Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవన నల్గొండ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా దరిత్రితోపాటు, ప్రకృతి పెను విపత్తును ఎదుర్కొంటున్నదని, దీనిని దృష్టి లో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషే ధించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాతృ భూమి” దినోత్సవాన్ని పురస్కరిం చు కొని బుధవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభి వృ ద్ధి శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని కేం ద్రీయ విద్యాలయ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ని ర్వ హించిన సైకిల్ ర్యాలీని కేంద్రీయ విద్యాలయ వద్ద ఆయన జండా ఊపి ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులు, మీడియా ను ఉద్దేశించి జిల్లా కలెక్ట ర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ ల్ల ప్రపంచం పెను ప్రమాదంలో చి క్కుకుందని, దీనివల్ల వాతావరణ, జల, భూ మి కాలుష్యాలు ఏర్పడుతున్నాయని అన్నారు. మానవ త ప్పిదాలు, వివాదాల వల్ల మనుషు లతో పాటు, జంతుజాలా నికి కూ డా ప్రమాదం ఏర్పడిందన్నారు.
ప్లాస్టిక్ వినియోగం అనంతరం డీ కంపోస్టు చేయకపోవడం వల్ల ఇది భూమితోపాటు, ప్రకృతిని నాశనం చేస్తున్నదని, దీ ని నుండి బయట పడేందుకు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తు న మొక్కలు నాటి దరిత్రిని సంరక్షిం చుకోవాల్సిన బాధ్యత ఉందని అ న్నారు. మొక్కలు నాటి సంరక్షించ డంతోపాటు, ప్లాస్టిక్ వాడకాన్ని త గ్గించడం, ఒక వేళవాడినట్లైతే తిరి గి దానిని వినియోగించడం, రీసైకి ల్, చేయడం వంటి వాటిపై దృష్టి సారించాలని, ఈ నినాదం ప్రతి గృ హానికి వెళ్లే లా చూ డాల్సిన బాధ్య త ప్రతి ఒక్కరిపై ఉందని, అప్పుడే మనం భూమిని, ప్రకృతిని కాపాడ గలుగుతామని అన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ప్రతి ఒక్కరూ బయటికి, లేదా మార్కెట్ కు వెళ్లేటప్పుడు త ప్పనిసరిగా కాటన్ చేతి సంచులు వాడాలని, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కు బదులు స్టీల్ లేదా మట్టి బాటి ల్స్ వాడడం, ప్లాస్టిక్ మెటీరి యల్ వాడకుండా చూడాలని, ఈ విష యంపై అన్ని చోట్ల అవగాహన క ల్పించాలని తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం అ త్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణా ళికలో భాగంగా అన్నిచోట్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రకృతిని కా పాడే అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిం చాలన్నారు. అంత ర్జాతీయ మాతృభూమి దినోత్స వం” సందర్భంగా ప్రతి ఒక్కరు భూ మి కి ప్రతిరూపమైన అమ్మ ను గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపా డుకునే ప్రయత్నం చేయాలని, అప్పుడే మనం అనుకున్న అందమైన జీవితాన్ని గడపగలుగుతామన్నారు.
డి ఎఫ్ ఓ రాజశేఖర్, జిల్లా యువ జన ,క్రీడల అభివృద్ధి శా ఖ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసు లు, జిల్లా సైన్స్ అధికారి తదితరులు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ర్యాలీకి హాజ రైన వారందరి చేత “అంతర్జాతీయ మాతృభూమి దినోత్స వ” ప్రతిజ్ఞను చేయించారు. అంతేకాక అంతర్జాతీయ మా తృభూమి దినోత్సవం పై రూపొందించిన గోడపత్రికను ఆవి ష్కరించారు. అనంతరం జిల్లా కలె క్టర్ అధికారులు విద్యా ర్థులతో కలి సి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిం చారు.


