Monday, September 28, 2026
More
    HomeOpinionMLA Komatireddy Raj Gopal Reddy : నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడొద్దు 

    MLA Komatireddy Raj Gopal Reddy : నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడొద్దు 

    📰 Generate e-Paper Clip

     

    MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు నియోజకవర్గం లో ఏ ఒక్కరు కంటిచూ పు సమస్యతో బాధపడేవారు ఉండవద్దన్న అభిమ తంతో తాను ముందుకెళ్తున్నట్లు స్థా నిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపా ల్ రెడ్డి పునరుద్ఘాటించారు. మును గోడు నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బా ధపడొద్దని తన మాతృమూర్తి కోమ టిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాల కు శ్రీకారం చుట్టిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో ఆదివారం మునుగోడు లో గల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన కమిటీ వై ద్య శిబిరాలను తనిఖీ చేశారు.

    ఆదివారం 11 విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు నియోజకవర్గ కేంద్రాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణ లో జ్యోతి ప్రజ్వలన చేసి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పిం చి ప్రారంభించారు. ఐదు కౌంటర్లలో కంటి పరీక్షల నిర్వహణ సరళిని ప రిశీలించి కంటి సమస్యలతో బాధ పడుతున్న వృద్ధులకు నే నున్నా న ని భరోసా ఇచ్చారు. అనంతరం కం టి పరీక్షలకు చేయించుకోవడానికి వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించారు. కండ్లు చూయించుకో డానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన వసతి కూడా కల్పించారు.

    ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆ సుపత్రి వారి సౌజన్యంతో కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిర్వహి స్తోంది. ఈ 11 వ విడత ఉచిత కం టి వైద్య శిబిరాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక నాయకులు కోమటిరెడ్డి రాజగోపా ల్ రెడ్డిఅభిమానులు గత వారం రో జులుగా గ్రామాలలో ప్రచారం చేస్తూ కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి ఉచిత వైద్య శిబి రానికి తీసుకువచ్చి కంటి పరీక్షలు చేయించి ఆపరేషన్కు సెలెక్ట్ అయి న వారిని హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రికి పంపించడానికి పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని నిర్వ హించారు.

    ఇదిలా ఉండగా జనవరి 19, 2025 న మొదలైన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ నిర్విరామంగా నియోజకవర్గంలో కొన సాగుతోంది. మొదటి విడత రెండో విడత ఉచి త కంటి వైద్య శిబి రాలను మును గోడు మండల కేంద్రంలో నిర్వహించగా, మూడవ ఉచిత కంటి వైద్య శిబిరం చండూరు మున్సిపాలిటీలో నాలుగవ కంటి వైద్య శిబిరం నాం పల్లి మండల కేంద్రంలో ఐదవ కంటి వైద్య శిబిరం మర్రిగూడ మండల కేంద్రంలో ఆరవ ఉచిత కంటి వైద్య శిబి రం చండూరు మండలంలోని బంగారుగడ్డ గ్రామంలో, ఏడవ ఉ చిత కంటి వైద్య శిబిరాన్ని గట్టుపల్ మండల కేంద్రంలో, ఎనిమిదవ ఉ చిత కంటి వైద్య శిబిరాన్ని నారాయ ణపూర్ మండల కేంద్రంలో, తొమ్మి దవ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చౌటుప్పల్ మున్సిపాలి టీలో, ప ద వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చౌ టుప్పల్ మండలం లక్కారం లో నిర్వహించారు. వీటన్నింటిలో 10 ఉ చిత కంటి వైద్య శిబిరాలలో 7506 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 1490 మందికి సక్సెస్ ఫుల్ గా కం టి ఆపరేషన్లు పూర్తి చేయించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.