–జర్నలిస్టులకు అన్యాయం చేస్తే సమాజమే సహించదు
–హక్కుల సాధన కోసం అంతు చూసేందుకైనా సంసిద్ధం
–టీయూడబ్ల్యూజే 143 జిల్లా అ ధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌ డ్
–కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల భారీ నిరసనలో కలెక్టర్ కు వినతిపత్రం
Nalgonda Journalists Protest : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జా రీచేసిన జీవో ఎంఎస్ నెంబర్ 252 ను వెంటనే సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలి స్ట్స్ టీయూడబ్ల్యూజే 143 జిల్లా అ ధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌ డ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్త ర్వులు 252 జీవో సవరణ కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్ల గొండ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజే శారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డెస్క్ జర్నలిస్టుల హక్కులకు భం గం కలిగించే విధంగా తీసుకొచ్చిన జీఓ 252లోని నిబంధనలను వెంట నే సవరించాలని డిమాండ్ చేశారు.
జీ ఓ 252లో స్పష్టతలేని నిబంధన లు, అక్రిడిటేషన్లలో భారీ కోతలు, మీడియా అక్రిడిటేషన్ కార్డు మీడి యా కార్డు పేరుతో గందరగోళం సృ ష్టించారని ఆరోపించారు.
రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేబుల్ ఛానెల్స్, పార్ట్‌టైం రిపోర్టర్లు, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు జరు గుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి, అర్హులైన ప్రతి జ ర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందేలా జీ ఓ 252ను పునఃసమీక్షించి సవరిం చాలన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించక పోతే, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రాజ్యాంగం కల్పించిన హక్కు ల ద్వారా దీర్ఘకాలిక ఆందోళన కా ర్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.సమస్త జర్నలిస్టుల హక్కుల కోసం యూనియన్లకు అ తీతంగా, ఐక్యంగా ఉద్యమిస్తామ న్నారు. జర్నలిస్టులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని, హక్కుల సా ధన కోసం ప్రాణ త్యాగానికైనా జ ర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారన్నారు.
జీ ఓ 252లో గజిబిజి నిబంధనల తో జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలను మానుకో వాలన్నారు.
‘మీడియా అక్రిడిటేషన్ కార్డు – మీ డియా కార్డు’ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని, ఏ కార్డు వల్ల ఏ ప్ర యోజనం అనే స్పష్టత లేదని విమ ర్శించారు. కొత్త నిబంధనలతో 10 వేలకుపైగా అక్రిడిటేషన్ల కోత పడే ప్రమాదం ఉందని, రిపోర్టర్లు–డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృ ష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. కేబుల్ ఛానెల్స్, పా ర్ట్టైం రిపోర్టర్లకు తీవ్ర అన్యాయం జ రగనుందని, ఇండిపెండెంట్ జర్నలి స్టుల అనుభవం 10 నుంచి 15 ఏళ్ల కు పెంపుపై అభ్యంతరం వ్యక్తం చే శారు. మెజారిటీ జర్నలిస్టులు వ్యతి రేకిస్తున్న జీ ఓ 252ను వెంటనే సవ రించాలని, ప్రభుత్వం స్పందించ క పోతే దీర్ఘకాలిక ఆందోళనలకు వేన కాడేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జి ల్లా ప్రధాన కార్యదర్శులు వీరస్వా మి, శివకుమార్, అన్నబోయిన మ ట్టయ్య, మామిడి దుర్గా ప్రసాద్, బి.జనార్ధన్ రెడ్డి, నాగేశ్వర్ రావు, మేకల వరుణమ్మ, సురేష్, లక్ష్మీనా రాయణ, సత్య విజయ్, గాదె రమే ష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షు డు వెంకట్ రెడ్డి, గాలెంక గురుపా దం, రవికుమార్, లక్ష్మీనారాయణ, పోటో జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు వెంకటరమణ, ముచర్ల శ్రీనివాస్ గౌడ్, కారింగ్ శ్రీనివాస్ గౌ డ్, దండపల్లి రవికుమార్, మధు, డిజెటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు పగ డా ల సురేష్, ప్రధాన కార్యదర్శి తాడిశె ట్టి లక్ష్మీ నారాయణ, సభ్యులు న రేందర్ రాజు, అజీజ్, నాగరాజు, సురేష్ వెంకటేశ్వర్లు జాకీర్, శ్రీనివా స్, సాయి, శీను, గిరి, టియూడబ్లు జే నియోజక అధ్యక్షులు లక్షణ్, కొ మ్ముగిరి, ప్రసన్న, ఆంజనేయులు, భిక్షం, వినోద్, సైదులు, జర్నలిస్టు లు, డెస్క్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




