Monday, September 28, 2026
More
    HomeIndiaBondi Beach shooting : బిగ్ బ్రేకింగ్, ఆస్ట్రేలియా బాండీ బీ చ్‌లో కాల్పుల కలకలం,...

    Bondi Beach shooting : బిగ్ బ్రేకింగ్, ఆస్ట్రేలియా బాండీ బీ చ్‌లో కాల్పుల కలకలం, పర్యాట కు లపై ముసుగు ధరించిన దుండగుల దాడి

    📰 Generate e-Paper Clip

    Bondi Beach shooting : ప్రజా దీవెన, ఆస్ట్రేలియా: ఆస్ట్రేలి యాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాoడీ బీచ్‌ కాల్పుల కలకలం నెల కొంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒ క్కసారిగా కాల్పులకు తెగప డడం తో ఆ ప్రాంతం ఉల్లిక్కిపాటుకు గురైంది.

    ఆదివారం అక్కడ జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ము సుగు ధరించిన దుండగులు పర్యా టకులను లక్ష్యంగా చేసుకు ని తు పాకులతో విచక్షణారహితంగా కా ల్పులు జరిపిన దాడిలో పదిమం ది కిపైగా పర్యాటకులు మృతి చెందగా మరికొందరు తీవ్రం గా గాయపడినట్లు సమాచారం.

    బీచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యా టకులు ఉండటంతో ఒక్కసా రిగా భయాందోళనలు నెలకొన్నాయి. కా ల్పులు జరుగుతున్న సమ యంలో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలా నికి చేరుకుని పరి స్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశా రు.

    ఇదిలా ఉండగా దుండగులను అ దుపులోకి తీసుకునే క్రమంలో పో లీసులు ఎదురుకాల్పులు జరపగా ఒక దుండగుడు అక్కడికక్కడే మృ తి చెందాడు. మరో దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచా రణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా కార్డ న్‌ చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఈ దాడికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇది ఉగ్రదాడి యా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు లో తుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ స్ట్రేలియాలో తీవ్ర ది గ్భ్రాంతిని కలిగించగా, బాండీ బీచ్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. ఈ దాడిలో దాదాపు పది మంది కి పైగానే దుర్మరణం పాలైనట్లు సమాచారం అందుతోంది. ఈ కాల్పుల ఘట నకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.