Sunday, September 27, 2026
More
    Homeక్రైంNalgonda Railway Station Murder : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కేంద్రం లో దారుణం,...

    Nalgonda Railway Station Murder : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కేంద్రం లో దారుణం, రైల్వే స్టేషన్ సమీపం లో వ్యక్తి హత్య 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Railway Station Murder : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్రంలో దారుణం చో టు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం జరగడంతో ఇరువర్గాల మధ్య బాహాబాహీ కార ణంగా దాడి చేసుకోవడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. పోలీసులతో పాటు విశ్వసనీయ సమాచారం మే రకు వివరాలు ఇలా ఉన్నాయి.

    నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ హత్య సంచలనం సృష్టించింది. న ల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్య క్తిని కొందరు దుండగులు రాళ్లతో కొ ట్టి వ్యక్తిని దారుణంగా హత్య చేశా రు. మృతుడు నాగర్‌కర్నూల్ జిల్లా తెలికపల్లి గ్రామానికి చెందిన చంద్రు గా పోలీసులు గుర్తించారు.

    రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవ నం సాగిస్తున్న చంద్రుకు ఇద్దరు కూ తుర్లు ఉన్నారు. కాగా ప్రస్తుతం నల్ల గొండ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులలో భాగంగా జ రుగుతున్న రైల్వే స్టేషన్ పనుల ని మిత్తం నల్లగొండకు వచ్చిన సమ యంలో ఈ దారుణం చోటుచేసు కుంది.

    సంఘటనా స్థలంలో విచారణ అ నంతరం మృతదేహాన్ని నల్లగొండ మార్చురీకి తరలించిన పోలీసులు.ఇదిలా ఉండగా ఈ హత్య కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. హ త్యకు గల కారణాలపై విచారణ చే పట్టిన ఎస్సై సైదులు నేతృత్వంలో ని నల్లగొండ టూటౌన్ పోలీసుల బృందం పూర్తి వివరాలు సేకరిస్తోం ది. ఈ మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నామని పోలీ సులు తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.