–బీసీ రిజర్వేషన్ల సాధన కోసం దేశా న్ని ఏకంచేస్తాం
–జనవరిలో బీసీ బిల్లుకు మద్దతు కూడగడతాం
–పార్లమెంటులో కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలి
–బిఆర్ఎస్ పెట్టిన ప్రైవేట్ బిల్లుకు బిజెపి, కాంగ్రెస్ లు మద్దతివ్వాలి
–మార్చిలో లక్షలాదిమందితో హైద రాబాదులో బీసీ సింహగర్జన సభ
BIG BREAKING : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశవ్యా ప్తంగా ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దామాశ ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని దేశం లోని 11 రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మా నం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిం చారని, ఇంకొక వైపు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు లో న్యాయపోరాటం చే స్తున్నారని, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న అన్ని రాష్ట్రాలను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమా న్ని ఉధృతం చేస్తామని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జా జుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని సెమినార్ హాల్ లో మంగళవా రం నిర్వహించిన ఓబీసీ జాతీయ సెమినార్ లో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, అధికార ప్రతినిధి తాటికొండ విక్రమ్ సమన్వయం చే యగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎం పీ వి హనుమంతరావులు హాజర య్యారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రి జర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ పార్టీ పా ర్లమెంటు లో ప్రవేట్ బిల్లును ప్రవేశ పెట్టాలని, ఈ బిల్లుకు బిజెపి మద్దతు పలకాల ని లేదంటే ఇప్పటికే బిఆర్ఎస్ ఎం పీ వద్దిరాజు రవిచంద్ర పార్లమెంటు లో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు కాంగ్రెస్ బిజెపి పార్టీలు మద్దతు పల కాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పందించకపోతే రైతు ఉద్యమ త రహాలోనే దేశాన్ని ఒక్కటి చేసి ఉ ద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఫి బ్రవరిలో తెలంగాణలో రాష్ట్రవ్యాప్త బీసీ యాత్ర చేపట్టి మార్చిలో ల క్ష లాదిమందితో హైదరాబాదులో సిం హగర్జన సభను నిర్వహించి బీసీల తడాఖాను ఢిల్లీ పెద్దలకు చూపిస్తా మని ఆయన హెచ్చరించారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి నారా యణ మాట్లాడుతూ జనాభాలో 56 శాతం పైగా ఉన్న బీసీలను అ న్ని పార్టీలు మోసం చేస్తున్నాయని, ఒకవైపు రాజకీయ పార్టీలు అన్యా యం చేస్తుంటే ఇంకొక వైపు పచ్చ గట్టిగా పచ్చపాము కనపడకుండా కాటు వేసినట్టు బిసి నాయకులే బీ సీలను బలి తీసుకుంటున్నారని ఆ యన విమర్శించారు బిసి ఉద్యమా నికి జాతీయస్థాయిలో సిపిఐ అండ గా ఉంటుందని ఆయన ప్రకటించా రు.
మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మా ట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపు బాధ్యత కాంగ్రెస్ బిజెపి పార్టీలదేన నీ వారిపైన ఒత్తిడి పెంచడానికి తె లంగాణ ఉద్యమ తరహాలోనే బిసి ఉద్యమాన్ని చేపడతామని ఆయన తెలిపారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం టిఆర్ఎస్ పార్టీ నుండి పార్ల మెంటులో ప్రైవేట్ బిల్లును ప్రవేశపె ట్టామని దీనిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ దేనిని ఆయన తె లిపారు. బీసీ జేఏసీ ఉద్యమానికి టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆయన ప్రకటిం చారు
మాజీ పార్లమెంట్ సభ్యులు వి హ నుమంతరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పైన పార్లమెంటులో ప్రవే ట్ బిల్లును ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీకి తాను లేఖ రాశానని అతి త్వరలోనే ఏఐసిసి అధ్యక్షులు మ ల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాలను పిసిసి అధ్యక్షు డు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తె లిపారు.
ఈ సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక సురేష్, ప్రొఫెసర్ సం ఘని మల్లేశ్వర్, బీసీ జేఏసీ నేతలు పిట్ల శ్రీధర్, బి మనీ మంజరి, కవుల జగన్నాథం, కే వీరస్వామి, జాజుల లింగం, నందగోపాల్, వేముల రామ కృష్ణ,కే వెంకటేష్ గౌడ్, మాధవ్, స్వ ర్ణ, గౌతమి, శివమ్మ, తదితరులు పా ల్గొన్నారు.

