CM A. Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తె లంగాణ రాష్ట్రం భవిష్యత్తులో అన్ని మతాల ప్రజలు కలిసి కట్టుగా సోదరభావంతో ముందుకు సాగు తూ అభివృద్ధి పథంలో దూసుకు పోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రే వంత్ రెడ్డి ఆకాంక్షించారు. పవి త్ర రంజాన్ సందర్భంగా ని ర్వహించిన ఇఫ్తార్ విందు వేదికగా ఆయ న ఐక్యత, సామ రస్యం, సమగ్ర అ భివృద్ధి అనే సందేశాన్ని ప్రజలకు అందిం చారు.పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సం క్షేమ శాఖ ఎల్ బి స్టేడియం ( lal bahadur shastri stadium) లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రంజాన్ ఒక పం డుగ మాత్రమే కాదు, మనుషుల్లో విలువలను గుర్తు చేసే ప విత్ర కాలం. నెల రోజుల పాటు ఆత్మశుద్ధితో జీవిస్తూ ఇత రులకు సహాయం చేయడం, సమాజంలో సత్సంబంధాలు పెంపొం దించడం రంజాన్ మాసం అసలు సారాంశం” అని అన్నారు.
రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్న తికి ప్రభుత్వం ప్రత్యేక ప్రా ధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి పేర్కొ న్నారు. క్రికెటర్ అయిన మహమ్మ ద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి, ష బ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు గా అవకాశం కల్పించామని గుర్తు చేశారు. అలాగే క్రికెటర్ మహమ్మద్ శిరాజ్, బాక్సింగ్ చాంపియన్ నిఖాత్ జరీన్ కు డీఎస్పీగా ఉద్యో గాలు ఇచ్చి, రూ.2 కోట్ల ఆర్థిక స హాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా మై నారిటీ వర్గాలకు చెందిన ఎనిమిది మంది నాయకులను వివిధ కార్పొ రేషన్లకు చైర్మన్ లుగా నియమిం చామని తెలిపారు.
రంజాన్ పండుగ సమాజంలో స ఖ్యత, సోదరభావం పెంచేశక్తిగా ని లుస్తుందని ఆయన అన్నారు. భ విష్యత్తులో హిందువులు, ముస్లిం లు, సిక్కులు, క్రైస్తవులు అందరూ క లసి మత సామరస్యంతో రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగం గా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్య క్తం చేశారు.ఈ ప్రభుత్వం మన అందరిదీ… నేను మీ సోదరుడిని” అని ము ఖ్యమంత్రి పేర్కొంటూ, తెలంగా ణ మరియు హైదరాబాద్ నగరా న్ని కలిసికట్టుగా అభివృద్ధి చేయాలని పిలుపుని చ్చారు. ప్రజల సహ కారం ఉంటేనే రాష్ట్రం, దేశం మరిం త ప్రగతి సాధిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మ హమ్మద్ అజారుద్దీన్, పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌ డ్, ప్రభుత్వ సల హాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, లోక్‌సభ సభ్యుడు అస దుద్దీన్ ఓవైసీలతో పాటు అనేక మంది ప్రజాప్రతిని ధు లు, ముస్లిం మతపెద్దలు, మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


