Vikarabad ACB trap ప్రజా దీవెన, వికారాబాద్: వికారా బాద్ జిల్లా తాండూరులో ఏసీబీ అ ధికారులు జరిపిన దా డుల్లో రెవెన్యూ అధికారి రె డ్ హ్యాండెడ్ గా ప ట్టుబడ్డారు. సంచలనం సృష్టించి న ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దే ముల్ మండలంలో చోటు చేసు కుంది. మండలంలో విధు లు నిర్వహిస్తున్న ఆర్ఐ రిచర్డ్ సైమన్ అవినీతి ఆరోపణల తో ఏసీబీ అధికారుల చేతికి చిక్కడం పెద్ద సంచలనం రేపిం ది.
గుడిమల్కాపూర్ ప్రాంతంలో మోటేషన్ ఫైల్ పనికి సంబం ధించి రూ.15 వేల లంచం తీసుకుం టుం డగా ఏసీబీ అధి కారులు రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘ టనతో స్థానికంగా ప్రభుత్వ కార్యా లయాల్లో జరుగుతున్న అక్ర మా లపై మరోసారి దృష్టి పడింది.ఈ కేసు తరువాత పెద్దేము ల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
పలు కీలక పత్రాలు, వివరాలను పరిశీ లిస్తూ మరిన్ని అవక తవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఈ ఘటనతో ప్రజల్లో అవినీతిపై వ్యతిరేక స్వరం మరింత బలపడు తోంది. భవిష్యత్తులో ఇలాంటి చ ర్యలు పెరిగి, ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెరగాలని స్థానికులు ఆశిస్తున్నారు.
