Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, ప్రయాణికులకు నల్లగొండ పోలీసుల గుడ్...

    Nalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, ప్రయాణికులకు నల్లగొండ పోలీసుల గుడ్ న్యూస్, నగరానికి వెళ్లే వాహనాల దారిమళ్లింపు

    📰 Generate e-Paper Clip

    Nalgonda SP Sharath Chandra Pawar :  ప్రజా దీవె న, నల్లగొండ: ప్రజల శ్రేయ స్సు దృష్ట్యా నిరంతర నిశిత పరి శీలనలో ఉండే నల్లగొండ పోలీసులు తాజాగా మరోసారి త మదైన శైలితో ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకే సారి హైదరాబాద్ నగరానికి భా రీగా వాహనాలు రానున్న నేపథ్యంలో నేషనల్ హైవే- 65 ( హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓ వర్ నిర్మాణ పనులు కొన సాగుతోన్న నేపధ్యంలో ట్రాఫిక్ జా మ్ అయ్యేందుకు అవకాశాలు ఉ న్నందున ట్రాఫిక్ రద్దీని ని వారించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు నల్లగొం డ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

    శుక్రవారం ఆయనొక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ప్రధాన రహదా రులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన, సునాయసమైన ప్రయాణ అవకాశం కల్పిం చాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మ ళ్లింపు చర్యలు చేపట్టిందన్నారు.ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికు లు క్రింద సూచిం చిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని వి జ్ఞప్తి చేస్తున్నారు.

    దారి మళ్లింపు వివరాలు ఇలా

    గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
    గుంటూరు→మిర్యాలగూడ→ హాలియా → కొండమల్లేపల్లి →చింతపల్లి – మాల్ మీదుగా హైదరాబాద్.

    మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు:
    మాచర్ల →నాగార్జునసాగర్→ పెద్ద వూర→కొండపల్లేపల్లి – చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.

    నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు 

    నల్లగొండ – మార్రిగూడ బై పాస్ – మునుగోడు→ నారాయణ పూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.

    విజయవాడ నుంచి హైదరాబా ద్ వెళ్లే భారీ వాహనాలు..
    కోదాడ-హుజూర్ నగర్- మిర్యాల గూడ-హాలియా-చింత పల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.

    ఇక ఎన్. హెచ్ 65 (విజయవాడ -హైదరాబాద్ )రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నం దున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుండి భువ నగిరి గుండా హైద్రాబాద్ మళ్లించడం జరుగుతుందన్నారు. ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయ వాడ, హైద్రాబాద్ పై (ఎన్. హెచ్ 65 )ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్ర యాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీ సులు తెలిపారు.

    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండగ పూర్తి చేసుకున్న ప్రజలంతా తమ గమ్యస్థానాలకు హైద్రాబా ద్ కు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమని , ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాం టి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చే స్తున్నామన్నారు. ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరిం చడం ద్వారా ట్రాఫిక్ నియమాలు పా టిస్తూ, ఓర్పు, నేర్పుతో ప్ర యాణించాలని, రోడ్డు భద్రతలో ప్ర తి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు.

    పండగ రోజులలో ట్రాఫిక్ పోలీసులు కీలక కూడళ్ల వద్ద వి ధులు నిర్వ హిస్తూ, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రా ఫిక్ పరిస్థితిని ఎప్పటిక ప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపా రు. ఎలాంటి అత్యవసర పరిస్థితు ల్లోనైనా డయల్ 100 ని సంప్రదించాలని జిల్లా ఎస్పి ఈ సందర్భంగా కోరారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.