Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda police Bank Misappropriation Scam : బిగ్ బ్రేకింగ్, బట్టబయలైనడిజిటల్ దుర్మార్గుల బాగోతం,...

    Nalgonda police Bank Misappropriation Scam : బిగ్ బ్రేకింగ్, బట్టబయలైనడిజిటల్ దుర్మార్గుల బాగోతం, రూ. 2.6 కోట్ల ఎస్బిఐ భారీ కుంభకోణాన్ని ఛేదించిన నల్లగొండ పోలీసులు

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda police Bank Misappropriation Scam:  ప్రజా దీవెన, దేవరకొండ: అదొక ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ అందులో దశాబ్ద కాలంగా పనిచేస్తున్న హౌస్ కీపింగ్ ఉ ద్యో గి అందరినీ ఆశ్చర్యప రచే బయటి నుంచి చూస్తే అమా య కుడు, కానీ లోపల అతను పన్నిన పన్నాగం ఐటీ నిపుణు లను సైతం విస్మయానికి గురిచేస్తోందంటే అతిశయోక్తి కా దు. నల్లగొండ జి ల్లా దేవరకొండ SBI (ACB) బ్రాం చ్‌లో జ రిగిన రూ. 2.65 కోట్ల భారీ డిజిటల్ దోపిడీని నల్లగొండ పో లీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు.

    నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం న ల్లగొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరా లు వెల్లడించారు. హౌ స్ కీపింగ్ ఉద్యోగి లెండల చక్ర పా ణికి కంప్యూటర్లపై ఉన్న పట్టును అక్రమ మార్గంలో ఉప యోగించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సూర్యాపేట SBI బ్రాంచ్ మేనే జర్ పుట్ట వెంకట రామాంజనేయులు తో జతకట్టాడు. వీరిద్దరి ప్లాన్ చాలా పక్కాగా ఉండడం కార ణంగా లాక్యాన్ని సమర్థవంతంగా నిర్ధారించుకున్నారు. ఏం ఐఎస్ (MIS) సిస్టమ్ ద్వారా ఏళ్లుగా లావాదేవీ లు లేని (I nactive) 10 భారీ ఖాతాలను గుర్తించి లక్ష్యంగా చేసుకు న్నారు.

    సదరు ఆఖాతాదారుల వివరాల తో ‘రేఖా ప్రింట్’ అనే వెబ్‌ సైట్ సా యంతో నకిలీ ఆధార్, పాన్ కార్డులను సృష్టించా రు. డిజిటల్ హ్యాకిం గ్ రద్దీగా ఉన్న సమయంలో బ్యాం కు సిబ్బంది లాగిన్లను వాడుకుని, ఆ ఖాతాలకు కొత్త మొబైల్ నంబ ర్లు లింక్ చేశారు. ఆపై YONO యా ప్ ద్వారా కొత్త యూజర్ ఐడీలు, పిన్‌లను సృష్టించి సొమ్మును ఖాళీ చేశా రు. మనీ లాండరింగ్ విష యంలో ఈ కుంభకోణంలో రిక వరీ ఏజెంట్ రాంలాల్, ఫోటోగ్రాఫర్ శివ సహకారంతో అ మాయకుల ఖాతా లను వాడుకుని, వారికి కమిషన్ ఆశ చూపి నగదును డ్రాచేయించారు.

     ఒక చిన్న మెయిల్.. కుప్పకూలిన సామ్రాజ్యం

    ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసినా ఒక చిన్న సాంకేతిక లోపం వా రి కొంప ముంచింది. కోటి బ్రాంచ్‌కు చెందిన ఖాతాదారుడు పల్లటి నరేందర్‌కు అక్రమంగా కేవైసి (KYC) అప్‌డేట్ జరి గినట్లు వెళ్లిన ఈ-మెయిల్ అ లర్ట్, అసలు విషయాన్ని బ యటపెట్టింది. మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకట రాఘవ పూడి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలో కి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు నల్లగొం డ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస రావు నాయకత్వంలో ప్ర త్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశాయి.

    హౌస్ కీపింగ్ ఉంటూ మాస్టర్ మైండ్ గా వ్యవహరించిన లెం డల చక్ర పాణి, సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెం కట రామాంజనేయులు, రికవరీ ఏజెంట్ కేతవత్ రాంలాల్, ఫో టోగ్రాఫర్ మారేపల్లి శివలను సాంకేతిక ఆధారాలను సేక రిం చి నిందితులను పట్టుకున్న పోలీసు లు వారివద్ద నుంచి రూ. 2,42, 10 ,000 నగదుతో పాటు 06 స్మార్ట్ ఫోన్లు, 01 ల్యాప్‌టాప్ స్వాధీన ప ర్చుకున్నారు.

    ఈ మేరకు కేసును సాంకేతికతతో చాకచక్యంగా ఛేదించిన బృందoలో డియ స్పీ దేవర కొండఆద్వర్యంలో P. వెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పర్యవేక్షణ నలో బి. రాజు, సబ్ ఇన్స్పెక్టర్, దే వర కొండ, కానిస్టేబుల్స్ L. వీరబాబు, పోలీస్ కానిస్టేబుల్ MD. ఫ యాజ్, SK. చాంద్ పాషా,వి. సిం హాద్రి, హోంగార్డ్,సోమ్లా, హోంగార్డ్ (డ్రైవర్)లను సమర్థవంతంగా ఛేదించి నిందితు లను అరెస్ట్ చేసినందుకు జిల్లా ఎస్పీ ప్ర త్యేకంగా అభినందించారు. దీంతో ఈ కేసు ప్రస్తుతం స్థాని కంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.