Nalgonda police announcement : ప్రజా దీవెన, నల్ల గొండ: జాతీయ రో డ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం మేరకు, నేడు బుధవారం నుంచి న ల్గొండ జిల్లా వ్యా ప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రో ల్ ’ నిబంధనను అ మలు చేయను న్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ కీలక ప్రకటన చేశారు. మంగ ళవా రం ఆయనొక ప్రకటన విడుదల చే స్తూ ఈ నిర్ణయం ప్రకారం జిల్లా పరి ధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హె ల్మెట్ ధరించకుండా వ చ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదని స్పష్ట మైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పె ట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బం దికి ఈ నిబంధన అమలుపై స్పష్ట మైన సూచనలు ఇవ్వడం జరి గిం దని, అలాగే ద్విచక్ర వాహనదారు లకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగా హన కల్పిస్తూ కౌన్సిలింగ్ కార్యక్ర మాలు కూడా నిర్వహించా మని ఆ యన పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదా లలో ద్విచక్ర వాహనదా రులే అధి కంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవ డం వల్ల తల గాయాలు తీవ్రంగా మారి ప్రాణనష్టం సంభవిస్తున్న ఘ టనలు ఎక్కువగా ఉన్నాయని,ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను త గ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడ డం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంచేశా రు.
ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన భద్రతతో పాటు కుటుంబ భవిష్య త్తును దృష్టిలో ఉంచుకుని తప్పని సరిగా హెల్మెట్ ధరించి మాత్రమే వా హనం నడపాలని జిల్లా పోలీస్ శా ఖ విజ్ఞప్తి చేసింది.ప్రజల సహకారం ఉంటేనే రోడ్డు భద్రత సాధ్యమవు తుoదని, అందరూ చట్టాలను గౌర విస్తూ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను తా ము కాపాడుకోవాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది.
