Monday, September 28, 2026
More
    HomePoliticsCongress Party Celebrations : నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 'కార్పోరేషన్ ' సంబరాలు 

    Congress Party Celebrations : నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ‘కార్పోరేషన్ ‘ సంబరాలు 

    📰 Generate e-Paper Clip

    — పెద్ద గడియారం సెంటర్ లో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీల కు పాలాభిషేకం

    –మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

    –కార్పొరేషన్ ఎన్నికల్లో నల్లగొండపై కాంగ్రెస్ జెండా ఎగరాలి

    — నల్లగొండ కాంగ్రెస్ నాయకులు గు మ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి లు

    Congress Party Celebrations : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్లగొం డ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేయడంతో మరింత అ భి వృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతా య ని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీ ని వాస్ రెడ్డిలు అన్నారు. నల్గొండ ము న్సిపాలిటీని కార్పొరేషన్ గా చేస్తూ అసెంబ్లీలో ఆమోదించడం పట్ల హ ర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆ ధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భ వనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్లెక్సీ ల కు పాలాభిషేకంచేశారు. మిఠాయి లు పంచి పెద్ద ఎత్తున బా ణాసంచా కాల్చారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ నల్గొండ మున్సిపాలిటీని కా ర్పొరేషన్ గా చేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికే దక్కుతుం దని అన్నారు. ఈ సందర్భంగా సీ ఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రె డ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలకు కృత జ్ఞతలు తెలిపారు. నల్గొండ మున్సి పాలిటీ కార్పొరేషన్ కావడంతో రా ష్ట్రంతో పాటు కేంద్రం నుంచి ఎక్కు వ నిధులు వస్తాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, వ్యాపారు లకు మేలు జరుగుతుందని తెలిపా రు. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ ఏ పెరుగుతుందని పేర్కొన్నారు.

    గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల లో నల్లగొండ అభివృద్ధి గురించి ప ట్టించుకోలేదన్నారు. హంగు, ఆర్భా టాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. నల్లగొండ ప ట్టణంలో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు జరుగు తున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ప్రజ లకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతా యని, ఆ తర్వాత ఎంతో మేలు జ రుగుతుందన్నారు.

    నల్లగొండ పట్టణంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి కృషితోనే జరి గిందన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో నల్లగొండలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. అన్ని డివిజ న్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అ త్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపాలిటీ కా ర్పొరేషన్ కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ ప్రజలందరికీ కృత జ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని ర మేష్ గౌడ్ తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రె స్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సం ఖ్యలో పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.