Sunday, September 27, 2026
More
    HomeOpinionMinister Ponguleti Srinivasa Reddy : బిగ్ బ్రేకింగ్, కేటీఆర్ ఘాటు వ్యా ఖ్యలు, మంత్రి...

    Minister Ponguleti Srinivasa Reddy : బిగ్ బ్రేకింగ్, కేటీఆర్ ఘాటు వ్యా ఖ్యలు, మంత్రి పొంగులేటిని తక్ష ణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ 

    📰 Generate e-Paper Clip

     

    Minister Ponguleti Srinivasa Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్, అ వినీతి వ్యవహారాలపై బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ ర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. శాసనసభ పక్ష ఉపనే త హరీష్ రావు బయటపెట్టిన వివరాల నేపథ్యంలో ప్రభు త్వం కలవరపడిందన్నారు.శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు నిన్న రాష్ట్ర ప్రభుత్వంలో నం బర్ 2గా ఉన్న ఒక మం త్రి స్కామ్‌ ను ఆధారాలతో సహా బయటపె ట్టారని, ఆ మం త్రి కుటుంబాని కి చెందిన కంపెనీ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మైనింగ్‌కు పాల్ప డిందని తెలిపారు. ఈ వివరాలు కూడా ప్రభుత్వమే ఇచ్చిన డాక్యు మెంట్ల ఆధారంగా బయ టకు వచ్చాయని పేర్కొన్నారు.

    అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఇతర సంస్థలపై ప్రభుత్వం చ ట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ, రాఘవ కన్స్ట్రక్షన్స్‌ పై ఎందుకు చర్యలు తీ సుకోవడం లేదని ప్రశ్నించారు. మం త్రి కంపెనీ కావడం వల్లనా, లేక ముఖ్యమంత్రి పాత్ర ఉండ డం వల్ల నా చర్యలు తీసుకోవడం లేదని అనుమానంవ్యక్తం చేశారు.ఈ వి షయంపై హరీష్ రావు ఆధారాల తో సహా వా స్తవాలు బయటపెట్టి న తర్వాత ముఖ్యమంత్రి స్పందిస్తూ రెండు విషయాలు ఒప్పుకు న్నారని కేటీఆర్ తెలిపారు. అక్ర మాలు జరిగినట్లు అంగీకరించి న ప్పటికీ, వాటిని బయటపె ట్టింది ప్ర భుత్వం అన్న పేరుతో ఎదురు దాడి చేయడం విచి త్రమన్నారు. అలాగే రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూరపు బం ధువులదని చెప్పడం హాస్యాస్ప దమని విమర్శించారు.

    మంత్రి భార్య, కొడుకు, తమ్ముడు కంపెనీతో సంబంధం ఉ న్నారని, 2020-22 వరకు ఆయనే ఛైర్మన్‌ గా ఉన్నారని గు ర్తు చేశారు. ముఖ్యమంత్రి మాటల్లో విరుద్ధతలు ఉన్నాయ ని పేర్కొన్నారు. తెలంగా ణ మాత్రమే సముద్రతీరంలేని రా ష్ట్రం అన్న వ్యాఖ్యలతో ఆయన అ వగాహన స్థాయి బయ టపడిందని ఎద్దేవా చేశారు.రాఘవ కన్స్ట్రక్ష న్స్‌పై ముఖ్య మంత్రికి ఉన్న అనుకూలత వెనుక కారణాలను విశ్లేషిం చిన ప్పుడు, ముఖ్యమంత్రి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్న ట్లు స్పష్టమవుతోందని కేటీఆర్ ఆరో పించారు. కొడంగల్ లి ఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆ కంపెనీకి అప్పగించడం, రాష్ట్రం లో భూదందాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఆయన అనుచరుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు.

    రెండున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా కేసులు, కమిషన్లతో కాల క్షేపం చేస్తోందని విమర్శించారు. తప్పు చేయకపోతే భయం ఎందుకు అని ప్రశ్నిస్తూ, మంత్రి కుటుంబ సం స్థపై చర్యలు ఎందుకు తీసు కోవడం లేదని నిలదీశారు. చట్టప్రకారం రెండో నోటీసు ఇస్తే సంవత్సరం జైలు శిక్ష పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. మైనింగ్ శాఖ మంత్రి అక్ర మాన్ని కేవలం రూ.4 లక్షల వ్యవ హారంగా చూపడం సిగ్గుచేటని అ న్నారు. అధికారుల దాడి లో ఒకే రోజులో రూ.32 లక్షల విలువైన అక్రమాలు బయట పడిన నేపథ్యం లో, రెండున్నరేళ్లలో జరిగిన అవినీతి పరి మాణాన్ని అంచనా వేయవచ్చని పేర్కొన్నారు.

    కోకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్ కం పెనీ కూడా ముఖ్యమం త్రి బంధు వులకు చెందినదని ఆరోపించారు. ప్రభుత్వం మై నింగ్ రెవెన్యూ పెరి గిందని చెప్పుకుంటున్నప్పటికీ, వా స్త వంగా రావాల్సిన రూ.1700- 1800 కోట్లలో కేవలం రూ.90 0 కోట్లు మాత్రమే వస్తున్నాయని, మిగిలిన నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో వివరించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మొత్తం వ్యవహారంపై సభా సంఘం ఏర్పాటు చేసి మం త్రి, ముఖ్యమంత్రి, ఇతరుల పాత్ర లను బయటపెట్టాలని డి మాండ్ చేశారు. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులో హౌస్ కమిటీ ఏర్పా టు చేసినట్లు, ఇదే విధంగా పారదర్శక విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే ఎం దుకు భయపడుతోందని ప్రశ్నించారు.

    ఈ స్కాంలో బీజేపీ సభ్యుల ప్రవర్తన కూడా గమనించాల్సి న అంశమని, వారు ప్రతిపక్షంగా వ్యవహరించకుండా ప్రభు త్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమ ర్శించా రు. కేంద్ర ప్రభుత్వానికి స మాచారం ఇచ్చినా స్పందన లేద ని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌లో పాల్గొన్న మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని ఆ రోపిస్తూ వీరిని వది లిపెట్టబోమని హెచ్చరించారు.ఇక హై దరాబాద్ మెట్రో అంశంపై కూడా కేటీఆర్ స్పందించారు. ము ఖ్యమంత్రి చేసిన ప్రకటనలో అనేక అసత్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. రూ.22 వేల కోట్ల ఆస్తిని రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేశామని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించ డమేనన్నారు.

    మెట్రో కోసం ఇచ్చిన 280 ఎకరాల భూమి ప్రభుత్వానిదేన ని, అది కేవ లం లీజుకు మాత్రమే ఇచ్చినదని వివరించారు. ఆ భూమిపై ఎల్ అం డ్ టీ నిర్మాణాలు చేసి, ఆ తర్వాత ప్ర భుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుందని ఒప్పందం ఉందన్నా రు.ప్రైవేట్ సంస్థ అప్పును రాష్ట్ర ప్రజలపై మోప డం సిగ్గుచేటని వి మర్శించారు. ఎల్ అండ్ టీపై ఒత్తిడి తె చ్చి ఆస్తులను స్వాధీనం చే సుకునే కుట్ర జరుగుతోందని ఆ రోపించారు.హైదరాబాద్ మెట్రో విస్త రణకు కేంద్ర ప్రభుత్వం అభ్యంత రం చెప్పలేదని, గతంలో ప్రాజెక్టు ప్రారంభించిన ప్పుడు ఎలాంటి స మస్యలు లేవని గుర్తు చేశారు. ఇ ప్పుడు మాత్రం కొత్త కారణాలు చూపించడం సరైంది కాదన్నారు.

    ఈ వ్యవహారం మొత్తం ఒక పెద్ద భూదందా స్కెచ్‌గా కనిపి స్తోందని, 280 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడమే అసలు లక్ష్యమని ఆరోపించారు. ఇందులో ప్రజల ప్రయోజ నాలు లేవని స్పష్టం చేశారు.ఈ అంశంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జి తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి వెం టనే బర్తరఫ్ చే యాలని, ప్రభుత్వం స్పందించక పోతే గవర్న ర్‌ను కలిసి ఫిర్యాదు చే స్తామని తెలిపారు.ప్రధాన ప్రతిప క్షంగా ఈ అంశాన్ని వదిలిపెట్టబో మని, అవసరమైతే ప్రజ ల్లోకి వెళ్లి విస్తృతంగా తీసుకెళ్తామని కేటీఆర్ హెచ్చరించా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.