–సిఐటియు రాష్ట్ర కార్యదర్శి
పాలడుగు భాస్కర్
Secretary Paladugu Bhaskar : ప్రజా దీవెన చౌటుప్పల్: లేబర్ కో డ్స్, విబి రామ్ జి చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లుల ర ద్దుకై జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కండి, కేంద్ర ప్రభు త్వ కార్మిక, రైతు, వ్యవసాయ కూ లీ, ప్రజా వ్యతిరేక విధానాలపై జరి గే పోరాటాలకు సిద్ధం కావాలని కా ర్మికులకు, ప్రజలకు సిఐటీయూ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్ర వా రం రోజున చౌటుప్పల్ మున్సిపాలి టీ పరిధిలోని చిన్నకొండూరు రోడ్ లో ఎండి పాషా, అధ్యక్షతన జరి గి న కార్మిక, కర్షక పోరుయాత్ర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సిఐటి యు రైతు, వ్యవసాయ, కార్మిక సం ఘం, ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త కా ర్మిక, కర్షక పోరుయాత్ర జాతను ప్రా రంభించి కామ్రేడ్ పాలడుగు భా స్క ర్ మాట్లాడుతు గత 11 సంవ త్స రాలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్ర జల హక్కులను కాలరాయడమే గా క రాష్ట్రాల హక్కులను హారిస్తూ చ ట్టాలను చేస్తుందన్నారు. ఒకవైపున ప్రజా సంక్షేమం , దేశభక్తి గురించి దొంగ మాటలు చెప్తూ నేటికి దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చి దోచి పెట్టిందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను LIC , రైల్వే,విమానయానం, టెలి ఫోన్ రంగాలను ఆదాని, అంబానీ, వంటి ఆప్త మిత్రులైన పెట్టుబడిదారులకు కట్టబెట్టిందని విమర్శించారు. అ త్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయడం. విద్యుత్తు సవరణ చట్టం విత్తన బి ల్లు విబి జి రామ్ జి, చట్టం భీమా రంగంలోకి 100 శాతం విదేశీ పె ట్టుబడులకు అనుమతి అను రం గంలో ప్రవేట్ కంపెనీలకు అనుమ తిస్తూ అనుచట్ట సవరణ చేసిందని అన్నారు.
వీటికి వ్యతిరేకంగా సిఐటియు తె లంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వ ర్యంలో దేశ వ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని అ న్నారు. అందులో భాగంగానే యా దాద్రి భువనగిరి జిల్లా కమిటీల ఆ ధ్వర్యంలో శుక్రవారం చౌటుప్పల్ నుండి జిల్లా వ్యాప్త జీపును ప్రారం భించడం జరిగిందన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కా ర్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడుతూ విబీ జి రామ్ జి చ ట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు .2005 లో వామపక్షల పో రాట ఫలితంగా మహాత్మాగాంధీ జా తీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చ ట్టం రూపొందించి చట్టం ప్రకారం వందరోజుల పని కల్పించాలి అ న్నారు. దేశంలో 60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రాలు భరించాలినీ చట్టం సవరణ చేశారని ఫలితంగా పథకం రోజు రోజుకు ప్రజలకు పని లేకుండా పోతుందని ఇది ఎత్తివేసే కుట్రలో భాగమే అన్నారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్ లుగా తీసుకువచ్చిందని అన్నారు. వేతనాల కోడ్ 2019 సామాజిక భ ద్రత కోడ్ 2020 పారిశ్రామిక సంబం ధాల కోడ్ వృత్తి రక్షణ ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ ఈ నాలుగు కోడ్ ల ను ప్రభుత్వం తీసుకురావడం వల్ల కార్మికులకు అసంఘటిత కార్మికుల కు చాలా ప్రమాదం ఉందని అన్నా రు. కార్మికుల పని గంటలు, ఎనిమి ది నుంచి 12 గంటలకు పెంచుతూ లేబర్ కోడ్ లలో పొందుపరిచారని , కా ర్మికులు యూనియన్ ను ఏర్పా టు చేసుకునే హక్కును, సమ్మె హ క్కును ప్రశ్నార్థకం చేసే విధంగా లేబ ర్ కోడ్ లు ఉన్నాయని తెలియజే శారు. ఈ కోడ్ లను పార్లమెంటులో ఉపసంహరించే వరకు సమైక్య ఉ ద్యమాలు కొనసాగిస్తామన్నారు.
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి మాటూరు బాలరాజు మాట్లా డుతూ కార్పొరేట్ అనుకూల జా తీయ విత్తన బిల్లును రద్దు చేయా లని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక క ర్షక వ్యతిరేక విధానాలను నిరసి స్తూ రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆం దో ళనలు కార్మికులు రైతులు వ్యవ సా య కార్మికులు ప్రజలు ప్రజా స్వా మిక వాదులు భాగస్వాములు కా వాలని జనవరి 19న జరిగే కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భం గా యాదాద్రి భువనగిరి జిల్లా కేం ద్రంలో జరిగే బహిరంగ సభకు పా ల్గొనాలని కోరారు. పోరు యాత్ర నా యకులు CITU జిల్లా అధ్యక్షులు కో మటిరెడ్డి చంద్రారెడ్డి పాల్గొని మాట్లా డారు.
ఈ సభలో రైతు సంఘం జిల్లా నా యకులు బూరుగు కృష్ణారెడ్డి, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈ ర్లపల్లి ముత్యాలు,ఉపాధ్యక్షులు గో శిక కరుణాకర్, నరసింహ, ప్రజాసం ఘాల నాయకులు రాగిరి కిష్టయ్య, ఆదిమూలం నందీశ్వర్, బత్తుల దా సు, బొడ్డు అంజిరెడ్డి, ఆకుల ధర్మ య్య, పరిమి ధర్మారెడ్డి, బండారు నరసింహ, తూర్పునూరు మల్లే శం, కొండే శ్రీశైలం, తడకమ్మోహన్, ఉ స్కాపుల శ్రీనివాస్, కలకుంట్ల శివ, చీమకండ్ల శ్రీరాములు, నెలికంటి న రసింహ, తదితరులు పాల్గొన్నారు.

