–నల్గొండ జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అంతా అనుకూలం
–రైతులు పట్టుపురుగుల పెంపకం పైదృష్టి సారించాలి
— నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్ర శేఖర్ పిలుపు
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీ వెన, నల్లగొండ: పంటమా ర్పిడిలో భాగంగా రైతులు పట్టుపు రు గుల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చ ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం అయ న నల్గొండ జిల్లా కనగల్ మండలం నరసింహపురంలో రైతు పుండరీకం సాగు చేస్తున్న పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని సందర్శించారు.పట్టుపురుగుల పెంపకానికి ఉపయోగ పడే భూము లు,విస్తీర్ణం, పెట్టుబడి ఖర్చు, వాతావరణ అనుకూ లత, కూలీలు తదితర వివరాలను రైతు పుండరీకం ద్వారా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
పట్టుపురుగుల పెంపకం రైతు పుండరీక మాట్లాడుతూ ప ట్టు పట్టుపు రుగుల పెంపకానికి కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయని, ఒక ఎకరాకు పెట్టుబడి 8 నుండి 1 0 లక్షలు ఖర్చు అవుతుందని, ప్రతి సంవత్సరం 8 పంటలు తీయవచ్చ ని, ఒక పంటకు లక్ష రూపాయల నుండి నా లు గు లక్షల వరకు ఆదా యం వచ్చిన సందర్భాలు ఉన్నా య ని, తాను రెండు ఎకరాల్లో ప ట్టుపురుగుల పెంపకాన్ని చే ప ట్టడం జరిగిందని, 2017 సంవత్సరంలో పట్టుపురుగుల పెం పకం ప్రారంభించామని ఇప్పటివరకు నిరంతరాయంగా కొన సాగిస్తున్నట్లు తెలిపారు.
రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పట్టుపురుగుల పెంపకా న్ని చేపట్టవచ్చని, ముఖ్యంగా వరి లాంటి మంట ల కు వచ్చే తెగులు, ఎలాంటి చీడపీడల బెడదఉండదని, కేం ద్ర ప్రభుత్వం 50శాతం, రాష్ట్రప్రభుత్వం 25 శాతం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. రైతులకు మంచి లాభకారంగా ఇది ఉందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో పట్టుపురుగుల పెంప కానికి ఆసక్తి ఉన్న రైతులను ప్రో త్స హించాలని, ఏప్రిల్ 2న గ్రామా లలో నిర్వహించే ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక గ్రామసభలలో పట్టు పురుగుల తో టల పెంపకానికి రైతు లకు అవగాహన కల్పించాలని కలెక్ట ర్ సూచించారు.
పట్టు పురుగుల పెంపకానికి ప్రభుత్వం ఇచ్చే చేయూతను ఉపయోగించుకోవడం, అలాగే వ్యవసాయం లో నూతన సాంకేతికతను, మేలైన పద్ధతులను ఉపయోగించడం ప్రభు త్వ సబ్సిడీ వంటివాటిని పొందడం ద్వారా మంచి ఆదా యం వస్తుందని అన్నారు.రైతులు మూస పద్ధతిలో కాకుం డా అన్ని రకాల పంటలు పండించాల ని, ముఖ్యంగా జిల్లా లో ఆయిల్ ఫామ్ పట్టు పురుగుల పెంపకానికి ముందుకు రావాలని,వరి పండిం చడంలో తెలంగాణ దేశంలోనే ముం దుందున్నప్పటికి ప్రత్య మ్న య పంటల పట్ల కూడా రైతు లు దృష్టి సారించాలని, ఆయిల్ పా మ్, ఉద్యాన తోటల పెంపకం, ప ట్టు పురుగుల పెంపకం చేపట్టాలన్నారు.
ప్రత్యేకించి సెరికల్చర్ లో సబ్సిడీ బాగా ఉందని, అంతే కాక ఈ పంటలో ఎలాంటి వృధా అన్న ది లేనందున నష్టం కూడా రాద ని,సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగు బడులు లాభా లు వస్తాయని, పట్టుపురుగుల పెం పకానికి నల్గొండ జిల్లా భూమి, నీ రు ,అన్నీ అనుకూలంగా ఉన్నా యని, అలాగే సెరికల్చర్ కు మంచి మార్కెట్ ఉందని, మం చి డి మాండ్ ఉందని దీన్ని ఉపయోగించుకోవాలని తెలిపా రు.అనంతరం జిల్లా కలెక్టర్ రైతు పుండరీకంకు కేంద్ర ప్రభు త్వం ద్వారా మంజూరు చేసిన సెరికల్చర్ రిసో ర్స్ సెంటర్ ను సం దర్శించి రైతులతో మాట్లాడారు. అన్ని గ్రామాల స ర్పంచ్ లు సేరికల్చర్ పంట పట్ల ప్రోత్సహించాలని ఈ సంద ర్భంగా తెలిపారు.
కాగా ఇందిరమ్మ ఇండ్ల గురించి జిల్లా కలెక్టర్ సర్పం చులతో మాట్లాడుతూ గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అ న్నారు. వ్య క్తిగత మరుగుదొడ్ల బిల్లులు గురిం చి ఆరాతీశారు. సెక్ర టరీతో మాట్లాడి వ్యక్తిగత మరుగుదొడ్లకు బుక్ చే సుకోవ డం ద్వారా వ్యక్తిగత మ రు గుదొడ్ల బిల్లులను పొంద వచ్చ ని కలెక్టర్ తెలిపారు.జిల్లా ఉద్యాన శాఖ డిడి సుభాషిని మా ట్లాడారు. హర్టికల్చర్ అధికారి అనంతరెడ్డి, నరసిం హపురం సర్పంచు రాజేశ్వరి, ఇతర గ్రామాల సర్పంచులు తదితరు లు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి
నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశాల కు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం, తెల కంటి గూడెంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. తెలకం టి గూడెంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మిస్తున్న మొత్తం ఇండ్లు, ఇప్పటి వరకు ప్రారంభించినవి, ప్రారంభానికి సిద్ధం గా ఉన్న ఇండ్లు అడిగి తె లుసుకున్నారు. నిర్మాణాలు పూర్త యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ప్రారం భోత్సవాలకు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూ చించారు.
కాగా ఇందిరమ్మ ఇళ్ల కాలనీలో నీటి ఎద్దడి ఉందని, ఎండా కాలం సమస్య ఎక్కువగా ఉంటుందని, అందువల్ల తాగునీ టి సమస్య తీర్చాలని ఇందిరమ్మండ్ల గృహాలబ్ధిదారులు జి ల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం దూరం నుండి పైపు లై ను వేసుకుని నీటిని తెచ్చుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ విష యమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ని తేలకంటి గూడెంకు పంపిస్తానని కలెక్టర్ చెప్పారు. తాగునీటిని సరఫరా చే సేం దుకు ఉన్న అవకాశాలను పరిశీలించి తెలకంటి గూడెంకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాగునీటి పను లు మంజూరు ఇచ్చిన వెంటనే పనులు ప్రా రంభించాల్సిందిగా ఆయన పంచాయతి కార్యదర్శిని ఆదే శించారు.



