Monday, September 28, 2026
More
    HomeOpinionChandur BJP Bandh : చండూర్ బీజేపీ బంద్ ప్రశాంతం, ప్రజాస్వామ్యంపై దాడులను ఇకపై సహించబోమన్న...

    Chandur BJP Bandh : చండూర్ బీజేపీ బంద్ ప్రశాంతం, ప్రజాస్వామ్యంపై దాడులను ఇకపై సహించబోమన్న నేతలు 

    📰 Generate e-Paper Clip

    Chandur BJP Bandh : ప్రజా దీవెన, చండూరు: నల్లగొం డ జిల్లా చండూర్ పట్టణ బంద్ కార్యక్రమం ఒక సాధారణ బంద్ గా కాకుండా ప్రజా స్వామ్య చరిత్రలో నిలిచిపోయే రోజుగా నిలిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కా పాడడం కోసం మే ము అప్పుడూ పోరాడాం, ఇప్పుడూ పోరాడుతూ నే ఉన్నా మని తెలిపారు. చండూ రులో ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ క్యా డర్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ నేపధ్యంలో బుధవారం బీజేపీ పార్టీ చండూరు మున్సిపా లిటీ బంద్ కు పిలుపుని చ్చిన విష యం తెలిసిందే. ఉదయం నుంచి బీజేపీ రాష్ట్ర, జిల్లా నేతలతో పాటు నాయకులు, కార్యకర్తలు బంద్ సం పూర్ణంగా నిర్వహించారు.

    ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలే అస లైన శక్తి వారి తీర్పే తుది తీర్పు అధికారం లో ఎవరు ఉన్నా, ప్రజల సమస్య లే మొదటి ప్రాధాన్యం కావాలన్నారు. చం డూర్ వీధులు నిశ్శబ్దంగా ఉన్నా, ప్రజల మనసుల్లో మాత్రం గర్జన వినిపించిందని, ప్రజలు స్వ చ్ఛందంగా ఇళ్లలోనే ఉం డి, ఒక సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారని వివరించా రు.

    కొన్ని రోజుల క్రితం జరిగిన రాజకీ య దాడుల జ్ఞాపకం ఇం కా తాజాగానే ఉందని, ఆ ఘటనకు వ్యతి రేకంగా పిలుపు నిచ్చిన బంద్‌ కు ప్రజలు భారీగా మద్దతు ఇచ్చారన్నారు. ఈ సంఘటనతో చండూర్ ప్రజలు ఒక విషయం స్పష్టం చే శారని,న్యాయం కోసం పోరాటం ఎప్ప టికీ ఆగదని హెచ్చ రించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకునే లా చట్ట వ్యవస్థను మరింత బలపరచాలని డిమాండ్ చేశారు.

    రాజకీయ హింసకు ప్రత్యేక న్యా య వ్యవస్థ ఏర్పాటు చే యాలని, ప్రతి పౌరుడికి భద్రత హామీ ఇవ్వా లని అప్పీల్ చేశారు. మేము వెన క్కి తగ్గలేదని,ప్రజాస్వామ్యం కోసం మా పోరాటం తరతరాలకు కొన సాగుతుందని, చండూర్ బంద్ ఒక రోజు ఘటన కాదని, అది ప్రజల ఐ క్యతకు, న్యాయం కోసం పోరాటా నికి ప్రతీకగా మారింది. భవిష్యత్తు లో కూడా ఆ స్పూర్తి ఎన్నో ఉద్య మాలకు మార్గదర్శకం అయింద న్నా రు. ఈ కార్యక్రమంలో చండూరు స్థానిక నాయకత్వం పెద్ద ఎత్తు న పాల్గొంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.