Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి మాజీ మంత్రి హరీష్ రా వు శుభాకాంక్షలు తెలిపారు. అయి తే ఈ రెండేళ్ల కాలంలో అ సెంబ్లీ ని ర్వహణలో చోటుచేసుకున్న తీవ్రమై న వైఫల్యాలు, నిబంధనల ఉల్లం ఘనలపై ఆయన ఆవేదన వ్యక్తం చే స్తూ స్పీకర్ కు బహిరంగ లేఖ రా శారు. అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో జరుగుతు న్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగ ట్టారు.
శాసనసభ పనిదినాలు గణనీయం గా తగ్గిపోవడం పట్ల హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవసరమైనన్ని రోజులు సభను ని ర్వహించాల్సి ఉన్నా, అది జరగడం లేదని పేర్కొన్నారు. అలాగే, సరైన కారణాలు లేకుండా సభను తరచు గా, హఠాత్తుగా వాయిదా వేయడం సభా సమయానికి సంబంధించిన రూల్ 13 తోపాటు వాయిదా పద్ధ తులకు సంబంధించిన రూల్ 16 ల కు విరుద్ధమని తెలిపారు.
సభలో ప్రజా సమస్యలపై ప్రభు త్వాన్ని నిలదీసేందుకు సభ్యులకు ఉన్న ప్రధాన క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని హరీష్ రావు ఆ వేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రూల్స్ 38 నుంచి 52, అదేవిధంగా రూల్స్ 53 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలను పాటించడం లేదని అన్నారు. సభలో మంత్రుల నుంచి నేరుగా సమాధానం వచ్చే స్టార్డ్ క్వ శ్చన్స్ చర్చకు రాకుండా చేస్తున్నా రని, తద్వారా రూల్ 38 కల్పించిన ప్రశ్నల సమయ హక్కును కాలరా స్తున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఒక ప్రశ్నకు సం బం ధించి లోతుగా చర్చించేందుకు, ప్ర భుత్వం నుండి స్పష్టత తీసుకునేం దుకు సభ్యులకు ఉండే సప్లిమెంట రీ క్వశ్చన్స్ అవకాశాన్ని నిరాకరించ డం, కుదించడం రూల్ 50 ప్రధాన ఉద్దేశానికి విఘాతం కలిగించడ మే నన్నారు. ప్రజా సమస్యలను తక్షణ మే ప్రస్తావించే జీరో అవర్‌ను కూడా ప్రతిసారి కుదించడం సభా హక్కు లను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.
అంతేకాకుండా అన్ స్టార్డ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం.. రూ ల్ 39 ప్రకారం వీటికి లిఖితపూర్వక సమాధానాలు సభలో ప్రవేశపె ట్టా లి. అలాగే రూల్ 41 ప్రకారం నిర్ణీత గడువులోగా సభ్యులకు ఆ సమా ధానాలు అందజేయాలి. కానీ ఈ నిబంధనలను పాటించకపోవడం వల్ల సభ జవాబుదారీతనం లోపిం చిందని హరీష్ రావు ఆందోళన వ్య క్తం చేశారు.
గత రెండేళ్లుగా అసెంబ్లీలో హౌస్ క మిటీలను ఏర్పాటు చేయకపో వ డం చాలా బాధాకరమని హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ ని బం ధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమిం చాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ పని చే యడం లేదన్నారు. అసెంబ్లీ సమా వేశాలు ముగిసినా, కమిటీల పని మాత్రం ఆగకూడదని రూల్ 227 స్పష్టంగా చెబుతోందని, కానీ అస లు కమిటీలే లేకపోవడం వల్ల ప్రభు త్వ పనితీరుపై పర్యవేక్షణే లేకుండా పోయిందని ఆయన తెలిపారు. అలాగే, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీ ని తిరిగి ఏర్పాటు చేయలేదని గు ర్తుచేశారు.
కమిటీల పని ఎప్పుడూ ఆగకూడద ని, సమావేశాలకు సరిపడా సభ్యు లు ఉండాలని రూల్స్ 199, 201 చెబుతున్నా వీటిని పట్టించుకోక పో వడం వల్ల కమిటీల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని ఆవేదన వ్య క్తం చేశారు.డిప్యూటీ స్పీకర్ నియా మకం జరగకపోవడం మరో ప్రధాన ఉల్లంఘన. రూల్ 8 ప్రకారం డిప్యూ టీ స్పీకర్‌ను తప్పనిసరిగా ఎన్నుకో వాల్సి ఉంటుంది. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే ప్రివిలేజ్ క మిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్‌గా వ్యవహరిస్తారు కాబట్టి, ఆ పదవి ఖాళీగా ఉండటం వల్ల కమిటీ పూ ర్తిగా నిర్వీర్యం అయిపోయింద న్నా రు. ఫలితంగా, సభ్యుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అనేక ఫిర్యాదులు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని, ఇది రూల్ 256 మరియు 257 లకు విరుద్ధమ ని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చ ర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని హ రీష్ రావు అసహనం వ్యక్తం చేశా రు. శాసనసభ (ఫిరాయింపుల నిరో ధక) నిబంధనలు-1986, ముఖ్యం గా రూల్స్ 3 నుండి 7 ప్రకారం.. వి చారణ జరిపి, నోటీసులు జారీ చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవా ల్సి ఉన్నా తీసుకోకపోవడం శోచనీ యం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) కు పూర్తిగా విరుద్ధమని స్ప ష్టం చేశారు.
గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెం దిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సం దర్భంగా ఆయన గుర్తుచేశారు. ఫి రాయింపు పిటిషన్లపై నిర్ణీత గడు వులోగా స్పీకర్ నిర్ణయం తీసుకో వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చ రించినప్పటికీ, ఆ తీర్పును పట్టిం చుకోకపోవడం రాజ్యాంగ విలువ లను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తక్షణమే అసెంబ్లీ నిర్వహణలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని
ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వ హ ణను సరిదిద్దాలని డిమాండ్ చేశా రు. అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువు లోగా సమాధానాలు ఇవ్వాలని,
అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని, డిప్యూటీ స్పీ కర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిం చాలని అప్పీల్ చేశారు.
ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించా లన్నారు. సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలని
పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిష న్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగు ణంగా వెంటనే నిర్ణయం తీసుకోవా లని డిమాండ్ చేశారు.
