Monday, September 28, 2026
More
    HomeOpinionMinister N. UttamKumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కిలక వ్యాఖ్య, పెట్రోల్,డీజిల్,...

    Minister N. UttamKumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కిలక వ్యాఖ్య, పెట్రోల్,డీజిల్, గ్యాస్ కొరత లేదు, సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి 

    📰 Generate e-Paper Clip

     

    Minister N. UttamKumar Reddy : ప్రజా దీవెన, హైద రాబాద్: రాష్ట్రం లో పెట్రోల్,డీజిల్,ఎల్పిజి కొరత ఉత్పన్నమ య్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శా ఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్ర ధానం గా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్,డీజిల్, ఎల్.పి.జి కొర త అంటూ జరుగు తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖం డించారు. ఇంధన వనరులతో పాటు ఎల్.పి.జి కొరత అం టూ వస్తున్న వదంతులతో ప్రజలెవరూ గందరగోళంలో పడొ ద్దని ఆయన ఉద్బోధించారు.ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ప్రాంగ ణంలో పౌర సర ఫరాల శాఖ కమి షనర్ స్టీఫెన్ ర వీం ద్రతో కలసి ఆయన మీడియాతో ముచ్చటించారు.

    రానున్న మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉ న్నాయని జరుగుతున్న వదంతుల తో ఏ ఒక్కరూ అయోమయంలో పడొద్దని ఆయన సూచించారు. ఇండియన్ ఆయిల్ కార్పొ రేషన్ లిమిటెడ్,భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో హిందుస్థాన్ పె ట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లు ఇంధన సరఫరాలను గ ణనీయంగా పెంచాయని ఆయ న పేర్కొన్నారు. డిమాండ్ ని మించి సరఫరా కొనసాగుతోం దని,ఈ రోజు 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,8 98 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శన మన్నా రు.అంటే 652 కిలో లీటర్ల అదనపు నిల్వ మిగిలిందన్నారు. దీనికి తోడు అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచ డంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగి స్తున్నామని ఆయన తెలిపారు.

    వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగో ళ్లు చేయడంతొ రోజు వారి డిమాండ్ ఒక్క సారిగా 25శాతం పెరిగినా రోజు వారీ సరఫరాలో సగటున పోల్చి చూసినపు డు కుడా ఎక్కడా అంత రాయం కలుగకుండా అదనంగా 2 2 శాతం అందుబాటులో ఇంధన వనరులు నిల్వలు ఉన్నా యని ఆయన తెలిపారు.అయితే కొన్ని పెట్రోలు బంక్ లకు నిర్ణిత సమయా నికి ట్యంకర్లు చెరుకోకపోవడంతో ఆయా బంక్ లలో నో-స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు. వాస్త వంగా మాత్రం ఎంత మాత్రం కొరత లేదని ఆయన పునరు ద్ఘాటించారు.

    అయితే అదే సమయంలో షికార్లు చేస్తున్న పుకార్లను నమ్మి వినియో గదారులు కంటైనర్లలో,డబ్బాలలో పెట్రోల్, డీజిల్ ని తీసుకెళ్లడం పూ ర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని అంత కుమించి ప్రమాదకరమని ఆ యన హెచ్చరించారు. పెట్రోలి యం నిలువలు రానున్న 65 రోజులకు సరిపడా ఉన్నాయ ని, సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేలా నిరంతరం కొన సాగేందుకు వీలుగా O.G.C లైన్ ను విస్తరించినట్లు ఆయన వెల్లడించారు.

    రాష్ట్ర రాజధానిలో 596 పెట్రోల్ బంక్ లు నిరంతరాయంగా పని చే స్తున్నాయని,హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఎక్క డ కుడా కొరత లేదని,అహ్మదాబాద్, సూరత్, బెం గుళూరు, ధారవాడ ,బెల్గాం వంటి నగరాలలో కూడ ఇదే పరిస్థితి ఉ త్పన్నమయ్యాయన్నారు.ఎల్.పి.జి విషయంలో ఎటువంటి కొరత లేదని,కాకపోతే కమర్షియల్ సిలిం డర్ల సరఫరాలో కొంతమేర సమస్య ఉన్నట్లు గుర్తించమన్నారు.

    ఇదే సందర్భంలో అక్రమంగా వినియోగిస్తు న్న 2,952 కమర్షి యల్ సిలిండర్ల ను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు లు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పెట్రోల్, డీ జిల్ గృహ వినియోగదారులకు అ వసరమైన ఎల్.పి.జి స మృద్ధిగా అందుబాటులో ఉందని, ప్రజలేవరు అయోమయా నికి గురి కావొద్దని,వదంతులను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొ ద్దని రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపుని చ్చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.