Monday, September 28, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య, దేశంలో ఏకైక సెక్యులర్...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య, దేశంలో ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రె స్ 

    📰 Generate e-Paper Clip

    –బిజెపి కుల,మతాలను రెచ్చగొడు తూ రాజకీయం చేస్తోంది

    –మైనార్టీల సంక్షేమానికి కట్టుబడ్డ ప్రజాప్రభుత్వం

    –మతసామరస్యానికి మారుపేరు నల్లగొండ

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: మతసామ రస్యానికి మారుపేరుగా నిలిచిన నల్ల గొండ జిల్లాలో మైనార్టీల సంక్షే మానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టు బడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రం జాన్ పవిత్ర మాసాన్ని పురస్కరిం చుకొని సోమవారం ఆయన నల్గొం డ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న మదీనా మసీదులో ముస్లిం మైనార్టీ సోదరులకు దావత్ -ఏ- ఇఫ్తార్ ను ఏర్పా టు చేశారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం మై నార్టీల సంక్షేమానికి గతం నుండి ఎన్నో సంక్షే మ కార్యక్ర మా లను అమలు చేస్తు న్నదని, వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయం లో ఉద్యోగాలలో రిజర్వేషన్లు అ మలు చేయడం జరిగిందని, అలా గే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు న్నట్లు తెలిపారు.దేశంలో ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ని అని మంత్రి స్పష్టం చేశా రు. కేంద్రంలో బిజెపి కులమతా ల ను రెచ్చగొడుతూ రాజకీయం చే స్తుందని విమర్శించారు.

    దేశంలో అందరిని ఐక్యం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జూడో యా త్ర నిర్వహించారని ఈ సందర్భంగా తెలిపారు. గత 30 సంవత్సరా లు గా నల్లగొండలో హిందూ ముస్లిం లు కలిసి ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకుంటు న్నార న్నారు. పట్టణంలో పేద మైనార్టీ మహిళలకు టైలరిం గ్ లో శిక్షణ ఇ వ్వడమే కాకుండా, 150 మందికి కుట్టు మిష న్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

    రాబోయే మూడు సంవత్సరాలలో నిరుపేద ముస్లింలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, ముస్లిం మైనా ర్టీలకు ఔ ట్సోర్సింగ్ ఉద్యోగాలలో రి జర్వేషన్ కల్పిస్తామని, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ అ వసరం వచ్చినా ముస్లిం మైనారి టీ లు మేయర్ లేదా తన దృష్టికి తీ సుకురావచ్చని తెలిపారు.రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చే యా లని ఇప్పటికే సంబంధిత అధి కారులను ఆదేశించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

    ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎం ఏ హఫీజ్ ఖా న్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్ త దితరులు మాట్లాడారు. ఈ కార్య క్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మౌలానా హఫేజ్ నిజాముద్దీన్, కా ర్పొరేటర్లు,మాజీ కౌన్సిలర్లు ఇబ్ర హీం, సమద్, ఖయ్యూం బేగ్, బ షీర్, హాజీ, నదీమ్, మోయిన్ , ఇం తియాజ్ , షఫీ నవాజ్ ఖాన్, ఖలీ ల్ తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.