Bharat Rashtra Samithi Leaders in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువైన కా ళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న దుష్ప్రచారానికి హై కోర్టు ఇచ్చిన తీర్పు గట్టి సమాధాన మని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయ పడ్డారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్య వహరిస్తున్న పీసీ ఘోష్ కమిషన్ ను, అందుకు సహకరిస్తున్న కాం గ్రెస్ వైఖరిని వారు తప్పుబట్టారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, జి ల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ర వీంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజా కోర్టులో కాంగ్రెస్ అబద్ధాలు బట్టబ యలయ్యాయని ధ్వజమెత్తారు. “కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో రా సిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే పీసీ ఘోష్ కమిషన్ నడుచుకుందని హైకోర్టు నిర్ధారించిందని, ఇది కాంగ్రెస్, బీజే పీల కుమ్మక్కు రాజకీయాలకు చెం పపెట్టు” అని ఘాటుగా స్పందించా రు. కేవలం కేసీఆర్, హరీష్ రావుల ను బదనాం చేయడం కోసం, ఆరు గ్యారెంటీలను పక్కన పెట్టి ప్రభు త్వం ‘డైవర్షన్’ రాజకీయాలకు పా ల్పడుతోందని ఆరోపించారు.డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో జరు గుతు న్న అన్యాయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన ఆయన, జిల్లా రైతుల ప్రయోజనాలను కా పాడాలని డిమాండ్ చేశారు.
మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లా డుతూ కాళేశ్వరంపై దుష్ప్రచారం తెలంగాణకు ద్రోహం తలపెడుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతులకు సాగునీరు అం దు తుం టే, ప్రభుత్వం మాత్రం ఏపీ ప్రయో జనాల కోసం ప్రాజెక్టును నీరుగా రుస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టు కూలిపోయిందంటూ అసత్యాలు ప్రచారం చేయడం వెనుక భారీ కు ట్ర ఉందని, కాళేశ్వరం నిర్మాణం ని జంగానే విఫలమైతే, గంధమల్ల నుంచి ఆలేరుకు నీళ్లు ఎలా వస్తు న్నాయని ఆయన సూటిగా ప్ర శ్నిం చారు.
ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఆధారాలు లేని ఆరోపణలు చట్టం ముందు నిలబడవని హైకోర్టు తీ ర్పు మరోసారి నిరూపించింది. కేసీ ఆర్, హరీష్ రావులపై చర్యలు తీ సుకోవడం కుదరదని కోర్టు స్పష్టం చేయడం, కాంగ్రెస్ గోబెల్స్ ప్రచా రానికి చెంపపెట్టనివిఅన్నారు. క మిషన్ల పేరుతో ప్రజలను మభ్యపె ట్టే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్ర భు త్వం పంట కొనుగోళ్లలో రైతులను దారుణంగా మోసం చేస్తోందని వి మర్శించారు. “ధాన్యం కొనుగోలు లో క్వింటాల్‌కు 8-9 కిలోల తరుగు పేరుతో దోచుకుంటున్నారు. రైతుల ఇబ్బందులను గాలికి వదిలేసి, మంత్రులు కమిషన్ల మీదే దృష్టి పె ట్టారని ఆరోపించారు. రేపటి నుం చి తాము కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా ఉం టామని, అవసరమైతే కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమని హెచ్చరించా రు. అలాగే ఆర్టీసీ కార్మికుల సమ స్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగయ్య, కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగ త్ కుమార్ తదితరులు పాల్గొన్నా రు.


