాజీ సర్పంచ్ సేవా నిరతి

    Rajaiah Rural Development : ప్రజా దీవెన, సంగారెడ్డి : అది సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండ లం మాందాపురం. ఆ గ్రామానికిఅప్పుడెప్పుడో ఆయన్ని గ్రామస్తు లు సర్పంచ్ గా ఎన్ను కున్నారు. అ ప్పటి కృతజ్ఞత కోసమో, నిలువెల్లా గూడుకట్టుకున్న సేవా నిరతి వల్లనో ఏమో కానీ నేటికీ ఆయన తనకు తోచిన మేరకు గ్రామానికి సేవ చే స్తూనే ఉన్నారు. గ్రామస్తులకు చేదో డు వాదోడుగా ఉంటున్నారు. తన వద్దకు వచ్చిన వారికి చేతనయినం త సాయం చేస్తున్నారు.

    అల్లాదుర్గం మండలం మాందాపు రం మాజీ సర్పంచ్ కుందారం రాజ య్య సేవా నిరతి కి ఇది నిదర్శనం గా నిలుస్తోంది. సంపాదన కోసమే చాలామంది రాజకీయాల్లోకి వస్తు న్న ఈ తరుణంలో రాజ య్య లాంటి వాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు.యువత రాజకీ యా ల్లోకి రావాలని నాడు ఎన్టీఆర్ పిలుపునివ్వడంతో రాజయ్య టిడిపి లో చేరారు.

    క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తుం డ గా, నాటి ముఖ్య నేత కరణం రామ చంద్ర రావు ఆయన్ని మండల తెలు గుదేశం పార్టీ అధ్యక్షు డిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత 1988లో జరిగి న పంచాయతీ ఎన్నికల్లో ప్రజామో దం పొందారు. గ్రామానికే చెందిన సీ నియర్ నేతను ఓడించి చరిత్ర సృ ష్టించారు. సర్పంచిగా మంచి మెజా ర్టీతో గెలుపొందారు.ఆ సమయం లోనే కరణం రామచంద్రరావు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

    కరణం సహకారంతో ఆ తర్వాత మంత్రిగా ఉన్న మల్యాల రాజ య్య సహకారంతో గ్రామంలో సిసి రోడ్లు వేయించారు. సైడ్ డ్రైనేజీ లను ని ర్మించారు గ్రామపంచాయతీ భవనాన్ని కట్టించారు. అంతే కాకుండా అ ల్లాదుర్గం వరకు రోడ్డును మంజూరు చేయించారు. అల్లాదుర్గం నుంచి సి ల్వర్ వరకు బీటీ రోడ్డు వేయించా రు. 65 నిరుపేద కుటుంబాలకు ప క్కా ఇండ్లను మంజూరు చేయించా రు. సొంత డబ్బుతో గ్రామంలో దు ర్గామాత ఆలయాన్ని నిర్మించారు.

    హనుమాన్ మందిర్ నిర్మాణానికి త న వంతు చేయూతనిచ్చారు. ఎం తో ముఖ్యమైన వైకుంఠ ధామం కో సం సొంత భూమిని అప్ప గించారు. సర్పంచ్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఊరి కోసం తన వం తు సేవ చేశారు. రాజయ్య సేవల వల్లనే గ్రామానికి ఎంపీపీ పదవి ద క్కింది. ఆయన అనుచరులనే ఒక సారి ఎంపీ పీగా, పలు మార్లు స ర్పంచ్ గా గ్రామస్తులు ఎన్నుకున్నా రంటే ఆయన పట్ల అక్కడి ప్రజలకు ఎంత నమ్మకం ఉన్నదో అర్థమవు తుంది.

    ఆతర్వాత రిజర్వేషన్ లు అనుకూ లంగా రాకపోవడం, పరిస్థితులు మారిపోవడం.. ఇంటి బాధ్యతలు పెరగడంతో రాజయ్య క్రియాశీల రా జకీయాలకు కొంత దూరయ్యారు. ప్రస్తుతం సంగారెడ్డిలో నివా సం ఉం టున్నారు. సరస్వతీ శిశుమందిర్ ద్వారా సేవ చేస్తున్నారు. అయిన ప్పటికీ ఈనాటికీ గ్రామస్తులు ఆయ న వద్దకు వస్తుం టారు.వారికి చేత నైన సాయం చేస్తుంటారు. సుమా రుగా 70 సంవత్సరాల వయసు లో సొంత ఊరి పట్ల ఇంకా మమకారం చూపుతున్నారు. ఊరి పేరు చెబి తేనే ఆయన పులకించిపోతారు.

    తరచూ వెళ్లి వస్తుంటారు… ఊరి లోకి వెళ్ళగానే గ్రామస్తులు ఆయ న్ని పలకరించే విధానం చూస్తేనే.. ఎంతటి అభిమానాన్ని మూట గట్టు కున్నారో అర్థమవుతుంది. అప్పు డెప్పుడో తననునమ్మి ఓటేసి న ఊ రి కోసం ఈనాటికీ ఎంతోకొంత సేవ చేయడం రాజ య్యకే సొంతం అ య్యింది. అందుకని ఆయన తన పే రును సార్ధకం చేసుకున్నారని చెప్ప వచ్చు. ఏదిఏమైనా ప్రస్తుత పంచా యతీ ఎన్నికల నేపద్యంలో ఇలాం టి నాయకులను ఎంచుకొని ఎన్ను కుంటే ఎంతో బాగుంటుందని రాజ కీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.