Monday, September 28, 2026
More
    HomeOpinionBC Associations: బీసీ సంఘాలు అల్టిమేటం, ఫీజురీ యింబర్స్మెంట్ పథకాన్ని రద్దుచేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండoగా మారు...

    BC Associations: బీసీ సంఘాలు అల్టిమేటం, ఫీజురీ యింబర్స్మెంట్ పథకాన్ని రద్దుచేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండoగా మారు స్తాo 

    📰 Generate e-Paper Clip

    –ఫీజులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్ర భుత్వం పేద విద్యార్థుల ఉసురు పోసుకుంటుంది

    –ఫీజులు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్ర భుత్వం గద్దె దిగడం ఖాయం

    –ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల పక్ష మా బడుగు విద్యార్థుల పక్షమా తే ల్చుకోవాలి

    –ఐదు వేల కోట్లతో గాంధీ విగ్రహం పెడతారు గానీ 500 కోట్లు కూడా ఫీజు బకాయిలు ఇవ్వరా

    –ఫీజురియంబర్స్ మెంట్ నిధులి వ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాo

    –సీఎం, డిప్యూటీ సీఎం లకు పేద విద్యార్థుల పట్ల కనికరం లేదు

    –కమిషన్లు రావనే విద్యార్థుల ఫీజు లు ప్రభుత్వం ఇవ్వడం లేదు

    –ఫీజులు ఇవ్వకుంటే ప్రభుత్వంపై విద్యార్థులు తిరుగుబాటు తప్పదు

    –ఫీజు పోరు దీక్షలో అఖిలపక్ష పార్టీ లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల హె చ్చరిక

    BC Associations : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో ఉన్నత విద్యను చదువుకుం టున్న బడుగు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ నిధులను విడుద ల చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వయస్సు ఫీజుల రియంబ ర్స్మెంట్ పథకాన్ని రద్దు చే యాలని కుట్ర చేస్తుందని, అదే గ నుక జరిగితే రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలను అ డ్డుకుంటామని అఖిలపక్ష పార్టీల నేతలు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ఆది వారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చే యాలని, ఈ బడ్జెట్ లో ఫీజుల రియంబర్స్మెంట్ నిదుల వి డుదల కోసం పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్ తో ఫీజు పోరు దీక్ష ను చేపట్టారు.

    బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షుడు జాజుల శ్రీనివా స్ గౌడ్ ఆ ధ్వర్యంలో జరిగిన ఈ దీక్ష కు బీసీ విద్యార్థి సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ అధ్యక్షత వహించగా, జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ స మన్వయం చేశారు. ఈ దీక్షలో మాజీ గవర్నర్ బండారు ద త్తాత్రేయ, బిజెపి ఎంపీ ఈటల రాజేందర్, టిఆర్ఎస్ ఎమ్మె ల్సీ మధుసూదనాచారి, ఎల్ రమణ, వి శ్రీనివాస్ గౌడ్, సిపి ఐ నేత జి నరసింహ, టీజేఎస్ ఉపాధ్య క్షులు నిజ్జన రమేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, సి నీ దర్శకులు ఎన్.శంక ర్లు ముఖ్య అతిథి హాజరయ్యారు.

    ఉదయం 11 గంటలకు దీక్షను మొ దటగా బహుజన త త్వవేత్త వి జీ అర్ నారగోని ప్రారంభించగా, సాయంత్రం ఐ దు గంటలకు నిమ్మరసం ఇచ్చి మధుసూదనాచారి దీక్ష విర మింపచేశారు.అంతకు ముందు జాజుల శ్రీనివాస్ గౌడ్ మా ట్లాడుతూ బడుగు విద్యా ర్థులు ఉన్నత చదువులు చదు వు కోవాలనే లక్ష్యంతో గత ప్రభుత్వా లతో పోరాడి ఫీజుల రియంబ ర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చి న ట్లు ఆయన తె లిపారు, తాము అ ధికారంలోకి వస్తె పూర్తి ఫీజులను ప్రభు త్వమే చెల్లిస్తుందని, ఫీజుల బకాయిలు అన్నిటిని విడుదల చే స్తామని, ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి రెండు సంవత్స రాలు గడిచినప్పటికీ ఫీజులను బ కా యి ఇవ్వకుండా, పూర్తి ఫీజుల ను అమలు చేయకుండా కు ట్ర చేస్తూ బడుగు విద్యార్థులను ఉన్నత విద్య నుండి పోమ్మ నకుండాపొగపెడుతుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం లో మూడు లక్షల కోట్ల అప్పు చే సిందని, బడా కాం ట్రాక్టర్లకు 70 వే ల కోట్లు నిధులు విడుదల చేసి వా రి జేబు లు నింపిందని, బడుగు వి ద్యార్థులకు మాత్రం 7500 కోట్ల ఫీ జుల బకాయిలు ఇవ్వాలంటే సీఎం డిప్యూటీ సీఎం లకు కనికరం లే కుండా పోయిందని ఆయన ఆవేద న వ్యక్తం చేశారు, ఫీజుల ఇవ్వాల ని రోడ్డెక్కిన విద్యార్థులకు మొండి చేయి చూస్తూ ఇంకొకవైపు 5 వేల కోట్లతో గాంధీ విగ్రహం పెడుతుంద న్నారు, రెండు సంవత్సరాల కాంగ్రె స్ పాలనలో ఎవరికి ఎన్ని నిధులు విడుదల చేశారు శ్వేత పత్రం విడు దల చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ చేశారు, ఫీజులు ఇ వ్వకపోతే అసెంబ్లీకి ముట్టడించడానికి విద్యా ర్థులు సిద్ధం గా ఉన్నారని ఫీజులు విడుదల చేసే వరకు రాష్ట్రవ్యాప్తం గా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చ రించారు.

    హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజుల రియంబర్స్ మెం ట్ నిధుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తీవ్ర నిర్లక్ష్య వైఖరి కనబరుస్తుందని, ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు విద్యా ర్థుల శక్తిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం త క్కువ అంచనా వేస్తున్నట్టు కన బడుతుందని విద్యార్థులు తలుచు కుంటే ప్రభుత్వం కూలడం ఖాయం అన్నారు విద్యార్థులు ఫీజుల రి యంబర్స్మెంట్ నిధుల కోసం చేసే ఉద్యమం చాలా న్యాయ మైనదని వారికి అన్ని విధాల నేను అండగా ఉంటాను దత్తా త్రేయ తెలిపారు.

    బిజెపి పార్లమెంట్ సభ్యులు ఈట ల రాజేందర్ మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం పోయేకాలం దగ్గర పడ్డ దని, ఫీజులు ఇవ్వకుండా కళాశాల యజమాన్యాలను రేవంత్ రెడ్డి బె దిరించడాన్ని బట్టి చూస్తే ఆయన ప్రభుత్వం ఎంత దివాలా కోరు ప్ర భుత్వము ఇట్లనే అర్థమవుతుందన్నారు, విద్యార్థు ల బలిదానాల ద్వారా సాధించిన తెలంగాణలో ఈరోజు విద్యార్థులు ఫీజుల రియం బర్స్మెంట్ రాక హరిగోస పడుతు న్నారని, ఫీజులు రాక చదువులు కొనసాగించలేక విద్యార్థు లు ఆత్మ హత్యలు చేసుకోవడం మానవత్వం లేని ప్రభుత్వా నికి సిగ్గుచేటు అన్నారు పేద విద్యార్థుల ఉసురు కాంగ్రెస్ ప్ర భుత్వనికి తగులుతుందని ఈటల హెచ్చరించారు.

    ఎమ్మెల్సీ లు సిరికొండ మధుసూ దనాచారి, ఎల్ రమణ, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రె స్ అమలు చేయకుండా దొంగ నాటక లాడుతుందని, రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చి మో సం చేసిన ప్రభుత్వం కనీసం బీసీ విద్యార్థుల విషయంలో నైనా బడ్జెట్ నిధులు విడుదల చేసి ప్రభుత్వo చిత్తశుద్ధి నీ చాటుకోవాల్సిన అవ సరం ఉందని వారన్నారు

    బీసీ ఎస్సీ ఎస్టీలు పన్నులు కడితే నే రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల 56 వేల కోట్లు ఉందని, రాత్రికి రాత్రి కమీషన్ లు వచ్చే బడా బడా కాం ట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బి ల్లులు చె ల్లిస్తున్న ప్రభుత్వం వి ద్యార్థుల ఫీజుల రియంబర్స్మెంట్ బ కాయిలను చెల్లించడానికి వారికి ఎందుకు అభ్యంతరమ న్నారు.బిసి సంఘాలు చేపడుతున్న ఫీ జుల రియంబ ర్స్మెం ట్ ఉద్యమానికి టిఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు వారు ప్రకటించారు, ఫీజుల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసి న బీసీ సంఘాల ఆ ధ్వర్యంలో చే పట్టబోయే అసెంబ్లీ ముట్టడిలో తాము ముం దు వరుసలో ఉంటామని, ఇంత నిర్బంధం ఎదురైన బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసే వర కు ఈ బడ్జెట్లో 10000 కోట్లు కేటాయించే వరకు ఉద్య మాన్ని ఉధృతం చే యాలని వారు సూచించారు.

    ఫీజు పోరు దీక్షకు రాష్ట్రం నలు మూలల నుండి వేలాది మంది తరలి రావడంతో ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాలు బీసీ కళాకారుల ఆ టపాటలతో, విద్యార్థుల నినాదా లతో అట్టుడికి పోయింది. ఈ కా ర్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చై ర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘా ల జేఏసీ చైర్మన్ కుందా రం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి యువజ న సంఘం జాతీయ అధ్యక్షులు క నకాల శ్యాం కుర్మా, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు మనిమం జ రి సాగర్, బిసి జేఏసీ కన్వీనర్ జా జుల లింగంగౌడ్, బీసీ యువజన సం ఘం జాతీయ ఉపాధ్యక్షులు రావులకోల్ నరేష్ ప్రజాపతి, గంగ పుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ది టి మల్లయ్య, భువ నగిరి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, క రీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, కామారెడ్డి జిల్లా అ ధ్యక్షులు శాప శివరాములు, పెద్ద పల్లి జిల్లా అధ్యక్షులు శంక ర్, మ హిళా సంఘం ప్రధాన కార్యదర్శి తరాకేశ్వరి, జిల్లెల నరసింహ, గూ డూరు భాస్కర్ మీరు, బొల్లెపల్లి స్వామి గౌ డ్, సంధ్యారాణి, ఇంద్రo రజక, నేనా దేవి, గుంటి మహేష్, కొప్పుల చందు గౌడ్, వెంకటేష్ గౌ డ్, నాగరాజ్ గౌడ్, రాకేష్, నాగరా జు ముదిరాజ్, బండి గారి రాజు గౌ డ్, అంజమ్మ తదితరులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.