Nalgonda BJP ringroad allegations : ప్రజా దీవెన, న ల్లగొండ టౌన్: నల్ల గొండ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ నిధుల తో నిర్మాణంలో ఉన్న బై పా స్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌లో భారీ అ వకతవకలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డా.నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి మాఫి యాపై ఘాటైన నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సంద ర్భంగా మట్టి మాఫియాకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ. 530 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా పను లు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా నాణ్యత లేని మట్టి ఉపయోగిం చ డం వల్ల రోడ్డు త్వరగా దెబ్బతిని ప్ర జలకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని హెచ్చరించా రు.ప్రాజెక్ట్ పనుల్లో ఎర్రమట్టి బదులు చెరువులు, కాలువలు, రిజర్వా యర్ల నుంచి సేకరించిన నాసిరకం మట్టిని ఉపయో గిస్తున్నారని ఆరో పణలు వెల్లువెత్తాయి. కంచనపల్లి, దోమ లపల్లి, పానగల్, బుద్ధారం, అనంతారం ప్రాంతాల్లోని చెరువు ల నుంచి అక్రమంగా మట్టి తరలించి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిం చారని పేర్కొన్నారు.
దాదాపు 2 లక్షల టిప్పర్ల మట్టిని అ క్రమంగా తరలించగా దీ ని విలువ రూ. 140 కోట్లకు పైగా ఉంటుంద ని అంచనా వే స్తున్నారు. చెరువు ల్లో నిబంధనలకు విరుద్ధంగా 40–50 అ డుగుల లోతు వరకు తవ్వకాల వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, రైతులు, మత్స్యకారులు తీ వ్రం గా నష్టపోతారని హె చ్చరించారు.
మట్టి దందాను అడ్డుకునేందుకు ప్ర యత్నించిన యువకుల పై కేసులు నమోదు చేయడం, వారిని వేధించడం ప్రజాస్వా మ్యానికి విరుద్ధమని బీజేపీ విమర్శించింది. ముఖ్యంగా పా నగల్ రిజర్వాయర్ వద్ద జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు.
ఈ వ్యవహారంలో సంబంధిత మంత్రి, అధికారులు కాంట్రా క్టర్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ వెంటనే చర్య లు తీసుకోవాలని డి మాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చ ర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రాజెక్ట్ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పునఃపరిశీలించాలని కోరారు.
నల్లగొండ ప్రజల ప్రాణాలను పణం గా పెట్టే విధంగా జరుగు తున్న ఈ అవినీతిని తక్షణమే ఆపాలని, లేక పోతే మరింత తీవ్రస్థాయిలో ఆందో ళనలు చేపడతామని బీజేపీ నా యకు లు హెచ్చరించారు. ఈ నిర సన కార్యక్రమంలో పార్టీ నా య కులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

