Tuesday, September 29, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం, ఏప్రిల్ ఒకటి నుండి...

    Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం, ఏప్రిల్ ఒకటి నుండి ఈ-ఆ ఫీస్ తో మాత్రమే ఫైళ్లను నిర్వహిం చాలి 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఏప్రిల్ ఒకటి నుండి ఈ- ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను ని ర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ- ఆఫీస్ ద్వారా ఫైళ్ళ నిర్వహ ణ విషయమై ఇదివరకే జిల్లా అధికారులు, వారి సిబ్బందికి శిక్షణఇచ్చినట్లు ఆయన చెప్పారు. అందువల్ల జిల్లా అధికా రులందరూ ఈ- ఆఫీస్ ద్వారా మా త్రమే ఫైళ్ళ నిర్వహణకు సంసిద్ధం కావాలని ఆయన కోరారు. సోమ వారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం జి ల్లా కలెక్టర్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

    ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా ఏప్రిల్ 2 న గ్రామసభలు నిర్వహించాలని, అలాగే మున్సిపాలిటీల లో మున్సిపల్ వార్డు సభలు నిర్వహించాలని, ప్రభుత్వం జారీ చేసే సూచనల ప్ర కారం గ్రామ, వార్డుసభలు నిర్వ హిం చాలని చెప్పారు. ఇదివరకు ఆదేశించినట్లు వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామసభల లో చదివి వినిపించాలని, గ్రామసభల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఫోటోలు, వీడి యోలతో ప్రజెంటేషన్ ఇవ్వాలని, ఎంపీడీవోలు, పంచాయతీ కార్య దర్శులు సమావేశాల మి నిట్స్‌ను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.

    ప్రజా పాలన పరిధిలోకి రాని పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను ఉదాహరణకు వి విధ సంక్షేమ శాఖల ద్వా రా విద్యా ర్థులు పొందిన ఉపకారవేతనాల లబ్ది, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి, 6 గ్యా రంటీల ద్వారా పొందిన లబ్ది అలాగే ధర ణి కింద తిరుమలగిరి సాగర్ మండలాన్ని, భూభారతి కింద దేవ రకొండ మండలంలో తీసుకున్న పైలెట్ ప్రాజెక్టును, కన గల్ మండ. లంలో పైలెట్ ప్రాజెక్టు కింద సోలార్ రూఫ్ టాప్ ద్వారా లబ్ధి పొందుతు న్న లబ్ధిదారుల వివరాలను సైతం ప్రజలకు తెలియజేయాలని, అందువల్ల గ్రామం, మండలం, నియో జకవర్గం, జిల్లా వారీగా రూపొందిం చి వెంటనే సిపిఓ కు సమర్పించా లని ఆదేశించారు.

     

    అలాగే ఈ- వేస్ట్ నిర్వహణ వివరాలు ఇవ్వాలన్నారు. పెం డింగ్ ప్రజా వాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి పెం డెన్సీని తగ్గించాలన్నారు. రబీధాన్యం కొనుగోలు ప్రా రంభ మైన దృష్ట్యా రానున్న రెండు న్నర నెలలు అత్యంత కీలకమ ని, అలాగే జూన్ వరకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక, జనగ ణన, ధాన్యం కొనుగోలు, వంటి ముఖ్యమైన పథకాలను అ మలు చేయాల్సి ఉందన్నారు.

    జిల్లా అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అ త్యవసరమైతే తప్ప, ఎ వరికి సె లవులు ఉండవని స్పష్టం చేశారు.మండల ప్రత్యేక అధికారులు వారి మండలాలలో టె న్త్ పూర్తి చేసిన వి ద్యార్థులు ఎట్టి పరిస్థితులలో ఖాళీగా ఉం డరాదని, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ వoటి కోర్సు ల్లో తప్పనిసరిగా చేరేలాచర్యలు తీసుకోవాలని ఆదేశించా రు.

     

    ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలో నిలిపి పెళ్లిళ్ల వై పు వెళ్లకుండా ప్రోత్సహించాలని చెప్పారు.ధాన్యం కొనుగో లు సమయం లో రవాణా సౌకర్యాలను మెరుగు పరచా లని, డీఆర్‌డీఏ, మెప్మా తది తర శాఖలు ధాన్యం కొనుగో లుకు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రాబోయే ఎం డాకాలాన్ని దృష్టి లో ఉంచుకుని తాగునీటి సమస్యలు రా కుండా అన్ని శాఖలు సమ న్వయంతో పని చేయాలని, అ న్ని శాఖలలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ వెంటనే క్లియర్ చేయా లని అన్నారు. అనంతరం మార్కెటింగ్ శాఖ ద్వా రా 2025 -2026 రబీ ధాన్యం కొ నుగోలుపై రూపొందించిన గోడప త్రికను ఆవిష్కరించారు. జిల్లా ము స్లిం ఉద్యోగుల టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

     

    27 వ జాతీ య సీనియర్ చెవిటి క్రీ డల ఛాంపియన్షిప్ పోటీలలో మెడల్స్ పొందిన జిల్లా క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు. కాగా సోమవారం నాటి ప్రజావాణికి మొ త్తం 126 ఫి ర్యాదులు రాగా,రెవెన్యూ శాఖకు 69,ఇతర శా ఖలకు 57 ఫి ర్యాదులు వచ్చాయి. ప్రజావాణి కా ర్యక్రమా నికి రెవిన్యూ అదనపు కలె క్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ స బ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థా నిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలె క్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, చం డూర్ ఆర్డిఓ శ్రీదేవి, దేవరకొండ ఆ ర్డిఓ రమణారెడ్డి, జిల్లాఅధికారులు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.