–క్యూర్ పరిధిలో మొదటివిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కార్యా చరణ
–ఏప్రిల్ 30వరకు గడువు అనర్హుల స్ధానంలో అర్హులకు కేటాయిస్తాం
Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లాల క్యూర్ (కో ర్ అర్భన్ రీజియన్ ఎకా నమీ) పరి ధిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణానికి అవసర మైన కార్యాచరణను సిద్దం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌ సింగ్, సమాచార పౌర సంబం ధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి అధికారులను ఆదేశించా రు. హైదరాబాద్ న గరంలో నివసిం చే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుం డా స్ధలాలను గుర్తించాల ని సూచించారు. ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి ఆలోచనలకు అనుగు ణంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రా ధాన్యత ఇస్తున్నా మని దీనికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని ఆదే శిం చారు.
సోమవారం సచివాలయంలోని త న కార్యాలయంలో సహ చర మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్‌ల తో కలిసి క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం, డ బుల్ బెడ్ రూం ఇళ్ల పై స మీక్షా సమావేశం నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు, అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లకు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక ఉండాలని ఎలాం టి రాజకీయ వత్తి ళ్లకు తలోగ్గవద్దని అధికారులకు స్పష్టమై న ఆదేశాలు జారీ చేశారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు పొంది వా టిలో నివసించకుండా అ ద్దెకు ఇ స్తున్నవారికి, ఏళ్ల తరబడి తాళా లు వేసి ఖాళీగా ఉంచుతున్నవారికి నోటీసులు జారీ చేయాలని, నోటీ సుల కు స్పందించని వారి ఇళ్లను రద్ధు చేసి అర్హులైన పేదలకు కేటా యించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎంతమంది కి నోటీసులు ఇ చ్చారు, ఎంతమంది స్పందించారు అక్కడ నివాసం ఉండకపోవడానికి వారు చెప్పిన కారణాలపై ఆరా తీ శారు. 2 బిహెచ్‌కే, జెఎన్ ఆర్.ఎమ్ తదితర పధకాల్లో ఇళ్లు పొంది ని వాసం ఉండని ఇళ్లను మే 1వ తేదీ నుంచి పరిశీలించాలని అటువంటి వారికి నోటీసులు ఇచ్చి, స్పం దించ ని పక్షంలో కేటాయింపులను రద్దు చేయాలని స్పష్టం చేశారు.
నోటీసులపై స్పందించిన లబ్దిదారుల నుంచి బాండు పేపరు పై తాము ఇక్కడే నివాసం ఉంటామని లేదంటే రద్దు చేసే అధికారం ప్రభుత్వాని కి అప్పగిస్తూ వారి నుంచి హామీ పొం దాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా అండర్ టేకింగ్ తీసుకోవాలని సూచించారు. నా లుగు జిల్లాల పరిధి లోగల కాలనీల్లో ముఖ్యంగా వి ద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస వసతులను తప్పని సరిగా కల్పించాలని, ఈ విషయంలో జి హెచ్ ఎంసీ సహకారాన్ని తీసుకో వాలని సూచించారు. ముఖ్యంగా 22వేల ఇళ్లకు వి ద్యుత్ మీటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం టవర్లు మొత్తం పూర్త య్యేవ రకూ ఆగకుండా పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు లబ్దిదారులకు కేటాయించాలన్నారు. అదేవిధంగా వివిధ కా లనీల్లో ఉన్న వాణిజ్య స ముదాయాలను అద్దె ప్రాతిపదకన గాకుండా వేలం పద్దతిలో వాటిని విక్రయించాలని ఆ విధం గా వచ్చిన డబ్బును అక్కడి సొసైటీ, ప్రభు త్వం పేరిట జా యింట్ అకౌంట్ పేరి ట వేయాలన్నారు. అంతేగాక ప్రజా ప్ర యోజన కార్యాలయాల కోసం కూడా కొన్నింటిని కేటాయిం చాలని తెలిపారు. ఈ విషయంలో సహకా ర శాఖ సమన్వ యంతో ముందుకు సాగాలన్నారు.ఈ సమావేశంలో గృహ నిర్మాణ శా ఖ కార్యదర్శి, ఎండీ, వీపీ గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్ట ర్లు, ఇతర అధికారులు పాల్గొన్నా రు.

