Tuesday, September 29, 2026
More
    HomeOpinionTirupati tragedy family suicide : బిగ్ బ్రేకింగ్, తిరుపతిలో తీరని విషాదం, ఒకే...

    Tirupati tragedy family suicide : బిగ్ బ్రేకింగ్, తిరుపతిలో తీరని విషాదం, ఒకే కుటుంబంలో నలుగురి బలి,మిస్టరీగా మిగిలిన కారణాలు

    📰 Generate e-Paper Clip

     

    Tirupati tragedy family suicide : ప్రజా దీవెన, తిరుప తి: ఒక చిన్న కుటుంబం, ఎన్నో కలలు, హాయిగా సాగిపోతు న్న జీవితం. కానీ, ఒక్క రోజు కొన్ని గంటల వ్యవధిలో ఆ కు టుంబంలోని నలుగురు వ్యక్తులు కన్నుమూశారు. అసలు ఏం జరిగిందో తెలియదు, ఎందుకు జరిగిందో అర్థం కాని వి షయంగా మిగిలిన నిన్నటి వరకు కలిసి మెలిసి ఉన్న ఆ ఇం ట్లో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. తిరుపతి జిల్లా నా రాయణవనం మండలంలో చో టుచేసుకున్న ఈ పెను వి షాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

    ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నా యి. వెంకట కృష్ణపాలెం పంచాయతీ చాకలి వీధిలో మోహ న్ కుటుంబం నివాసం ఉంటుంది. మోహన్ సిమెంట్ వ్యా పారం, భార్య హరిత టైలరింగ్ చే స్తూ జీవనం సాగిస్తున్నా రు. వీరికి 9వ తరగతి చదువుతున్న కౌశిక్, 7వ తరగతి హ రిణి ఇద్దరు పిల్లలు ఉండగా అంతా సాఫీగా సాగుతుందను కుంటున్న తరుణంలో ఒక్కసారిగా విధివక్రించింది.

    మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లిన మోహన్ తిరిగి రాకపోవ డంతో, అనుమానం వచ్చిన కు టుంబ సభ్యులు వెతకడం మొద లుపెట్టారు. ఇంటికి వెళ్లి చూడగా, తల్లి చం ద్రకళ, భార్య హరిత విగ తజీవులై పడి ఉండటం చూసి వా రు నిర్ఘాంతపోయారు. చున్నీలతో మెడబిగించి మోహనే వా రిద్దరినీ హత్య చేసినట్లు ప్రాథమిక విచార ణలో తేలింది.

    ఇంటి నుంచి బయటకు వచ్చిన మోహన్, పాఠశాలకు వెళ్లి ‘తాత చనిపోయాడు’ అని చెప్పి పిల్లల ను నమ్మించి బయ టకు తీసుకొ చ్చాడు. అప్పటికే మోహన్ కోసం పోలీసులు గాలింపు మొదలుపె ట్టారు. పుత్తూరు, కార్వేటినగరం, నగరి పరిసరాల్లో సాంకేతిక పరిజ్ఞా నంతో అతని జాడ కోసం వేట సా గించారు. కానీ, గమ్యం ముందే నిర్ణయించుకున్న మో హన్, పిల్లలను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తిరుగు తూ చివరకు పుత్తూరు మండలంలోని వేపగుంట రైల్వే స్టేష న్ సమీపానికి చేరుకున్నాడు. రాత్రి 7:15 గంటల సమ యంలో రైలు పట్టాల వద్దకు వచ్చి ఒక్కసారిగా తల పెట్ట బోయాడు.

    తన తండ్రిని కాపాడేందుకు ఆకన్నపిల్లలు పడ్డతపన, వేడు కున్న ఆ కన్నీటి దృశ్యం ఎవరినైనా కంట తడి పెట్టిస్తుం ది. తండ్రిని అడ్డుకునే క్రమంలో, పక్కకు లాగే ప్రయత్నంలో వే గంగా దూసుకొచ్చిన ‘ఎగ్మోర్ -కాచిగూడ’ రైలు ముగ్గురినీ పొ ట్టన పెట్టుకుంది. రైలు లోకోపైలట్ సమాచారంతో స్టేషన్ మాస్టర్, పోలీ సులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    ఒక సాధారణ కుటుంబంలో ఇలాంటి ఘోరకలికి దారితీసిన కారణా లేంటి? ఆర్థిక ఇబ్బందులా? లేక మ రేదైనా మనస్తా పమా? అనేది అం తుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. మృ త్యువుకు కారణం ఏంటో తెలిసేలోపే ఆ కుటుంబం కనుమ రుగైంది. నారాయణవనం ఇప్పు డు ఈ ఘటనతో ఒక్కసా రిగా కుప్పకూలిపోయింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.