Monday, September 28, 2026
More
    HomeOpinionDeputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి ఫైర్, ఏప్రయో జనాల కోసం...

    Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి ఫైర్, ఏప్రయో జనాల కోసం అతిపెద్ద ప్రభుత్వ రం గ సంస్థపై నిందలు వేస్తున్నారు 

    📰 Generate e-Paper Clip

    Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరా బాద్: ప్రతిష్టా త్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అ యినటు వంటి సింగరేణి సంస్థపై కొ న్ని రోజులుగా ప్రచురి తమవు తున్నవి పూర్తిగా కట్టుకథలేనని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మరో సారి కొట్టిపారేశారు. ఓ మీడియా సంస్థ ఏరా బందులు, ఏగద్దలు, ఏదోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఏ ని నాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో, తొలిప లుకులరాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు.

    శనివారం ఆయన హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.రకర కాలుగా తప్పుడుప్రచారం చేశారని, పెట్టుబడులు, కట్టు క థ లు, పిట్టకథల విష ప లుకులతో తప్పుడు ప్రచారానికి తె ర లేపారని మండిపడ్డారు. రాష్ట్ర ప్ర భుత్వంపై కావాలని త ప్పుడు కథనాలు రాస్తున్నారని ఫైరయ్యారు.

    సింగరేణి బొగ్గు గనుల వ్యవహారం పై సీబీఐ ఎంక్వయిరీ జ రపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, దానికి రా ష్ట్రం ప్రభుత్వం సి ద్ధంగా ఉందని, దర్యాప్తు సంస్థతో విచార ణ చేయించాలని కోరారు. ఈ బొగ్గు గనుల టెండర్ల విష యంలో నిజానిజాలు బయటకు రావాలని, వాస్తవాలు ప్రజ లకు తెలియాలన్నారు.

     

    ఈ ఇష్యూపై పత్రికలు, నాయకులే కాదు సోషల్ మీడియా లో కూడా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. అందరికీ వాస్తవాలు తెలియజేసేందుకు డా క్యు మెంట్లు కూడా ఇస్తామన్నారు. అడ్డగోలు ప్రచారం చేసే వారి అస లు రూపం బయటపడాలన్నారు. 2018లోనే టెండర్ డాక్యుమెంట్ కోల్ ఇండియా తయారుచేసి పం పించింద న్నారు. సైట్ విజిట్ తప్ప నిసరి అని కోల్ ఇండియానే పెట్టిం దని, హరీశ్ రావు లేఖ రాయడం మంచిదే అయ్యిందన్నా రు.

    కిషన్ రెడ్డి విచారణ చేస్తామనడం కూడా మంచిదేనని, అం దరి నిర్ణయాలను తాము స్వాగతిస్తాన్నారు. 2021లో సెం ట్రల్ మైనింగ్ కూ డా సైట్ విజిట్ తప్పని సరి అని చె ప్పిం దని, టెండర్ డాక్యుమెంట్లు వ చ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం లేదని గుర్తు చేశారు. గత డాక్యు మెంట్ల ఆధారంగానే సింగరేణి టెం డర్లు పిలిచిందని, అయితే సైట్ వి జిట్ తాను చేసినట్టు తప్పుడు క థనాన్ని ప్రచురించారని ధ్వజమె త్తా రు

    రాధాకృష్ణ, నువ్వు రాసింది అవాస్తవమని ఒప్పుకో
    లేదంటే ఇది నా వ్యక్తిత్వ హననంగా పరిగణించాల్సి వ స్తుంది…..

    సింగరేణిలో టెండర్లు, వాటికి సంబంధించిన టెండర్లు కానీ వాటికి సంబంధించిన ఫైళ్లు గానీ తన వద్దకు గానీ రాష్ట్ర ప్రభుత్వం వద్దకు రావని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. పారదర్శకంగా సేవలు అందించేందు కు సింగరేణి కాలరీస్ సంస్థకు ఒక బోర్డు ఉందని, అందులో సీనియర్ అధికారులు ఉంటారని, వారంతా ఒక స్వయంప్ర తిపత్తి (Autonomous) తో నిర్ణయాలు తీసుకుంటారని అని పేర్కొన్నారు. అన్ని నిర్ణయాలు సంస్థలో అమలులో ఉన్న విధివిధానాలు, నిబంధనల ప్రకారమే స్వతంత్రంగా తీసుకుంటారని, రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

    ముఖ్యంగా సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాకు కాంట్రాక్ట్ విష యంలో కాంట్రాక్టర్లు ముందుగా సైట్ విజిట్ చేయాలని, ఆ మేరకు గని అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ పొంది తేనే కాంట్రాక్టు లో బిడ్డింగ్ చేయడానికి అర్హత కల్పిస్తూ తానే దో కొత్త నిబంధన పెట్టినట్లు రాధాకృష్ణ పేర్కొన్నారని, ఈ ని బంధన దేశంలో మరెక్కడా లేదని కేవలం కొందరు భట్టి విక్ర మార్కకు చెందిన వారికి కాంట్రాక్టు అప్పగించడానికే ఇలా చే శారంటూ కట్టు కథనాలను, పిట్ట కథలను అల్లి వార్త ప్రచు రించారని విమర్శించారు.

    ఈ సందర్భంగా ఆయన సైట్ విజిట్ చేయటం అనేది కేవ లం సింగరేణిలో మాత్రమే ఉన్నది, తమ హయాంలో ప్రవేశ పెట్టింది అంత కన్నా కాదని రుజువులతో వివరించారు. 2018, 2021, 2023 లో కోలిండియా అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐఎల్ రూపొందించిన సింగరేణి టెండర్ డాక్యుమెంట్ లో, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్ఎండీసీ, ఐఐటీ, ఐఐఎం, ఫైనాన్స్ విభాగం, డిఫెన్స్ విభాగం, గుజరాత్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చాలా కంపెనీల్లో చాలా ఏళ్లుగా ఉన్నట్లు, ఆయా కంపెనీలకు సంబంధించిన టెండర్ లేఖలను విలేకరులకు చూపించారు.

    కోలిండియా కు అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐఎల్ వారు సింగరేణి సంస్థకు సూచించిన టెండర్ నిబంధనలలో సైట్ విజిట్ జరపడం తప్పనిసరి అని పేర్కొన్నదని సీఎం పీడీఐఎల్ నిబంధన మేరకే సింగరేణి సంస్థ 2018 నుంచి ఈ నిబంధనను పాటిస్తూ వస్తుందన్నారు. ఈ నిబంధన కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పొందుపరిచారు అ న్నది పూర్తి అవాస్తవమని పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన అని, తాము కొత్తగా రూపొందించింది కాదు అని స్పష్టం చేశారు.

    సింగరేణిలో డీజిల్ సరఫరా ను కాంట్రాక్టర్లకే అప్పగించడం ద్వారా మరో కుంభకోణానికి తెరలేపారన్న హరీశ్ రావు ఆ రోపణలను ఆయన ఖండించారు. డీజిల్ సరఫరా విధానం లో మార్పులు కూడా తమ హయాంలో జరగలేదని, 2022 లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఈ విధానం అ మలులోకి వచ్చిందని తెలిపారు. జీఎస్టీ విధాన మార్పులు, డీజిల్ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసు కు న్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాం ట్రాక్టల్లోనూ ఈ పద్ధతే అమలులో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.

    సింగరేణి సంస్థ టెండర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి బావ మరి దికి కట్టబెడుతున్నట్లు ఒక కట్టు కథను ప్రచారం చేస్తున్నా రని, వారు పేర్కొన్నట్లుగా సుజన్ రెడ్డి కంపెనీ శోధా కన్స్ట్ర క్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎండి దీప్తి రెడ్డి. ఆమె మాజీ టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారి కుమార్తె. ఆమె భర్త, ఆయన అల్లుడే సుజన్ రెడ్డి అని వివరించారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా పలు కాంట్రాక్టు పనులు నిర్వ హిస్తున్న ఐదు ప్రముఖ కాంట్రాక్టర్లు కూడా టీఆర్ఎస్ నేత లకు బంధువులు లేదా సన్నిహితులు అని వివరించారు. హరీశ్ రావుకు కానీ ఇంకా ఎవరికైనా కానీ అనుమానాలు ఉన్నట్లయితే తనను కోరినట్లయితే వివరించేవాడిని అని పేర్కొన్నారు.

    కేవలం నైనీ బ్లాక్ టెండర్ పైనే కాకుండా 2014 నుండి ఇప్ప టి వరకు జరిగిన అన్ని రకాల టెండర్లపై కూడా విచారణ చే పట్టడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారని ఆయన రాగానే తాను స్వయంగా ఆయనతో మాట్లాడి విచారణకు ఆదేశించేలా చూస్తానని పే ర్కొన్నారు. అప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయ న్నా రు.సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి. దీనిపై వ్యక్తిగత, రాజ కీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం చేస్తుంది” అని హెచ్చరించారు.“నేను రాజకీయాల్లోకి వచ్చి నది ఆస్తులు దోచుకోవడానికి కాదు. ప్రజల ఆస్తులను కా పాడటానికే వచ్చాను. సింగరేణి కార్మికుల చెమటతో ఏర్పడి న ఈ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో రాబందులకు అప్పగిం చను” అని భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు.

    తాను మండుటెండలో పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించి సింగరేణి గనులను సందర్శించానని, సింగరేణి కార్మికుల రక్తం, స్వేదముతో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, ఇటువంటి బొగ్గు సంపద పైన ఎటువంటి రాబందులు, గద్ద లు, పెద్దలను వాలకుండా చూడడమే తన కర్తవ్యమన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకోవాల్సిన అవ సరం అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క తెలిపారు. గత పదేళ్లలో కొత్త బొగ్గు గనుల అభివృద్ధిలో తగిన ప్రయత్నాలు జరగకపోవడం వల్ల భవిష్యత్తులో ఉత్ప త్తి, ఆదాయం తగ్గి వేలాది కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని హెచ్చరించారు.

    ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో మార్పులు, గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యమైన బొ గ్గు గనులను త్వరగా సొంతం చేసుకుని ఆపరేషన్లోకి తీసు కురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సింగరేణిని కేవ లం బొగ్గుకే పరిమితం చేయకుండా క్రిటికల్ మినరల్స్ రంగం లోనూ విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగ రే ణిపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశా రు. ప్రభుత్వం, సింగరేణి మేనేజ్మెంట్ మరియు కార్మికులు పూర్తి కమిట్మెంట్తో సంస్థ భవిష్యత్తును కాపాడుతారని స్ప ష్టం చేశారు.

    40 సంవత్సరాలుగా ఉన్నత విలువలతో తాను పనిచేస్తు న్నాననీ, తన వ్యక్తిత్వ హననానికి శ్రీ రాధాకృష్ణ పూనుకు న్నారని, అందుకే వాస్తవాలు వివరించానన్నారు. కనుక శ్రీ రాధాకృష్ణ తాను రాసిన రాతలు అవాస్తవమని, తిరిగి ప్ర జలకు వివరించాలని, లేనట్లయితే తదుపరి చర్యలు తీ సుకుంటామన్నారు.తాను 40 సంవత్సరాలుగా కొన్ని ఉన్న త విలువలతో పనిచేస్తున్నానని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయాలనుకుంటే చూస్తూ ఊరుకోనన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.