Minister Komati Reddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఏఎంఆర్ పిలైనింగ్ పూర్తి కా వడం వల్ల నీటి సౌకర్యం పెరిగిం దని, తద్వారా రైతులం ద రూ బత్తా యి నిమ్మ తోటలను తీసేసి ధాన్యాన్ని పండిస్తు న్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నల్ల గొండ జిల్లా కేంద్రంలో ఏ ర్పాటు చేసిన మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడు తూ రానున్న వారం, పది రోజుల్లో రబీ ధాన్యం సేకరణ పూ ర్తి చేసేందుకు ప్రణాళిక రూపొం దించామని, షెడ్యూల్ ప్ర కా రం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, జిల్లా లో 6 మిల్లులు సీజ్ చేయడం వల్ల వచ్చిన మిల్లులకే ధాన్యం ఎక్కువగా వ స్తున్నదని తెలిపారు.
ఏదిఏమైనప్పటికీ రానున్నవా రం,10 రోజుల్లో 90% ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామన్నారు. తన నియో జకవర్గంతో పాటు, జి ల్లాలో రహదారులు భవనాలశాఖ ద్వారా అవసర మైన అన్ని రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని, ఔటర్ రింగ్ రో డ్డు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్ర త్యేకించి పట్టణం లోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు చ ర్యలు చేపట్టామని, హైదరాబాదులా నల్గొండ పట్టణం చు ట్టూ రోడ్లను ఏర్పాటు చేస్తామని, ఎస్డిఎఫ్ నిధులతో పా టు, సిసి రోడ్లు, ఇతర పనులు న డుస్తున్నాయని ఆయన తెలి పారు. అలాగేన్ని పార్కుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిం చామని, వే స విలో నీటి ఎద్దడి రాకుండా అవసరమైతే ట్యాంకర్ల ద్వారా అన్ని వా ర్డులకు కృష్ణ నీటిని అందజేస్తామ ని, అందుకు తగ్గచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంతకు ముందు నల్గొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రా తిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన న ల్గొం డలోని తన క్యాంపు కార్యాలయం ఇందిరా భవన్లో జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ తో కలిసి పౌరసరఫరాలు, మార్కెటిం గ్, డిఆర్డిఏ, రవాణా, కో -ఆపరేటివ్ తదితర శాఖల అధికా రులు,రైస్ మిల్లర్లతో రబీ దాన్యం సేకరణ పై సమీక్ష నిర్వ హించారు.
రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్ర తలను దృష్టిలో ఉంచు కొనిధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, అ న్ని కొనుగో లు కేంద్రాలకు పూర్తిస్థా యిలో లారీలను పంపించి రాత్రి , పగలు ధాన్యం కొనుగోలు చేసి అవ సరమైతే లైట్లు ఏర్పా టు చేసి ధా న్యాన్ని సేకరణ సేకరించాలని, రానున్న వారం ,పది రోజుల్లో రబి ధా న్యం సేకరణ పూర్తి చేయాల్సిన అ వసరం ఉందని ఆదేశించారు. ఎం డల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని కొనుగోలు కేంద్రాలలో తప్పని సరిగా నీడ తాగునీరు ఏర్పాటు చే యాలని, రైతులకు ఎలాంటి ఇ బ్బం దులు లేకుండా చర్యలు తీసు కోవాలని, లారీలు, హమాలీ ల కొర త లేకుండా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ధా న్యం పరిశీలించిన ట్లయితే నల్గొండ నియోజకవర్గం లోనే 2 లక్షల 40 వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉం దని, అందువల్ల నియోజకవర్గం లోని అన్ని కొనుగోలు కేం ద్రాలకు వీలైనన్ని ఎక్కువ లారీలు ఏర్పాటు చేయాలని ,ప్రతి రోజు 10,000 మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోలు చేయాలని చెప్పారు.
ఇంకా 10 శాతం కోతలు పూర్తి కా వాల్సి ఉందని, రోడ్లపై ఎ వరు ధాన్యం పోయరాదని, అవసరం అయితే పాఠశాల భ వనాలు, ఫంక్షన్ హాల్ లాంటి చోట కొనుగోలు కేంద్రం ఏ ర్పా టు చేయాలని, ప్రతి కేం ద్రంలో ఒక కాంటాను అదనంగా ఉంచాలని, ఎక్కువగా ధాన్యం వ చ్చేందుకు అవకాశం ఉన్న గ్రామా లను గుర్తించి అక్కడ ఎక్కువ లా రీలు పంపించేం దుకు చర్యలు తీ సుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ ను ఆదేశించారు. మంగళవారం నుండే యుద్ధ ప్రా తిపదికన రాత్రి ,పగలు కొనుగోలు ప్రారంభం చేసి, ఉన్న ధా న్యాన్ని లారీల ద్వారా మిల్లులకు పంపించాలని ,మిల్లర్లు కూడా జాప్యం చేయ కుండా వెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసుకొని సహకరించాలని కోరారు.
కనగల్, ధర్వేశిపురం తదితరచోట్ల ఖాళీగా ఉన్న వ్యవసా య గోదా ములలో ధాన్యం ఉంచేందుకు చర్యలు చేపట్టా లని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆయన ఆదేశిం చా రు. నల్గొండ మేయర్ బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డి ,జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్, రెవెన్యూ కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెం కటేశం, మార్కెటింగ్ ఏడి ఛాయా దేవి, డిసిఓ పత్యానాయక్, డిఆ ర్డిఓ శేఖర్ రెడ్డి,జిల్లా వ్యవ సాయ అధికారి శ్రవణ్ కుమార్, ఆర్టీవో లావణ్య, మిల్లర్ల అ సోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, తదితరులు ఈ సమా వేశానికి హాజరయ్యారు.

