Sunday, September 27, 2026
More
    HomeOpinionhyderabad acb raid : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ ఎరకు చిక్కిన పెద్దచేప,ఏసీబీకి రెడ్...

    hyderabad acb raid : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ ఎరకు చిక్కిన పెద్దచేప,ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జిహెచ్ఎంసి ఎగ్జామినర్

    📰 Generate e-Paper Clip

    hyderabad acb raid : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ నగరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విసి రిన వలకు మరో పెద్దచేప తగిలింది. సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్‌లో పనిచేస్తున్న జిహెచ్ఎంసి అకౌంట్స్ సెక్షన్ ఎగ్జా మి నర్ (AO) శ్రీ సూర్య వంశీ సంతోష్ గురువారం యాంటీ కర ప్షన్ బ్యూరో (ACB) చేతికి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. సంచ లనం సృష్టించిన ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. AcB సిటీ రేంజ్–2 అధికారులు నిర్వహించిన ప్రత్యేక ఆప రేషన్‌లో ఆయన తన కార్యాలయంలోనే లంచం తీసుకుం టూ పట్టుబడ్డారు.

    దర్యాప్తు వివరాల ప్రకారం ఒక ఫి ర్యాదుదారుని పదవీ విర మణ ప్రయోజనాల ఫైల్‌ను ప్రాసెస్ చేసి G HMC ప్రధాన కా ర్యాలయానికి పంపడానికి AO రూ.40,000 లంచం డిమాం డ్ చేశారు. చర్చల అ నంతరం రూ.35,000 వద్ద ఒప్పందం కుదిరింది.ACB అధికారులు ముందస్తుగా పన్నిన వ్యూహం తో ఫిర్యాదుదారు డు ఇచ్చిన రూ.35,000 లంచం మొత్తా న్ని స్వీకరిస్తున్న సమయం లోనే సూర్య వంశీ సంతోష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

    ఆయన వద్ద నుంచి లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీ నం చేసుకున్నారు.ఈ చర్యతో ప్రభుత్వ సేవలో ఉండి తన విధులను నిజాయితీగా నిర్వర్తించాల్సిన బాధ్యతను విస్మ రించి, అనవసర ప్రయోజనం కో సం అవినీతికి పాల్పడిన ట్లు స్పష్టమైందని ఏసీబీ అధికారులు తెలియజేశారు.

    ACB అధికారులు వెంటనే AOను అరెస్టు చేసి నాంపల్లి లో ని SPE & ACB కేసుల అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు ప రచి జ్యుడీషియల్ రిమాండ్‌కు పం పను న్నారు. కేసు ప్రస్తుతం ద ర్యా ప్తులో ఉన్నందున భద్రతా కా రణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివ రా లు గోప్యంగా ఉం చబడ్డాయన్నా రు. ఇదిలా ఉండగా ఏదైనా ప్రభుత్వ ఉద్యో గి లంచం డిమాండ్ చేసిన సందర్భంలో, ప్రజలు వెంటనే A CB టోల్ ఫ్రీ నంబర్ 1064 కు స మాచారం అందించాలని కోరారు.

    ప్రజలు క్రింది మార్గాల ద్వారా కూ డా ACB తెలంగాణను సంప్రదించవచ్చని సూచించారు. వాట్సాప్ కు 9440 44 6 106, ఫేస్‌బుక్ లో Telangana ACB, X (ముందు ట్విట్టర్) @TelanganaACB తది తర సామాజిక మాధ్యమాలతో పా టు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ర్పాటు చేసిన ACB QR కోడ్ ద్వా రా కూడా ఫిర్యాదు నమోదు చేయ వచ్చని, ఫిర్యా దు చేసిన వ్యక్తి పేరు మరియు వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.