Nalgonda Police Arrest : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: విదే శాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగా లు ఇప్పిస్తానని మోసం చేస్తున్న అంతరాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చే సి రిమాండ్ కు తరలించినట్లు నల్ల గొండ జిల్లా అడిషనల్ ఎస్.పి జి. రమేష్ తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తానని, అక్కడే ఉ ద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి భారీగా డ బ్బులు వసూలు చేసి మోసం చేస్తు న్న అంతర్ రాష్ట్ర నిందితుడిని నల్ల గొండ జిల్లా చింతపల్లి పోలీసులు అ రెస్టు చేసినట్లు వెల్లడించారు.
శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చే సిన మీడియా సమావేశంలో కేసు కు సంబంధించి నిందితుని వివరా లు వెల్లడించారు. ఆంద్రప్రదేశ్ రా ష్ట్రం గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ల లీలా కృష్ణ ( 35) ని అరెస్ట్ చేసి ఒక ల్యాప్‌టాప్, మూ డు స్మార్ట్ ఫోన్లు, వివిధ బ్యాంకుల కు చెందిన డెబిట్ కార్డులు స్వాధీన పర్చుకున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లాలో నిరుద్యో గ యువతను లక్ష్యంగా చేసుకొని “విదేశాల్లో ఉన్నత చదువులు, మం చి ఉద్యోగాలు” అనే ఆశ చూపి మో సం చేసిన ఘటన చింతపల్లి పోలీ స్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వ చ్చిందన్నారు.
నల్లగొండ జిల్లా పోలేపల్లి రాంనగ ర్‌కు చెందిన కోయల కార్ కరుణ భాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ మె కుమారుడిని విదేశాలకు పంపిం చి ఉన్నత చదువులు చదివించి ఉ ద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారనే ఆరోపణ లపై చింతపల్లి పోలీసులు ఎఫ్‌ఐ ఆర్ నమోదు చేశారు. ఈ కేసును లోతుగా విచారిస్తుండగా, ముప్పా ళ్ల లీలా కృష్ణ అనే వ్యక్తిని అదుపు లోకి తీసుకొని విచారించగా, ఇత డు నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ప లువురు విద్యార్థుల నుండి భారీ మొత్తంలో, డబ్బులు తీసుకొని ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు తే లిందన్నారు.
పట్టుబడిన నిందితుడు గతంలో వి దేశాల్లో ఉద్యోగం చేసి అక్కడి పరి చయాలను ఉపయోగించుకొని, భా రతదేశానికి వచ్చిన అనంతరం చె డు వ్యసనాలకు అలవాటుపడి సు లువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మోసాలకు పాల్పడ్డా డని విచారణలో వెల్లడైందన్నారు. విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపు తున్న విద్యార్థులు, వారి తల్లి దం డ్రులను నమ్మించి ఇప్పటివరకు మొత్తం 8 మంది నుండి సుమారు రూ.85 లక్షల వరకు తీసుకొని మో సం చేసినట్లు గుర్తించారు.ఈ విదం గా సంపాదించిన డబ్బులతో నింది తుడు కొంత డబ్బును విలాసాల కు జల్సాలకు ఖర్చు పెట్టాడన్నారు.
కాగా ఈరోజు ఉదయం సుమారు 1 1 గంటల సమయంలో మాల్ మర్రి గూడ రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని గుర్తించి న చింతపల్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద నుండి మూడు సెల్ ఫో న్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చే సుకున్నారు. అలాగే నిందితుడిపై ఇప్పటికే మాడుగులపల్లి పోలీస్ స్టే షన్ మరియు వరంగల్ పోలీస్ స్టే షన్ పరిధిలో చీటింగ్ కేసులు న మోదైన్నట్లు నిర్ధారణ అయిందన్నా రు.
యువతను లక్ష్యంగా చేసుకొని ఉ ద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో నియామకాలు చేయిస్తామని మోసగాళ్లు నమ్మి స్తు న్నారని తెలిపారు. ఉద్యోగాల పేరు తో ముందస్తుగా డబ్బులు అడగ డం, నకిలీ నియామక పత్రాలు చూ పించడం, వాట్సాప్ లేదా ఫోన్ కా ల్స్ ద్వారా తప్పుడు హామీలు ఇవ్వ డం వంటి పద్ధతులతో అమాయకు లను మోసం చేస్తున్నారని హెచ్చ రించారు.ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉ ద్యోగాలకు సంబంధించిన సమాచా రం అధికారిక నోటిఫికేషన్లు, గుర్తిం పు పొందిన సంస్థలు, ప్రభుత్వ వెబ్ సైట్ల ద్వారానే పొందాలని సూచిం చారు.
ఉద్యోగం పేరుతో ఎవరైనా డబ్బు లు అడిగితే వెంటనే అప్రమత్తమై సమీప పోలీస్ స్టేషన్‌కు సమా చా రం ఇవ్వాలని కోరారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం కే సులు నమోదు చేసి అరెస్టు చేస్తా మని హెచ్చరిస్తూ, జిల్లా ప్రజలు ము ఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండి మోసాలకు గురికాకుండా పోలీస్ శా ఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశా రు.
అనంతరం ఆయన ఈ కేసులో నేర స్థుడిని పట్టుకోవడంలో చాకచ క్యం గా వ్యవహరించి ప్రతిభకనబర్చిన నాంపల్లి సీఐ డి.రాజు, చింతపల్లి ఎ స్‌ఐ ఎం.రామ్మూర్తి, చింతపల్లి పో లీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యే కంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.

