Sunday, September 27, 2026
More
    HomeOpinionEx Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీమంత్రి హరీశ్ కీలక వ్యాఖ్య, సుప్రీంకోర్టు...

    Ex Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీమంత్రి హరీశ్ కీలక వ్యాఖ్య, సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి బట్టబయలైంది

    📰 Generate e-Paper Clip

    Ex Minister Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: వాస్త వ విరుద్ధంగా విచారణ అర్హత లేని పి టిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మి స్తున్న పోలవరం, నల్లమల సాగర్ కు పూర్తి స్థాయి లో సహకరిస్తు న్న రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకో ర్టు సాక్షిగా బట్ట బయలైందని మాజీ మంత్రి సిద్ది పేట ఎమ్మెల్యే త న్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజె క్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజె క్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశ పూర్వకంగానే విచారణ అర్హతలేని పిటిషన్ వేసి తెలంగాణకు తీర ని అన్యాయం చే సిందన్నారు.

    ఈ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లో నే…ఈ మాత్రం విషయం మీ న్యాయవాది, మీ ఎంపీ అభిషేక్ మ ను సింఘ్వీకి తెలియదా, ఈ మాత్రం దానికి నీళ్ల మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లాలా ముఖ్య మం త్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ రేవం త్ రెడ్డి తెలంగాణకు చే స్తున్న చారిత్రక ద్రోహం ఇది. రిట్ ఉపసం హరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్ర భుత్వం చెప్పడం అంటే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవ డాని కి ఏపీకి గడువు ఇవ్వడమే.

    ఏపీ, తెలంగాణతో పాటు మహారా ష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగి యని కథే. ఈ లోగా ఏపీ ప్ర భుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, తె లంగాణ నీటి హక్కు లను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకుపోతుంది. సంక్రాం తి పండుగ వేళ రేవంత్ చం ద్రబాబుకు ఇచ్చిన గిఫ్ట్, సుప్రీం కోర్టు లో వేసిన ఈ బలహీనమైన రిట్టు.పోలవరం నల్లమల సాగర్ విష యంలో ముందు నుంచి రేవంత్ ప్ర భుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏ పీ కి పూర్తిగా సహకరిస్తున్నది. పోనుపోను అనుకుంటూనే రేవం త్ రెడ్డి ఆ నాడు డిల్లీ మీటింగ్ కు వెళ్ళాడు.ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపాడు.

    పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మర ణ శా సనం రాశాడు. వేయను అంటూనే కమిటి వేసి ఏపీ జల దో పిడీకి రెడ్ కార్పెట్ వేశాడు.టెండర్ చివరి తేదీ అయిపోయాక సు ప్రీం కోర్టు కు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీ కా రం తెలిపాడు.పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా న ల్లమల సాగర్ కు మద్దతు ప్రకటిం చాడు.మేం నిలదీస్తే బనకచర్లను అ డ్డుకుంటాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం అని నమ్మ బలికిన రేవంత్ రెడ్డి, నేడు కావా లనే బలహీనమైన పిటి షన్ వేసి తెలంగాణకు మోసం చే శాడు. పంచాయతీలు వద్దు, న్యా యస్థానాలు వద్దు మనమే కూర్చొ ని చర్చించుకుందాం అన్న రేవంత్ రెడ్డి మాటల అంతర్యం ఏమిటి.

    తెలంగాణ నీటి హక్కులను గంపగు త్తగా ఏపీకి అప్ప చెప్పడమేనా మీ చర్చల లక్ష్యం. తెలంగాణలోని కృ ష్ణా, గోదావరి నదులపై చంద్ర బాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజె క్టు లు ఏమైనా ఉన్నా యా అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణ కు తీరని అన్యాయం చేసేందుకు సి ద్ధమైన రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణ సమాజం క్ష మించదు.రేవంత్ రెడ్డి నీ గురుదక్షిణ కోసం తె లంగాణకు ద్రోహం చేస్తుంటే తెలం గాణను సాధించిన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరు కోదు. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలం గాణ నీటి హక్కుల కోసం పోరు చే స్తామని హరీష్ రావు స్పష్టం చేశా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.