Tuesday, September 29, 2026
More
    HomeOpinionNalgonda SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర అల్టి మేటం, ఎన్నికల...

    Nalgonda SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర అల్టి మేటం, ఎన్నికల నిబంధనలు ఉ ల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

    📰 Generate e-Paper Clip

    Nalgonda SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్ల గొం డ క్రైమ్: నల్లగొండ జిల్లాలో జరుగనున్న మున్సిపాలిటీ ఎ న్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా,ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు చోటు చేసుకో కుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూ ర్తి చేసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పరిధిలోని నల్లగొండ కా ర్పొరేషన్ తో పాటు ఆరుమున్సి పా లిటీలలో జరిగే ఎన్నికల నిర్వ హణ కోసం జిల్లా ఎస్పీ ప్రత్య క్ష పర్యవేక్షణలో ఒక అడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్‌ఐలు ఇతర పోలీస్ సిబ్బం దితో కలిపి మొత్తం 1097 మంది మరియు 5 ప్లాటున్ల టిజి ఎస్పీ పోలీస్ సిబ్బందిని నియ మించి పటిష్ట భద్రతా ఏర్పా ట్లు చేపట్టినట్లు వెల్లడించారు.

    ముఖ్యంగా ఈ నెల 11వ తేదీన ఒక కార్పొరేషన్ తో పాటు 06 ము న్సిపాలిటీలలో 164 వార్డులో 47 3 పోలింగ్ స్టేషన్ల లలో జరగనున్న ఎన్నికల్లో 66 సమస్యాత్మక పోలింగ్ స్టేష నులను గుర్తించి, ఆయా పో లింగ్ స్టేషన్ పరిధిలో అదనపు బ లగాలు, 07 స్ట్రైకింగ్ ఫోర్స్,14 స్పె షల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 4 7 రూట్ మొ బైల్ పార్టీలు, 08 ఎస్ఎస్టి టీంలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

    ఎక్కడైనా చిన్నపాటి సమస్య తలె త్తినా అక్కడికక్కడే పరి ష్కరించే వి ధంగా ముందస్తు చర్యలు తీసుకున్నామని అ న్నారు.ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలా పాల కు పాల్పడే అవకాశం ఉన్న పాత నేరస్తులు, రౌడీషీటర్ల కద లికలను కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చామని జి ల్లా ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల్లో గొడవలు, కే సుల్లో ఉన్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మరియు రౌడీ షీ ట ర్లను గుర్తించి జిల్లా వ్యాప్తంగా 3 33 మందిని బైండోవర్ చే యడంతో పాటు వారి కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

    బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా గొడవలకు గా నీ, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు గానీ పాల్పడితే కఠి నమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

    ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున, ఓటర్లు పో లింగ్ కేంద్రా ల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రా నిక్ వస్తు వులు, మంటను ప్రేరేపిం చే వస్తువులు తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు. పో లింగ్ కేంద్రాల పరిసర ప్రాం తాల్లో 1 63 (బి.ఎన్.ఎస్.ఎస్) సెక్షన్ అమలులో ఉంటుం దని, కావున నలుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీట ర్ల పరిధిలో ఎవరూ ఉండకూడ ద ని, శాంతి భద్రతల కు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.

    పోలింగ్ కేంద్రాలలో గానీ, పరిసర ప్రాంతాలలో గానీ ఓట ర్ల ను ప్రలోభ పెట్టే చర్యలపై ప్రత్యేక నిఘా ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టే ఉద్దేశంతో నగ దు, మద్యం లేదా ఇతర వస్తు వులు పంపిణీ చేస్తున్నట్లు తె లిసిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాల ని ప్రజలను కోరారు.

    ఎన్నికల నియమావళి ప్రకారం పో లీసులు చేపట్టే చట్ట బద్ధమైన చర్య లను అతిక్రమిస్తే అట్టి వారిని ఎట్టి పరిస్థి తు ల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కావున జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ని ర్వహించేందుకు ప్రజలం దరూ పోలీసు యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందిం చాలని విజ్ఞప్తి చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.