Tuesday, September 29, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండకు అధికారి కంగా హోదా, గెజిట్ విడుదల చేసి...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండకు అధికారి కంగా హోదా, గెజిట్ విడుదల చేసి న ప్రభుత్వం 

    📰 Generate e-Paper Clip

    Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా కేంద్రమైన మున్సిపాలి టీని కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. అయితే నల్లగొండ మున్సిపాలిటీ కి దక్కిన కార్పోరేష న్ హోదాకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా హోదా కల్పిస్తూ గెజి ట్ విడుదల చేసింది.

    దీంతో పాలన పరంగా నల్లగొండకు మరిన్ని అధికారాలతో పాటు విస్తృ త పరిధి పెరగనుంది. అదే సమ యంలో అభివృద్ధి నిధులు పెరగను న్నాయని అధికారులు సూత్రప్రా యంగా చెబుతున్నారు. ఇకపై రా ష్ట్ర, కేంద్ర పథకాలకు సంబంధించి నేరుగా అందే అవకాశం ఉన్నందున సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

    కొత్త వార్డుల పునర్వ్యవస్థీకరణ అవకాశంతో పాటు మేయర్, డి ప్యూటీ మేయర్ వ్యవస్థ అమలులో కి రానుంది. కమిషనర్ స్థాయి అధి కారుల ద్వారా పాలనతో మరింత బలం చేకూరనుంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌళి క వసతుల అభివృద్ధి వేగవంతo కానున్నాయి.

    ఇదిలా ఉంటే పట్టణ ప్రణాళిక, టౌ న్ ప్లానింగ్‌ లలో కార్పొరేషన్ నియ మ, నిబంధనలు అమల్లోకి రాను న్నాయి. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ వి ధానాల్లో సైతం మార్పులు, చేర్పు లు వచ్చే అవకాశం ఉందని భావిస్తు న్నారు.

    నల్లగొండ మున్సిపాలిటీని కార్పొ రేషన్‌గా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో నల్ల గొండ నగరాభివృద్ధి, నవీకరణ

    కొత్త పుంతలు తొక్కనున్నాయి. కార్పొరేషన్ హోదాతో అదనపు నిధులు, విస్తృత అధికారాలు రానుండగా మౌలిక సదుపాయా లు, రోడ్లు, డ్రైనేజీపై ప్రత్యేక దృష్టి మరింత పెరగనుంది.

    అయితే త్వరలో వార్డుల పునర్వి భజన, కార్పొరేటర్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా ప్రజలకు మె రుగైన పాలన, సేవలు అందించడ మే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొత్తానికి నల్లగొండ కు కార్పోరేషన్ హోదా అధికారికంగా విడుదల కావడంతో ఆ మేరకు అధి కారిక కార్యకలాపాలు ఆరంభం కా నున్నాయని అధికారులు సూత్రప్రా యంగా చెబుతున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.