Sri Sita Ramachandra Swamy Kalyanam : ప్రజా దీ వెన, భద్రాచలం: శ్రీరామన వమి సందర్భంగా భద్రాచలం మ రో సారి భక్తి, సంప్రదాయం, సాంకేతికత కలగలిసిన ఆధ్యా త్మిక నగరంగా వెలిగొoదిoది. తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్ర పంచం నలుమూలల నుంచి భక్తులు ప్రత్యక్షంగా మాత్రమే కాదు, హోలోగ్రాఫిక్ దర్శనాల ద్వారా కూడా శ్రీసీతారాముల క ల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించారు.భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి సతీ సమేతంగా ఈ కళ్యాణ మహోత్స వంలో పాల్గొన్నారు.
అత్యాధునికంగా రూపుదిద్దుకున్న మిథిలా డిజిటల్ స్టేడి యంలో, వేద మంత్రాలు కేవలం శబ్దంగా కాకుండా 3D శ్రు తి తరంగాల రూపంలో ప్రతిధ్వనించడo విశేషంగా నిలిచిం ది. పూర్వకాలపు పల్లకి ఊరేగింపు ను ఇప్పుడు లేజర్ లై ట్లు, డ్రోన్ దీ పాలతో అలంకరించి సంప్రదాయ బద్దంగా శ్రీసీ తారాములను అంగరంగ వైభవంగా మండపానికి తీసుకొ చ్చారు.
ఉదయం 10:30 గంటలకు కల్యా ణ ఘట్టంప్రారంభమయ్యే సమయానికే లక్షలాది మంది భక్తుల హృదయ స్పందనలు ఒకే తాళం లో వినిపించాయి. అభిజిత్ లగ్నం లో ఆలయ అర్చకులు జీలకర్ర బె ల్లం కార్యక్రమాన్ని నిర్వహించగా, ఆ దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రత్య క్ష ప్రసారం అయింది. అనం తరం శ్రీ రాముడు సీతమ్మ మెడలో మాంగల్యాన్ని ధరింపజే సిన క్షణo భక్తుల కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. త లంబ్రాల వేడుకలో డిజిటల్ పుష్పవర్షం కురిసినా, భక్తి మా త్రం యథాతథంగా నిలిచింది. సంప్రదాయం మారలేదు, దా నికి రూపమే కొత్తగా మారింది.
ఈ మహోత్సవానికి ప్రముఖులు, నాయకులు కూడా హాజర య్యారు. రేవంత్ రెడ్డి దంపతులు స్వ యంగా వచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల త లంబ్రాలను సమర్పించారు. వారి సందర్శనతో వేడుక మరింత ఘనత ను సంతరించుకుంది.తెలుగు రాష్ట్రాలే కాదు, విదేశాల నుం చి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు.
“శ్రీరామ” నామ స్మరణ తో ఆ ప్రాంగణంమార్మోగి, ఒక ఆ ధ్యాత్మిక తరంగం లా ప్రపంచాన్ని కమ్మేసింది. అందమైన అలంకరణలతో మెరిసిపోయిన దేవాలయం, స్మార్ట్ సదు పాయాలతో సజ్జమైన ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇ బ్బంది లేకుండా సుఖంగా దర్శనం కలిగించాయి. భవిష్యత్తు మారి నా భక్తి మారలేదు.సీతారాముల కల్యాణం కాలాన్ని దాటి, మనసుల ను కలిపే శాశ్వత మహోత్సవంగా నిలిచిందని భక్తులు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా మిథిలా స్టేడియంలో శ్రీ రామచంద్రస్వామి, సీతమ్మ వారికి పూజా కార్యక్రమం, అలంకరణ, తదితర కా ర్యక్రమాలు నిర్వహించి పెళ్లి కొనసాగించారు. శాస్త్రోక్తంగా ని ర్వహించిన పూజా కార్యక్రమాలు, వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావ రణాన్ని సృష్టించింది. ఆలయ అర్చకులు సంప్రదాయబ ద్ధంగా అన్ని కార్యక్రమాలను నిర్వహించారు.
భద్రాచలం ఆలయం సర్వాంగ సుందరంగా అలంకరించబడ గా, భక్తుల రాక పోకలతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భ క్తులు శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దర్శనం కోసం భారీ గా తరలివచ్చి దర్శనం పొందారు.భక్తుల రద్దీ దృష్ట్యా అధి కారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. త్రాగునీరు, అన్న ప్ర సాదం, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వ హించడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వా మివారిని దర్శించుకున్నారు.
ఆలయ తొలిదశ పనులకు భూమి పూజ
అంతకుముందు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆల యంలో స్వామి వారిని దర్శించు కున్నారు. అనంతరం ఆల యం వద్ద 351 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి తొలిదశ పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మం త్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాంనాయక్, న్యాయమూ ర్తులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా అయ్యర్, ఎం డోమెంట్ కమీషనర్ హన్మంత రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, పీఓ బి. రాహుల్, అదనపు కలెక్టర్లు వి ద్యా చందన, వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎమ్మె ల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, లక్షలాది మంది భక్తులు పెద్ద సంఖ్య లో హాజరయ్యారు.




