Wednesday, October 7, 2026
More
    HomePoliticsBodduballi Chandrasekhar : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ రాజ్యాధి కార పార్టీ యువజన విభాగం...

    Bodduballi Chandrasekhar : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ రాజ్యాధి కార పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బొడ్డుపల్లి చంద్రశేఖర్

    📰 Generate e-Paper Clip

    Bodduballi Chandrasekhar : ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగా ణ రాజ్యాధికార పార్టీ (TRP) యు వజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బొడ్డుపల్లి చంద్రశేఖర్ ని నియమి స్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎ మ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేస్తూ శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు.

    ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పార్టీ బలోపేతం, యువత చైతన్యం, బీసీ బహుజన హక్కుల రక్షణలో యువజన వి భా గం కీలక పాత్ర పోషించాల్సిన అవ సరాన్ని సూచించారు. యువతకు ఆత్మవిశ్వాసం నింపే నాయకుడిగా చంద్రశేఖర్ నియామకం పార్టీకి నూ తన శక్తిని తీసుకొస్తుందన్నారు. యువతలో సరికొత్త ఉత్తేజాన్ని తీ సుకురావాలని టిఆర్పీను ప్రతి గ డపగడపకు తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. ప్రజల సమస్యలకు పక్ష పాతం లేకుండా నిలబడాలని మల్ల న్న ఈ సందర్భంగా సూచించారు.

    TRP యువజన విభాగంలో కొత్త నాయకత్వం రావడంతో రాష్ట్ర వ్యా ప్తంగా కార్యకర్తల్లో నూతన ఉత్సా హం నెలకొందని యువతకు చేరువ గా, బహుజన హక్కుల కోసం పోరా డే దిశగా చంద్రశేఖర్ యువజన విభాగాన్ని ముందుకు నడిపిస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో TRP రా ష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హ రిశంకర్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చై ర్మన్ బందారపు నర్సయ్య, నాయ కులు పాకాల నర్సింహ్మ, చింతపం డు ప్రభాకర్, కిరణ్ ముదిరాజ్, డా క్టర్ సూర్యనారాయణ, వినీత్, శ్రీని వాస్, దశరథ, మల్లేష్, సుతారపు రంగన్న తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.