Monday, September 28, 2026
More
    HomePoliticsPhase Palle Poru Polling : బిగ్ బ్రేకింగ్, ముగిసిన మలిదశ ప ల్లెపోరు పోలింగ్,...

    Phase Palle Poru Polling : బిగ్ బ్రేకింగ్, ముగిసిన మలిదశ ప ల్లెపోరు పోలింగ్, మరికొద్దిసేపట్లో కౌంటింగ్ షురూ

    📰 Generate e-Paper Clip

    Phase Palle Poru Polling : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎ న్నికల పోలిం గ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ క్కడా చెదురుమ దురు ఘటనలు మినహా సాఫీగా సాగింది. మొ త్తంగా రెండో విడతలు 193 మండలాల్లోని 3,911 సర్పంచ్, 29,9 17 వా ర్డు సభ్యుల పదవు లకు ఎన్నికలు జరుగగా 12,782 మo ది సర్పంచ్ అభ్యర్థులు, 71,07 1 మంది వార్డు అభ్యర్థులు పంచా యతీ ఎన్నికల రణరంగంలో నిలి చిన విషయం తెలిసిందే.

    ఆదివారం ఉదయం 7 గంటలకు రెండో విడత పంచాయతీ ఎన్ని కల పోలింగ్ ప్రారంభం కాగా ప్రజలు భా రీగా తరలివచ్చి క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. అయితే మధ్యాహ్నం 1గంటలోపు పోలింగ్ కేంద్రాలకు చే రుకున్నవారికి అధి కారులు ఓటు వేసే అవకాశం కల్పించడం ఎన్నికల సంఘం నియ మావళి మేరకు అనవాయితీ అని తెలిసిందే. ఇప్పటికే పోలింగ్ పూ ర్తికావడంతో మధ్యాహ్నం భోజనం అనంతరం 2 గంటల నుంచి ఓ ట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు.

    మొదటవార్డు, సర్పంచ్ బ్యాలెట్లను వేరుచేసిన తర్వాత వార్డుల వారీగా ఓట్లను లెక్కించి తొలుత వార్డు ఫలితాలను ప్రకటిం చను న్నారు. ఆత ర్వాత చివరగా సర్పంచ్ ఫలితాలు వెల్లడి కానున్నా యి. హైదరాబాద్ నుంచి ఓటర్లు గ్రామాలకు తరలడంతో ఆయా చో ట్ల రహదారుల్లో రద్దీ నెలకొన్నది.

    పోలింగ్ కేంద్రాల ఆకస్మికంగా తనిఖీ : గ్రామపంచాయతీ ఎన్నిక ల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్రలక్ష్మి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి లు దామరచర్ల జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేశారు. అదే సం దర్భంలో ఒక బూతులో ఎక్కువ మంది ఓటర్లు ఉండడంపై ప్రిసైడిం గ్ అధికారిపై జిల్లా కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంని ర్వహణలో నిర్లక్ష్యం వహిం చినదు కుగాను పిఓ సంధ్యకు షోకజ్ నో లటీసు జారీ చేయాలని జి ల్లా కలెక్టర్ ఆదేశించారు.

    రెండో విడత గ్రామపంచాయతీ ఎ న్నికల పోలింగ్ లో భాగంగా ఆది వారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మితో కలిసి మిర్యాలగూడ డివిజన్ లోని దామ రచర్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శా లలోని పో లింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఓటు వే సేందుకు వచ్చిన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడడమే కాకుండా, ఓ టు వేసేందుకు గుర్తింపుగా తీసుకువచ్చిన గుర్తింపు కార్డుల గురించి జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

    అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలోని ఒక పోలింగ్ బూతులో పో లింగ్ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ పరిమితికి మించి ఓ టర్లు పోలింగ్ కేంద్రంలో ఉండడం పట్ల ప్రి సైడింగ్ అధికారిపై కలెక్ట ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలింగ్ కేంద్రం ని ర్వహణలో నిర్లక్ష్యం వ హించినందుకు గాను ప్రిసైడింగ్ అధికారి ,స్కూల్ అసిస్టెంట్ సంధ్య కు షోకాజ్ నోటీస్ జారిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ను పకడ్బందీగా నిర్వహించాలని ప్రతిరోజూ టేలికాన్ఫె రెన్సు తో పా టు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యం గా వ్యవహరించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

    పోలింగ్ అనంతరం కౌంటింగ్ ను జా గ్రత్తగా నిర్వహించాలని ఆర్ ఓలు అత్యవసరమై బయటికి వెళ్ళవలసి వస్తే తప్పనిసరిగా ఒక గజిటెడ్ ఆ ఫీసర్ కు స్టాచ్యూటరీ మెటీరియల్ అప్పగించి వెళ్ళా ల ని తెలిపారు. అ న్ని పోలింగ్ కేంద్రాల నుండి పోలైన బాలెట్స్ తో పాటు, ఎన్నికల సామా గ్రి వచ్చిన తర్వాత దగ్గరలోని ఎస్టి ఓలో భద్రపరిచే బాధ్యత ఎంపీడీవోదని అన్నారు.

    అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దామ రచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో 10 వార్డులకు పో లింగ్ జరుగుతున్నదని, ప్రశాంతంగా పోలింగ్ కొనసాగు తున్న ద ని, ఉదయం 11 గంటల వరకు 32 శాతం ఓట్లు పోలైనట్లు తెలి పారు. దామరచర్ల మండ లం పెద్ద మండలం అయినందున కౌంటిం గ్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు తె లి పారు. పోలింగ్ పూర్తి అయిన త ర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌం టింగ్ ప్రారంభమవుతుందని, ఎన్ని కల కమిషన్ నియమ ని బంధనల ప్రకారం కౌంటింగ్ చేపట్టాలని, ఫలి తాల ప్రకటనలో ఎ లాంటి జాప్యం చేయవద్దని ఈ సందర్భంగా ఆమె స్టేజ్ టు రిట ర్నింగ్ అధికారిని ఆదేశించారు.

    ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తా వి వ్వకుండా పకడ్బందీగా కౌం టింగ్ నిర్వహించాలని చెప్పారు. అంతకు ముందు మిర్యాలగూడ సబ్ కలె క్ట ర్ నారాయణ్ అమిత్ రెండవ విడ త గ్రామపంచాయతీ ఎన్నికలు జ రుగుతున్న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో పో లింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న ట్లు ఎన్నికల పరిశీలకురాలు,జిల్లా కలెక్టర్లకు వివరించారు.

    మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్ట ర్ నారాయణ అమిత్ తో పాటు, డి పి ఓ వెంకయ్య, దామరచర్ల ప్రత్యేక అ ధికారి, డిసిఓ పత్యానాయక్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.