Nalgonda Collector B Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రబీధాన్యం సేకరణ ప్రారంభమైనందున మండ ల ప్రత్యేక అధికారులు వారి మండ లాల పరిధిలో ధాన్యం కొ నుగోలు కేంద్రాలను సందర్శించి ఏవైనా స మస్యలు ఉంటే తమ దృష్టికి తీ సు కురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖ ర్ ఆదేశించారు. ప్రజావాణి కా ర్యక్రమంలో భాగంగా సోమ వారం అయన కలెక్టర్ కార్యాలయ సమా వేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
అనంతరం జిల్లా అధికారులతో వి విధ అంశాలపై ఆయన సమీక్ష ని ర్వహించారు. జిల్లాలోని అన్ని ప్ర భుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, పంచాయతీ కార్యాల యాల లో యుద్ధ ప్రాతిపదికన టి- ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటు చేయ డం పూర్తిచేయాలని అన్నారు. ఈ నెల 10న ఆయా శాఖల లో ఇంజనీరింగ్ అధికారుల ద్వారా చేపట్టిన పనులపై సమీ క్ష నిర్వహించడం జ రుగుతుందని అందువల్ల సంబంధిత శాఖల అధికారులు వారి పనుల కు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు.
ఈనెల 14న నిర్వహించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయం తి సందర్భంగా అవగాహన కల్పించేందుకు గాను విద్యా ర్థులకు వ్యాసరచ న, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని, అలాగే వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు ,ఉ పాధి హామీ పథకాలపై ఈ వారంలో సోషల్ ఆడిట్ నిర్వ హించాలని జెడ్పి సిఈ ఓ ప్రేమ్ కరణ్ రెడ్డిని ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల ద్వా రా ఫైళ్ళ నిర్వహణను ఈ- ఆఫీస్ ద్వారానే చేయాలని, ఇందుకు సం బంధించి తక్ష ణమే డిజిటల్ కీ తీ సుకోవాలని, ప్రతి కార్యాలయ అ ధికారి ఫైల్ నిర్వహణకు సంబం ధించి నివేదిక సమర్పించాలని ఆ దేశించారు. వచ్చే విద్యా సంవత్స రానికి సం బంధించి వి ద్యార్థులకు యూనిఫా ర్మ్స్ రానున్నందున మహిళా సం ఘాలు, సెట్విన్ వంటి సంస్థల ద్వా రా యూనిఫార్మ్స్ కుట్టిం చేందుకు సంసిద్ధంగా కావాలని మెప్మా పిడిని ఆదేశించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీ య ఎ స్సీ, ఎస్టీ కమిషన్ కు సంబంధించిన కేసుల నివేది కలను తక్షణమే స మర్పించాలని అన్నారు. రబీ ధాన్యం కొ నుగోలు ప్రారంభమైనందు న నిర్దేశించిన కొనుగోలు కేంద్రాల కు అవసరమైన సామాగ్రి ముందే పం పిణీ చేయాలని మా ర్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌ కర్యాలు ఏర్పాటు చేయాలని, “ఓ ఆ ర్ ఎస్” పాకెట్లు ఉంచాలని, ధా న్యం కొనుగోలు సాఫీగా సా గేందు కు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 61 ,ఇతర శాఖలకు 52 మొ త్తం 113 ఫిర్యాదులు వచ్చాయి.మిర్యాలగూడ స బ్ కలెక్టర్ నారా యణ అమిత్ స్థానిక సంస్థల ఇన్చార్జి అద నపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, డీఎఫ్ఓ రాజశేఖర్, దేవరకొం డ , చండూర్ ఆర్డీవోలు రమణా రె డ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
రబీ ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూo
–సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ లోని ఫోన్ నెంబర్ 9963407064 కు తెలియజేయాలి
2025- 26 రబీ ధాన్యం సేకరణ ప్రారంభమైనందున ధాన్యం కొ ను గోలుకు సంబంధించి ఏవైనా స మ స్యలు ఉంటే జి ల్లా కలెక్టర్ కా ర్యా లయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూ మ్ లోని ఫోన్ నెంబర్ 99634 07064 నెంబర్ కు తెలియ జేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. సోమవా రం ఆయన జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ర బీ ధాన్యం కొనుగోలుపై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను ప్రారం భించారు.
రాష్ట్ర ప్రభుత్వం రబీలో రైతులు పండించిన ధాన్యానికి క్విం టాలకు గ్రేడ్ “ఏ” రకానికి రూ. 2389, సాధారణ రకానికి రూ.2369 కనీసం మద్దతు ధరను ప్ర కటిం చిందని, ఇదే కా కుండా సన్నధాన్యానికి ప్రోత్సాహంగా క్వింటాల్ కు రూ.500 రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధా న్యాన్ని కొనుగోలు కేంద్రా లకు తీసుకురావాలని, దాన్యంలో ఎలాంటి తాలు,తరుగు, తే మ వంటివి లే కుండా చూసుకోవాలని, ధాన్యం కొ నుగో లు కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు, తూకం యం త్రాల తో పాటు, టార్పాలిన్లు, అన్ని రకాల సదుపాయాలను క ల్పించడం జరిగిందని తెలిపారు.
ధాన్యం అమ్మకంలో సమస్యలుంటే పైన పేర్కొన్న కంట్రోల్ రూమ్ కు ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవ చ్చని ఆయన రైతులకు సూచిం చారు. ఫిర్యాదుల విభాగానికి వ చ్చే ఫోన్ నెంబర్లు అన్నింటిని రికా ర్డు రూపంలో నమోదు చేయాలని, ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే వెం టనే అధికారులకు తెలి యజేసి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని, కంట్రోల్ రూమ్ లో 24 గం టలు విధులు నిర్వహించే విధంగా సిబ్బం దికి విధులు కేటాయించాల ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధి కారిని ఆదేశించారు. రెవెన్యూ అద నపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పౌ రసరఫరాల మేనేజర్ రాంపతి తది తరులు ఉన్నారు.




