Monday, September 28, 2026
More
    HomeOpinionMinister Jupally Krishna Rao : మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటు వ్యాఖ్య, ఇతరుల జీవితాల్లోకి...

    Minister Jupally Krishna Rao : మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటు వ్యాఖ్య, ఇతరుల జీవితాల్లోకి తొం గిచూడటం ఏ సంస్కృతి

    📰 Generate e-Paper Clip

     

    Minister Jupally Krishna Rao :  ప్రజా దీవెన, హైద‌ రా బాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభు త్వం అనుస రించిన అప్రజాస్వామిక విధానాలపై పర్యాట క, సాంస్కృతిక, ఎ క్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ప్రజా భవన్ లో ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఆయన మీ డియా సమావేశంలో మాట్లాడారు.

    నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూ శాను, కా నీ ఫోన్ ట్యాపింగ్ వంటి నీచమైన రాజకీయాలను కేవలం కేసీఆర్ హ యాంలోనే చూశాం అని మంత్రి జూపల్లి విమర్శించారు. 2021 నుండి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయని, మాజీ గవర్నర్ తమిళిసై, రిటై ర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఈటల రాజేందర్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వంటి వారిపై నిఘా పెట్టారనే అనుమా నా ల‌ను వారు గ‌తంలో వ్య‌క్తం చేశార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

    ఇలాంటి చ‌ర్య‌లు ప్రజాస్వా మ్యా నికే గొడ్డలిపెట్టు అని ఆ యన అ న్నారు. పోలీసు, ఇంటెలిజెన్స్ వంటి వ్యవస్థల‌ను సొంత పార్టీ నేతల ను, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌ను, వ్యా పార వే త్తలను బ్లాక్ మెయిల్ చేయడానికి వాడుకోవడం బీఆర్ఎస్ ప్ర భుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తా రు.గత ప్రభు త్వంలో అర్ధరాత్రి తలు పులు బద్ద లు కొట్టి, ప్రొఫెసర్ కోదండరాం వం టి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి న ప్పుడు మీ రాజకీయ విలువలు ఏ మయ్యాయని మంత్రి నిలదీశారు. మేము అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపుల కు దిగలేదు. ఒకవేళ అ దే మా ఉద్దేశమైతే ఎప్పుడో జైలు కు పంపేవాళ్లం. కానీ మేము చట్టా న్ని గౌరవిస్తున్నాం. కేవలం సాక్షిగా సమాచారం అడిగే సీఆర్పీసీ 160 నోటీసు ఇస్తేనే ఇంతలా భయపడి పోవాలా అని ఆయన ప్రశ్నించారు.

    సాక్షిగా సిట్ విచార‌ణ‌కు పిలిస్తే, కే టీఆర్ ఎందుకు అంతలా ఆందోళ న చెందుతున్నారని మంత్రి ప్రశ్నిం చారు. గతంలో ఏ విచారణకైనా సి ద్ధం అని ప్రగల్భాలు పలికిన కేటీ ఆర్, ఇప్పుడు నోటీసులు రాగానే డ్రామాలు ఆడుతున్నారని ఎద్దే వా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రంతో సంబంధం లేక పోతే, నిర్ధోషులైతే భయపడాల్సిన అవసరం ఏ ముందని ప్రశ్నించారు.

    ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యం త దుర్మార్గమని, ఇతరు ల వ్యక్తిగత జీవితాల్లో తొంగిచూడటం ఏ సంస్కృతిని సూచి స్తుందో బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూ చించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవ రో సిట్ దర్యాప్తులో తేలాల్సి ఉం దని, నిజాలు బయ టకు రావడం ఖాయమని చెప్పారు. రాజకీయ నాయకులు చట్టానికి అతీతులు కాదని, తప్పు చేసిన వారు ఏ పార్టీ వా రైనా శిక్ష అనుభవించాల్సిందే నని అన్నారు.

    ఈ విచారణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెంది న వారిని కూడా సాక్షులుగా పిలుస్తున్నారని, కేవలం బీఆ ర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడటం సరికాద న్నారు. చట్టబద్ధ సంస్థలపై బురద జల్లే ప్రయత్నాలను ప్ర భుత్వం సహించదని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వారు ఏ పార్టీ వారైనా సరే శిక్ష అ నుభ వించాల్సిందేనని తేల్చి చెప్పారు.

    మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని ఛిన్నభిన్నం చేసిన బీఆ ర్ఎస్ నేతలను ప్రజలు ఎప్పుడో విస్మరించారని మంత్రి అన్నారు. ఇప్పటి కైనా కేటీఆర్, హరీష్ రావు తమపై పడ్డ బట్ట కాల్చి ఇతరుల మీద వేసే పనులు మానుకోవాలని హితవు పలికారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.