Monday, September 28, 2026
More
    HomePoliticsMuncipal wards reservation : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు, పారదర్శకంగా మున్సిపల్ వార్డుల...

    Muncipal wards reservation : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు, పారదర్శకంగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు 

    📰 Generate e-Paper Clip

    Muncipal wards reservation : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఎలాంటి త ప్పులు లేకుండా పారద ర్శకంగా చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ స మావేశ మందిరంలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల విష యమై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావే శం నిర్వహించారు. మున్సిపల్ ఎ న్నికల నేపథ్యంలో రిజ ర్వేషన్ల అమలుకై జీవో ప్రకారం అన్నిచర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

    మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసే సమ యంలో ప్ర భు త్వం జారీ చేసిన జీవోను తప్పనిసరిగా అను సరించాలని తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కే టాయించిన రిజర్వేషన్లు నిబంధనల ప్రకారం, పారదర్శకం గా అమలు చేయాలన్నారు. గత ఎన్నికల రిజ ర్వేషన్ డేటా, జనాభా గణాంకాలు, రొటేషన్ విధానం వంటి అంశాలను స మగ్రంగా పరిశీలించి ఎలాంటి పొ రపాట్లకు అవకాశం లేకుం డా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

    మున్సిపల్ కమిషనర్లు వారి పరిధి లోని వార్డుల వివరాలు, రిజర్వేషన్ పట్టికలను ముందుగానే సిద్ధం చేసి జిల్లా యం త్రాంగానికి సమర్పించా లని, అవసరమైన చోట స్పష్టత కో సం వెంటనే సంప్రదించాలని ఆదే శించారు. ఎన్నికల ప్రక్రియ సవ్యం గా సాగేందుకు అధికారులు సమ న్వయంతో పనిచే యాలని కలెక్టర్ ఆదేశించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆ ర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.