Monday, September 28, 2026
More
    HomePoliticsEx MLA Chirumarthi Lingayya : చిట్యాలలో ఉద్దేశపూర్వకంగా ఇం టిగ్రేటెడ్ వెజ్అండ్ నాన్ వెజ్...

    Ex MLA Chirumarthi Lingayya : చిట్యాలలో ఉద్దేశపూర్వకంగా ఇం టిగ్రేటెడ్ వెజ్అండ్ నాన్ వెజ్ మా ర్కెట్ నిర్మాణపనుల నిలిపివేత

    📰 Generate e-Paper Clip

    — నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

    Ex MLA Chirumarthi Lingayya : ప్రజా దీవెన, చిట్యాల: నకిరేకల్ ని యోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో రూ.2 కోట్లతో మం జూరు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అం డ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ ప నులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు.

    ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు.

    బిఆర్ఎస్ హయాంలో ముఖ్య మం త్రి కేసీఆర్ నాయకత్వంలో ఆ నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సా రథ్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న స మయంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించామ ని గుర్తుచేశారు. కానీ నేటి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకం గానే సదరు నిర్మాణ పనులను నిలి పివేసిందని ఆరోపించారు.

    పట్టణాన్ని మున్సిపాలిటీగా అభి వృద్ధి చేయాలనే లక్ష్యంతో నాడు అ నేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామని అన్నారు. అం దులో భాగంగానే ప్రజలకు అవసర మైన సౌకర్యాలతో కూడిన సమీకృ త వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ని ర్మాణానికి రూ.2 కోట్లు కేటాయిం చామని తెలిపారు. బిఆర్ఎస్ ప్ర భుత్వం ఉన్నప్పుడే అన్ని అనుమ తులు ఇచ్చి పనులు కూడా ప్రా రం భించామని వివరించారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత అలసత్వం,నిర్లక్ష్యం, చేతకాని తనంతో ఆ పనులను ని లిపివేసిందని విమర్శించారు. తా ము చేపట్టిన అభివృద్ధి పనుల శిలా ఫలకాలను ధ్వంసం చేసి, తమ హ యాంలో మంజూరైన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేయడం కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ వైఖరికి ని దర్శ నమని దుయ్యబట్టారు.

    ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒ క్కరోజైనా పట్టణ అభివృద్ధిపై సమీ క్ష సమావేశం నిర్వహించలేదంటే ఆ యనకు ఈ ప్రాంతంపై ఎలాంటి ఆ లోచన ఉందో పురవాసులు ఆలో చన చేయాలని కోరారు. నేను ఎ మ్మెల్యేగా ఉన్న సమయంలో మా ర్కెట్ యార్డు కాంప్లెక్స్ నిర్మాణానికి దాదాపు కోటిన్నర నిధులు మంజూ రు చేసి, బిఆర్ఎస్ ప్రభుత్వహ యాంలోనే పనులు పూర్తిచేశామని

    తాము పూర్తి చేసిన కాంప్లెక్స్‌ శిలా ఫలాకాన్ని తొలగించి కొత్త శిలా ఫ లకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారం భించడం సిగ్గుచేటని, గత రెండేళ్ల లో పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ఏం చేశారో ప్రజలకు తెలియజేస్తూ శ్వే తపత్రం విడుదల చేయాలని డి మాండ్ చేస్తున్నమన్నారు. నకిరేకల్ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు విచ్చ లవిడిగా అక్రమ దందాలకు పాల్ప డుతూ, సంక్షేమ పథకాల అమల్లో కొర్రీలు పెడుతూ పేద ప్రజలను ఇ బ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు.

    కాంగ్రెస్ నాయకులు సూట్‌కేసులు, డబ్బు సంచులతో తిరుగుతూ ప్రజ లను మభ్య పెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని, పట్టణ ప్రజలు ఆలోచిం చి ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అ భ్య ర్థులను గెలిపించాలని కోరుతున్నా మన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.