–కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో హత్య కావించబడిన మల్లయ్య కుటుంబా న్ని పరామర్శించిన కేటీఆర్
–మృతుడు ఉప్పుల మల్లయ్య కు టుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సా యం
–పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రశాం త వాతావరణంలో తుంగతుర్తి
–భవిష్యత్ కు కెసిఆర్ పాలనే తె లంగాణకు శ్రీరామరక్ష
Ex Minister KTR : ప్రజా దీవెన, తుంగతుర్తి: ప్రజా స్వా మ్యంలో హత్య రాజకీయాలు ఎం త మాత్రం మంచిది కాదని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరి సి ల్లా ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆ దివారం ఇటీవల సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతన కల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య కాంగ్రెస్ కార్య క ర్తల దాడిలో హత్య కావించబడిన ఉప్పుల మల్లయ్య కుటుంబాన్ని ప రామర్శించి మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ గెలుపు కోసం తమ పార్టీ నా యకుడు మల్లయ్యను హత్య చే యడం హేయమైన చర్యని దీన్ని తీ వ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ అ న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను అమలు చేసినట్లయితే ఓట్ల కోసం ఇలా హత్యలు చేయాల్సి వచ్చేదా అని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్ని క లకు భయపడి దాడులు చేయడం ఏమిటి అని అన్నారు. దాడులతో ప్రజాస్వామ్యాన్ని అప హాస్యం పా లు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం త గి న మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
కెసిఆర్ పాలనే తెలంగాణకు శ్రీరా మరక్ష అని కేటీఆర్ అన్నారు. తా ము పది సంవత్సరాలు అధికారం లో ఉన్న నాడు తాము దాడులకు పాల్పడలేదని ఇలాంటి హత్య రాజ కీయాలు చేయలేదని ఒకవేళ చేసి ఉంటే ఈ రోజు పరిస్థితులు ఇలా ఉండేవా అని ప్రశ్నించారు. బిఆర్ ఎస్ పార్టీ ప్రజ ల్లో బలంగా ఉండ డంతో తాము ఎక్కడ ఓడిపోతా మని భయంతో గ్రామాల్లో బయో త్పాతం సృష్టిస్తూ హత్యలు దా డు లకు పాల్పడుతున్నారని ఇది ప్ర జా స్వామ్యానికి మంచిది కాదని కేటీ ఆర్ హితవు పలికారు.
ఎల్లమ్మ గూడెం గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థులు కిడ్నాప్ చేసి మూత్రం తగించారని దౌర్జన్యానికి కాంగ్రెస్ వారు పాల్పడ్డారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న రో జుల్లో ప్రజలు మరింత చైతన్య వం తం అవుతారని అభివృద్ధి నిరోధ కు లైన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చె ప్తారని అన్నారు. మల్లయ్య కుటుం బానికి తమ ప్రభుత్వం వచ్చిన అ నంతరం కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం ఇస్తామని వారి కు టుంబాన్ని అన్ని విధాల తాము ఆ దుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ప్రతి కార్యకర్తకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రజలు అ ధై ర్యపడవద్దని అన్నారు. నాయకులు కార్యకర్తలు సంయ మనం పాటిం చాలని హింస మార్గంతో ఏది సా ధించలేమని దాడులకు ప్రతి దా డు లు సరికాదని కాంగ్రెస్ పార్టీ దాడు లు మానుకోకపోతే ప్రతిదాడులు చే యాల్సి వస్తుందని తాము సమ యమున కోల్పోతే కాంగ్రెస్ పార్టీ వా రు మిగలరని తమ సహనాన్ని పరీ క్షించవద్దని తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకుల నుద్దేశించి అన్నారు.
ఎన్ని ఎత్తులు, కుట్రలు పన్నిన 50 శాతం సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ గెలుచుకుందని కేటీఆర్ అన్నారు. అందుకే కాంగ్రెస్ నాయకులు మ రో సారి ఆలోచించి శాంతియుత వా తావరణంలో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెంట మా జీ మంత్రి, సూర్యాపేట శాసనస భ్యులు గుంత కండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బూ డి ద బిక్షమయ్యగౌడ్, కంచర్ల భూపా ల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, ఒంటెద్దు నరసిం హారెడ్డి లతో పాటు పలువురు బి ఆ ర్ ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కా ర్యకర్తలు పాల్గొన్నారు.
