Monday, September 28, 2026
More
    HomeOpinionDistrict Collector B. Chandrasekhar : గృహనిర్మాణ శాఖ సెక్రెటరీ గౌతమ్ కీలక ప్రకటన, మార్చిచివరినాటికి...

    District Collector B. Chandrasekhar : గృహనిర్మాణ శాఖ సెక్రెటరీ గౌతమ్ కీలక ప్రకటన, మార్చిచివరినాటికి లక్ష గృహప్రవేశాల లక్ష్యం

    📰 Generate e-Paper Clip

    District Collector B. Chandrasekhar : ప్రజా దీవెన, చి ట్యాల: మార్చి చి వ రినాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షగృహ ప్ర వేశాల లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర గృహ ని ర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి గౌతమ్ అన్నారు. మంగళవారం ఆ యన నల్గొండజిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ తో కలిసి నిర్మా ణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు.

    ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇం టి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలి స్తూ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ఇప్పటివ రకు బ్యాంకులో ఎంత జమ అయిందని, ఇంటి నిర్మాణ అం చనాలు అలాగే ఇప్పటి వరకైన ఖర్చు అని తదితర వివరా లను లబ్ధిదారుల నుండి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నిర్మిస్తు న్న ఇందిరమ్మ ఇండ్లన్నీ ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం కంటే ఎక్కువ నిధులు ఖర్చుపెట్టి నిర్మించుకుం టుం డడాన్ని గుర్తించిన సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం మం జూరు చేసిన 5 లక్షలలోపే ఇల్లు నిర్మించుకోవాలని , అప్పు చేసి ఎక్కువ మొత్తం ఖర్చు చేసి గృహాలు నిర్మించుకోవద్దని సూచించారు.

    ఈ విషయంపై ఇందిరమ్మ కమిటీ లు గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారు లకు అవగాహన కల్పించాలని, స్థానిక మేస్త్రీల ద్వారా సాధ్యమైనంత వరకు నిర్మాణ ఖర్చు తగ్గించి ఇల్లు ని ర్మించి ఇచ్చేలా చూడాలని చెప్పారు. మరోసారి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి లబ్ధిదారు లందరికీ అవగాహన కల్పించాలని స్థానిక సర్పంచ్ వీరన్న కు సూచించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణం మొత్తంతో పా టు, ఉపాధి హామీ కింద మంజూరు చేసే బిల్లు, అలాగే మరు గుదొడ్లకు మంజూరైన ఇండ్ల వివరాలను అడిగితెలుసుకు న్నారు. స్లాబ్, రూప్ స్థాయికి వచ్చిన వెంటనే వ్యక్తిగత మ రుగుదొడ్డి నిర్మానికై బుక్ చేయిం చాలని జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ కు, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ కు  సూచిం చారు.

    జిల్లాలో ఫినిషింగ్ స్టేజీలో ఎన్ని ఇండ్లు ఉన్నాయని ప్రశ్నించ గా 6300 ఇండ్లు ఉన్నాయని గృహ నిర్మాణ పీడీ సెక్రటరీకి వివరించగా, మార్చి చివరినాటికి 6300 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలని చెప్పారు.

    రాష్ట్ర స్థాయిలో మార్చినాటికి లక్ష గృ హ ప్రవేశాల లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు ఆ యన తెలిపారు. అనంతరం ఎస్సి  కాలనీలో ఇందిరమ్మ ఇం డ్లు మంజూరై ఇంకా నిర్మా ణం మెదలు పెట్టని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు ఇ ళ్ల నిర్మాణం ప్రారంభించకపో వడానికి గల కారణాలను అడి గి తెలుసుకున్నారు.

    మహిళా సంఘాల ద్వారా ముందుగా లక్ష రూపాయల రుణం మం జూరు చేయించాలని, ఇంకా ఇండ్లు ప్రారంభిం చని లబ్ధి దా రులు వెంటనే ఇండ్లు ప్రారంభించాలని సూచిం చారు.లబ్ధిదారులు మంత్రి స్వప్న, సంతోష ,కళమ్మ ,మాధవి తది తరుల ఇండ్లకు వెళ్లి ఇంటి నిర్మాణాలను చూస్తూ వారి తో ముఖాముఖి మాట్లాడారు. అలాగే ఇండ్ల నిర్మాణాలు ప్రా రంభించని లబ్ధిదారులు ప్రమీల, చోల్లేటి సత్యనారాయణ లతో కూడా మాట్లాడారు.

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దే శించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ని ర్మించుకోవా లని, ఎక్కువ కొలతల తో ఇంటి నిర్మాణం చేపట్టినట్లయితే ఖర్చు ఎక్కువ అవుతుందని, దానివల్ల ఇబ్బందులు ఏర్పడ తాయని తెలిపారు. ఈ విషయంపై గ్రామంలో అవగాహన క ల్పించాలని అధికారులకు సూచించారు.ఎం పీడీవో జయ లక్ష్మి, ఏఈ ప్రీతి, సర్పంచ్ వీరన్న తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.