CmRevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మ ధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ అంశాల కు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తర ఫున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు. హైదరాబాద్ క మాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్య మంత్రి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” జరిగింది. భారత సైన్యం,తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉ న్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫునపలు విజ్ఞప్తులను ముఖ్య మంత్రి సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొ చ్చారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హై దరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 2 నుంచి 4 సైని క్ స్కూళ్లను మంజూరు చేశారన్న విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేస్తూ గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు.
తెలంగాణలో తక్షణం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కో రారు.దేశ భ ద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రా ని కి, భారత సైన్యానికి స హకరించేందుకు తెలంగాణ ప్రభు త్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నే వికారాబాద్ దామగుండం వద్ద లో-ఫ్రీక్వెన్సీ వీఎ ల్ఎఫ్ (VLF) నేవీ రాడార్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలు కేటా యించిన విషయాన్ని ముఖ్య మంత్రి గుర్తుచేశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, తెలం గాణ – ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ క మాండింగ్ (TASA) మేజ ర్ జనరల్ అజయ్ మిశ్రా, తెలం గాణ డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

