Tuesday, September 29, 2026
More
    HomeOpinionBC Jajula Srinivas Goud : బీసీల ఊసే లేకుండా నిరాశగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

    BC Jajula Srinivas Goud : బీసీల ఊసే లేకుండా నిరాశగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

    📰 Generate e-Paper Clip

     

    BC Jajula Srinivas Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చ టగా మూడోసారి జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో బీసీల డిమాండ్లను చర్చించ కుండా బీసీలకు జరిగిన అన్యా యాన్ని ప్రభుత్వం సరిదిద్దకుండా తాజా అసెంబ్లీ సమావేశా లు బీసీ లను తీవ్ర నిరాశ మిగిల్చాయని బీ సీ జే ఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.బుధవారం హైదరాబాదులోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో ఏ ర్పా టు చేసిన మీడియా సమావే శంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మా ట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే మహా త్మా జ్యోతిబాపూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని తీ సుకొ స్తామని, బీసీల బడ్జెట్ ప్రతి ఆ ర్థిక సంవత్సరం 20 వేల కో ట్లు కేటా యించి, ఐదు సంవత్సరాల కాలం లో లక్ష కోట్లు కేటాయిస్తామని, ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు లను ప్రభుత్వమే భరించాల ని, బకాయిలను చెల్లిస్తామని హా మీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన త ర్వాత, ఇప్పుడు మా ట మారుస్తుందని ఆయన ఆరోపించారు.

    గత రెండు సంవత్సరాల కాలంలో బీసీల సంక్షేమానికి కేవ లం 9200 కోట్లు, 11400వేల కోట్లు కేటాయిం చి, ఈ రెండు సంవత్సరాలుగాను కేవలం 6000 కోట్లు మాత్రమే ఖ ర్చు చేసిందని, మూడు బడ్జెట్ లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన, బీసీ సబ్ ప్లాన్ పై అసెంబ్లీలో కనీసం చర్చ కూడా పెట్టకపోవడం చాలా దారు ణమన్నారు. ఫీజుల రియంబర్స్మెం ట్ నిధులు రాక బీసీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్ర భుత్వంలో కనీసం స్పందనలేదని, విద్యకు అధిక ప్రాధాన్య త ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభు త్వం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఫీజుల బకాయిలు చెల్లిం చకుండా పేద విద్యార్థుల ఉసురు తీసుకుంటుందని ఆయ న మండిపడ్డారు.

    రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మ ధ్యతరహా పరిశ్రమల ఏ ర్పాటు కో సం ఎస్సీ ఎస్టీ వికలాంగుల కోసం 50 శాతం రిజ ర్వేషన్లు, అదనంగా జనరల్ మహిళలకు కూడా 20 శా తం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో చట్టం చేసి జీవో నెంబర్ 6 ను విడుదల చేసిందని, ఈ రిజర్వేషన్ల కేటాయింపులో బీసీ లను విస్మరిం చడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీసీల ఆకాం క్షల నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభు త్వానికి మాటల్లో ఉన్న చిత్తశుద్ధి చేతల్లో లేదని, బీసీలకు అడుగడు గునా అన్యాయం చేస్తూ బీసీల అ భివృద్ధికి పాటుపడుతున్నాననీ ప్ర భుత్వం చెప్పుకోవడం సిగ్గుచేట న్నారు. బీసీల అభివృద్ధిపై రాష్ట్ర ప్ర భుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉ న్న తక్షణమే బీసీ సబ్ ప్లాన్ చట్ట బద్ధత కోసం మంత్రివర్గ ఉప సం ఘాన్ని నియమించాలని, బీసీల సంక్షేమ బడ్జెట్ ను 20000 కోట్లకు పెంచాలని, గత నాలుగు సంవత్స రాలుగా పెండింగ్లో ఉన్న 7500 కో ట్ల ఫీజుల రియంబర్స్ మెంట్ బ కాయిలను విడుదల చేయాలని ఆ యన డిమాండ్ చేశారు.

    లేనిపక్షంలో ఏప్రిల్ నెల మొత్తం బీ సీ ఉద్యమాల మాసంగా మారుస్తా మని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చ రించారు. ఈ సమావేశంలో బీసీ జే ఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీ సీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సం క్షే మ సంఘం రాష్ట్ర కార్యనిర్హక అ ధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ము ది రాజ్, వడ్డెర సంఘం జాతీయ అ ధ్యక్షులు పిట్ల శ్రీధర్, బీసీ జేఏసీ క న్వీనర్ జాజుల లింగం గౌడ్, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యా దవ్, బీసీ వి ద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లేపల్లి స్వా మి గౌడ్, ఉదయ్ నేత, కొప్పుల చందు గౌడ్, వడ్డె రాజు, వేణు, అ నంతోజు బ్రహ్మచారి, వల్లబోజు నరసింహా చారి, మహేష్ మేరు, జా జుల భాస్కర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, బండిగారి రాజు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.