Tuesday, September 29, 2026
More
    HomeIndiaTUWJ State President Allam Narayana : గజిబిజి జీవోపై జిల్లాకలెక్టరేట్ల నిరసనలకు తరలిరండి

    TUWJ State President Allam Narayana : గజిబిజి జీవోపై జిల్లాకలెక్టరేట్ల నిరసనలకు తరలిరండి

    📰 Generate e-Paper Clip

     

    TUWJ State President Allam Narayana : ప్రజా దీవె న, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పో షిం చిన జర్నలిస్టులకు కనీస గుర్తిం పును కూడా రద్దు చేస్తారా అని తె లంగాణ మీడియా అకాడమీ తొలి చైర్మన్, టియూడబ్ల్యూజె (టిజేఎ ఫ్) అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రశ్నించారు. లోపభూయి ష్టమైన జీవో 252 ను తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశా రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 239 ను రద్దు చేయడం తెలంగాణ జర్నలిస్టుల హక్కులను కాల రాయడమే నని గుర్తు చేశారు. ప్రధానంగా డెస్క్ జర్నలిస్టులను అకాడమీ చైర్మ న్ కె శ్రీనివాస్ రెడ్డి పగబట్టడం అన్యాయమని పేర్కొన్నారు.

    జర్న లిస్టుల అక్రెడిటేషన్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొ చ్చిన జీ ఓ నం.252 ను వ్యతిరేకి స్తూ డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటే షన్లు రద్దు చేయడం పెద్ద సంఖ్యలో జర్నలిస్టుల అక్రెడి టేషన్ లను కు దించడంపై నిరసనగా ఈ నెల 27 వ తేదీన శని వారం అన్ని జి ల్లాల కలెక్టరు కార్యాలయాల ముందు తలపెట్టిన నిరసన కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

    సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సvమావేశంలో ఆయన యూని యన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, ఉపాధ్యక్షుడు ర మేశ్ హజారి, కోశాధికారి యోగా నంద్, తేంజు ప్రధాన కార్యదర్శి ర మణ కుమార్, ఐజెయు జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్క ర్, హైదరాబాద్ జిల్లా ఇంచార్జీ న వీ న్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఉ పాధ్యక్షుడు ఎన్.మల్లేశ్, సుద ర్శన్ రెడ్డి, కోశాధికారి బాపూరావు తదితరులతో కలిసి మాట్లాడారు. డెస్క్ జర్నలిస్టుల మీద ఎందుకు వి వక్ష అంటూ ప్రశ్నించారు. 23 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత గత ప్రభు త్వానిదని, నూతన తెలంగాణ రాష్ట్రంలో త్యాగాలు చేసిన జర్నలి స్టులందరికీ బే ధం లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చే శారు.

    జర్నలిస్టుల జాతరలో పదివేల మందిలో జర్న లిస్టుల సంక్షే మ పాలసీని ప్రకటిం చిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి నాళ్లలోనే జర్నలిస్టుల సం క్షేమం కోసం కృషి చేశారని గుర్తు చే శా రు. సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి తదితర ప్రముఖుల ఆధ్వర్యంలో అకాడమీలో సీనియర్ జర్నలిస్టులతో చర్చించి పాల సీని నిర్ణయించారని గుర్తు చేశారు. డెస్క్ జర్నలిస్టులకు కూడా ప్రా ముఖ్యత నిచ్చి అక్రిడేషన్లు ఇవ్వాలని, నాటి ముఖ్యమంత్రితో సమా వేశంలోనే నిర్ణయించడం జరిగిందన్నారు.

    మహిళా జర్నలిస్టుల భాగస్వా మ్యం ఉండాలని 33 శాతం మహి ళలకు కూడా కేటాయించిన ఘనత నాటి కెసిఆర్ ప్రభుత్వానికి నా టి మీడియా అకాడమీదేనన్నారు. నాటి కెసిఆర్ ప్రభుత్వంలో జారీ చే సి న 239 జీవో స్ఫూర్తి కి గండి కొట్టి వి ధంగా నేటి 252 జీవో ఉన్నందున దానిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాడు కల్చరల్ రిపోర్టర్లకు, స్పోర్ట్స్ రిపోర్టర్లకు, ఇట్లా ప్రతి ఈ విభా గానికి ఆ విభాగానికి విడివిడిగా అక్రిడేషన్లు జారీ చేసినం, కానీ ఇ ప్పుడు అవన్నీ రద్దు చేయడం దుర్మార్గమని అవేదన వ్యక్తం చేశా రు. వార్తా సేకరణలో ఫీల్డ్ జ ర్నలిస్టులది ఎంతటి కీలక పాత్రనో వార్తను తీర్చి దిద్దడంలో డెస్క్ జర్న లిస్టులది అంతే కీలక పాత్ర అని వి వరించారు. ఈ నేపథ్యంలో డెస్క్ జర్నలిస్టుల అక్రిడేషన్లు రద్దు చేయ డం అంటే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించా రు.

     

    కొత్త జీవోలో పెద్ద పత్రికలకు పెద్ద చానళ్ల జర్నలి స్టులకు గుర్తింపు కా ర్డులను కోత విధించడం సరికాదని, కేబుల్ ఛానల్ ను దారుణంగా నిర్ల క్ష్యం చేశారని, మండల స్థాయిలో ప నిచేసిన జర్నలిస్టు తెలం గాణ ఉద్య మంలో కీలకంగా భాగస్వాములు అయ్యారని, తెలంగా ణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకు పోవడంలో వారి పాత్ర గొప్పదని పేర్కొన్నారు.వారిని గుర్తించిన నాటి సీఎం కేసీఆ ర్ అక్రిడేషన్లు సహా అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, వారికి నేడు కనీస గుర్తింపు కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.

    అరుణ వంటి కష్టకాలంలో జనుల కు జర్నలిస్టులకు అండగా నిలి చింది నాటి మీడియా అకాడమీ నాటి కెసిఆర్ ప్రభుత్వమేనని గు ర్తు చేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ జర్నలి స్టు ల సంక్షేమ ని ధికి రూ. 100 కోట్ల నిధులు ఏర్పా టు చేయడానికి సంకల్పించి, నాటి కెసిఆర్ ప్రభుత్వం రూ. 42 కోట్లు కేటాయించ డం జరిగిందన్నారు.మీరు అంతకంటే గొప్పగా ఏమైనా చేస్తే చేయం డి కానీ ఉన్నవి కూడా పీకడం జర్నలిస్టుల నోట్లో మట్టికొట్టడమే నని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    పత్రికా యాజమాన్యాలు జర్నలిస్టు లకు ఐడీ కార్డు ఇస్తున్నప్పుడు దాని మీద రిపోర్టర్ కం సబ్ ఎడిటర్ అనే ఉంటుందని, మారిన కాలమాన ప రిస్థితులలో జర్నలిస్టులు ఫీల్ మీద డెస్క్ మీద మల్టీ పుల్ గా పనిచేస్తా రని తెలిపారు. ఎవరిని ఎక్కడ విని యో గించు కోవాలో నిర్ణయించుకోవాల్సింది ఆయా పత్రికల చానల్లో య జమా నులు ఎడిటర్లు మాత్రమే నని ప్రభుత్వము కాదని హితవు పలికా రు. భవిష్యత్తులో జీవో నెం బర్ 252 ద్వారా పత్రికా సంస్థల యాజ మాన్యాలకు కూడా సమస్య గానే మారుతుం దన్నా రు.నాటి 239 జీవోలు ఉన్న లోపాలు ఏమిటో చర్చకు సిద్ధమా, అది మాది సమగ్ర మైన జీవో అని మేము నిరూపిస్తాం, మీరిచ్చిన జీవో పై కూడా చర్చ ద్దామని అన్నారు. ఇది పూర్తిగా డెస్క్ జర్నలిస్టు ల మీద క క్ష తీర్చు కోవడం తప్ప మరొకటి కాదన్నారు.

    వారిని రెండవ శ్రేణి పౌరులుగా చూ స్తూ మీడియా కార్డు పేరుతో వాళ్ళ అక్రిడేషన్ను హక్కును రద్దు చేయ డం చూస్తూ ఊరుకోమని, జర్నలి స్టుల అందరి హక్కుల కోసం టియు డబ్ల్యూజేఎఫ్ పోరాడ డానికి ఎల్లవే ళలా ముందంజలో ఉంటుందని హె చ్చరించారు. జర్నలిస్టులందరూ టిడబ్ల్యూఏ పోరాటంలో కలిసి ముందుకు రా వాలని కోరారు.ఈ నెల 27వ తేదీన శనివారం రా ష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఆయా జిల్లా కలెక్టర్ల ముందు నిరసన కార్య క్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ కోస మే తెలంగాణ జర్నలి స్టు అనే ని నాదం తో పోరాటం చేసిన ఘనత టీయూడ బ్ల్యూజే టిజెఫ్ ది అని అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జర్నలిస్టుల హ క్కులను కాపాడుకుందామని అప్పీల్ చేశారు.

     

    యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆ స్కాని మారుతీ సాగర్ మాట్లాడు తూ గత కెసిఆర్ ప్రభుత్వంలో విడు దల చేసి తెలంగాణ జర్నలి స్టుల సంక్షేమం కోసం ఆదర్శవంతంగా అమలు చేసిన నాటి జీవో నెంబర్ 239 లో అంశాలను నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో విడు దల చేసిన వివాదాస్పదమైన 252 జీవో ను పోల్చుతూ యూని య న్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ వివరాలను వెల్లడిం చారు. పెద్ద పత్రిక లకు గత ప్రభుత్వం ఇచ్చిన మొత్తం కార్డులలో సగానికి సగం అక్రెడిటే షన్లు తగ్గించారని ఆరోపించారు. సాటిలైట్ చానళ్లు, స్మాల్ అండ్ మీ డియం , చిన్న పత్రికలకు కూ డా కోత విధించడం అన్యాయమని, కే బుల్ ఛానల్లకు ఏకపక్షంగా రద్దుచే యడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు అర్హత 10 ఎండ్లనుంచి 15 ఏండ్లకు పెంచడం సీనియర్ జర్నలిస్టుల హ క్కులను హరించడమేనన్నారు.

    ఇంకా అనేక విధాలుగా జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ ప్రభు త్వాన్ని పక్కదారి పట్టిస్తూ, వివాదాస్పద జీవో విడుదలకు కారణ మైన మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల ప్రశ్న లకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.252 జీవో ను సవ రించకుంటే జర్న లిస్టుల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభు త్వాన్ని మారుతి సాగర్ హెచ్చించారు. శనివారం తెలంగాణ వ్యా ప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను వి జయవంతం చేయాలని ఫీల్డ్ మరి యు డెస్క్ జర్నలిస్టులకు పిలు పునిచ్చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.