CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసో సియేషన్ 2026 డైరీ& క్యాలెండర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో మవారం ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ప్రభుత్వ ఉద్యోగులంద రి కీ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభా కాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనేసంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్క య్యారని అనుకుంటున్నారని చెబు తున్నారు. మనమంతా ఒకే కుటుం బoకుటుంబంలో కుమ్మక్కులు ఏం ఉంటాయి.మీరు, మేము వేరువేరు కాదు.ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారు.
దేవతలు కూడా యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి ప్ర యత్నించారు.ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి అసెంబ్లీకి మారీచుడు లాంటి వాళ్లను పంపి స్తున్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మాపై మోపి వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 18 వేల కోట్లు, కానీ ప్రతీ నెలా 22 వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి. సగటు మధ్యతరగతి వ్య క్తి గౌరవంగా కుటుంబాన్ని ముందు కు తీసుకెళ్తున్నారోప్రభుత్వానిది కూడా అదే పరిస్థితి.
మనందరం కలిసికట్టుగా ముందు కు వెళ్లడం వల్లే సమాజంలో తెలం గాణ గౌరవం నిలబడింది. ప్రభు త్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమం త్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్ర మే కాదు. పదిన్నర లక్షల మంది ఉ ద్యోగులు కూడా ఇందులో భాగస్వా ములే.మీరే మా సారధులు, మా వారధులు. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా.
గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండి.సంక్రాంతి కానుకగా మీ డీఏపై సంతకం చేసి వచ్చా. మీ ఆరోగ్య భద్రత విష యంలో పూర్తిస్థాయిలో భరోసా ఇ చ్చే చర్యలు తీసుకుంటాం. ఉద్యోగు లకు ప్రమాద బీమా కోటి రూపాయ లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నాం. ఉద్యోగుల రిటైర్మెం ట్ బెనిఫిట్స్ సమస్యలను త్వరలో నే పరిష్కరిస్తాం.
ఇదొక బాధ్యత, అందరం కలిసికట్టు గా బాధ్యతను నిర్వహిస్తేనే పరిపా లన పరుగులు పెడుతుంది.మీ స మస్యలను పరిష్కరించే బాధ్యత నాది.జిల్లాలు, మండలాల రేషనలై జేషన్ విషయంలో పలు విజ్ఞప్తులు, డిమాండ్స్ వచ్చాయి. గతంలో జి ల్లాలు, మండలాలను ఇష్టం వచ్చి నట్లుగా విభజించారు.
జిల్లాలు, మండలాల పునర్ వ్యవస్థీ కరణకు త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు లే దా సుప్రీం కోర్టు జడ్జితో ఒక కమిష న్ ను నియమిస్తాం. ఈ కమిషన్ రా ష్ట్రమంతా పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయం లో ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటుంది. బడ్జెట్ సమావేశం లో అన్ని రాజకీయ పార్టీలతో కూ లంకషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తాం.
గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం కార్యాల యం నిర్మాణానికి సహకరిస్తాం.
ప్రజలకు మంచి పరిపాలన అంది ద్దాం. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరి స్తుం దని స్పష్టం చేశారు.


