CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో స్టార్టప్ కంపెనీను ప్రోత్సహిం చడానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూ పాయలతో స్టార్టప్ ఫండ్‌ను ఏర్పా టు చేస్తున్నట్టు ముఖ్యమం త్రి ఎ. రే వంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నిధుల ను సద్వినియోగం చేసుకుని స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడమే కా కుండా కనీసం 1బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశా రు. హైదరాబాద్ టీ-హ బ్ (T-Hub) లో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్ట ప్స్ హబ్ (Goo gle for Startups Hub) ను ము ఖ్యమంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. హై దరాబాద్‌లో ఏర్పాటవుతున్న స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ కంపె నీలుగా ఎదగాలన్న లక్ష్యంతో పని చేయాల న్న ఆకాంక్షను వ్యక్తం చే శారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ముఖ్య మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్ లు యూనికార్న్ కంపెనీలు గా ఎదగాలని ఆశిస్తున్నా. అంటే క నీసం 1 బిలియన్ డాలర్ల విలు వ కలిగిన కంపెనీలు ఎదగాలి. వీటిల్లో 2034 నాటికి కనీసం 10 స్టార్టప్‌లు సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి.1998 లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇద్దరు మిత్రులు కలిసి కారిఫోర్నియా లో స్టార్టప్‌గా ప్రారంభించిన ఒక గ్యారేజీయే ఇప్పుడు గూగుల్‌గా అవతరించింది. ఇదెంతో స్ఫూర్తి దాయకమైన అంశం.
రాష్ట్ర భవి ష్యత్తు కోసం ఒక విజన్ తో ముందుకు సాగుతూ, ప్రపం చానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచ యం చేయాలన్న లక్ష్యంతో రెం డు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌పైన గ్లోబల్ స మ్మిట్ను నిర్వ హించాం. జాతీయ అంతర్జాతీయ కార్పోరేట్ ప్రతి నిధుల సమక్షంలో తె లంగాణ రైజింగ్ విజన్‌ను ఆవిష్కరించాం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, అలాగే 2047 నాటి కి 3 ట్రి లియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగా ణ రాష్ట్రం ఎదగాలని లక్ష్యం గా నిర్ధేశించుకున్నాం.
పదిహేను ఇరవై ఏళ్ల కిందట ప్రారం భించబడిన అనేక స్టార్టప్‌లు ఇప్పు డు బిలియన్స్ డాలర్ల కంపెనీలుగా ఎదిగాయి. గూగుల్ (#G oogle), ఆపిల్ (#Apple), అమెజాన్ (#A mazon), టెస్లా (#Tesla), మెటా (#Meta) వంటి ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి.గడిచిన 2 5 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ సర్వీసె స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హై దరాబాద్‌లో ప్రారంభమైన చాలా స్టార్టప్‌లు పెద్ద పెద్ద కంపెనీలుగా ఎదిగాయి.తెలంగాణ రైజింగ్ విజ న్లో స్టార్టప్‌లకు సంబంధించి మీ ప్రణాళిక ఏమని అడిగినప్పు డు స్టార్టప్‌లను నేను ఫుట్‌బాల్ క్రీడతో పోల్చుతా. ఎందుకంటే నేను ఫు ట్ బాల్ ఆడుతాను. ఫుట్‌బాల్‌లో స మిష్టి కృషి అవసరం. పట్టుద లతో సాధన చేయాలి. టీమ్ వర్క్‌తో పనిచేయాలి. చివరగా విజ యం సాధించడం చాలా ముఖ్యం. స్టార్ట ప్లు కూడా అదే విధంగా పనిచేయాలి.
హైదరాబాద్ ప్రస్తుతం వస్తు ఉత్ప త్తి ఆధారిత స్టార్టప్‌లు, ఇన్నొవే టివ్ స్టార్టప్‌లు, ఐపీ ఇంటెన్సివ్ స్టార్టప్ లపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవస రం ఉంది. హైదరాబాద్ కేవలం స్టా ర్టప్స్ మాత్రమే కాకుండా యునికా ర్న్ కంపెనీల హబ్‌గా ఎదగాలన్నది నా ఆకాంక్ష. హైదరా బాద్ నుంచి కనీసం 100 స్టార్టప్‌లు యూని కా ర్న్స్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తు న్నా. అంటే కనీసం 1 బిలియన్ డా లర్ల విలువ కలిగిన కంపెనీలు ఎద గాలి.
అలాగే 2034 నాటికి వాటి ల్లో కనీ సం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి. రాష్ట్రంలో అందుకోసం అవసరమైన ఒక మం చి వాతావరణం ఏర్పాటు చేస్తాం.స్టార్టప్‌లకు అవసరమైన స హకారం అందించడానికి తెలంగాణ ప్ర భుత్వం, గూగుల్ కలిసి పనిచేయబోతున్నాయి. స్టార్టప్ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లతో స్టా ర్టప్ నిధిని ఏర్పాటు చేస్తాం. ఆ నిధిని వినియో గించుకుని త ద్వా రా భవిష్యత్తులో స్టార్టప్‌లు గూగుల్ స్థాయిలో లేదా కనీసం 1 బిలి యన్ డాలర్ల కంపెనీ గా ఎదగాలని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.


