Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda police arrested ganjagang : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో 'గంజాయి' గుట్టురట్టు, సరిహద్దులు దాటినా...

    Nalgonda police arrested ganjagang : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ‘గంజాయి’ గుట్టురట్టు, సరిహద్దులు దాటినా వదలని ఖాకీలు

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda police arrested ganjagang : ప్రజా దీవెన, నల్లగొండ:మాదకద్ర వ్యాల ముఠా ఆట కట్టించారు నల్ల గొం డ పోలీసులు. ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దుల (AOB) నుండి గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న భారీ నెట్‌ వర్క్‌ను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ రమేష్ శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశం వెల్లడించారు.

    నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఉడిపి హోటల్ పరి సరాల్లో శనివారం మధ్యాహ్నం 3గంటల సమ యంలో కొందరు అ నుమానాస్పదంగా తిరుగుతున్నా రన్న పక్కా సమాచారంతో పోలీసు లు రంగంలోకి దిగారు. టూ టౌన్ ఎస్సై వై. సైదులు, సిబ్బంది అకస్మాత్తుగా రైడ్ చేయ గా, ఇద్దరు బై క్‌లపై ఉన్న ఐదుగురు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు.

    పోలీ సులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు.సీజ్ చేసిన లక్ష రూపా యలు విలు వచేసే 5 కిలోల సామా గంజాయి తో పాటు రెం డు పల్సర్ బైక్‌లు, మొబైల్స్, 5 సెల్ ఫోన్లు మొత్తంగా సు మారు రూ. 3,00,0 00 విలువైన వచ్చు సామాగ్రి స్వాధీన పరచుకున్నారు.

    దొంగతనాల నుండి డ్రగ్స్ స్మగ్లింగ్ వరకు

    ఈ ముఠాకు సూత్రధారిగా భావిస్తు న్న కోరేపల్లి అభినవ్ (A-1) చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిసయ్యా డు. జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడి, చి వరికి గంజాయి స్మగ్లింగ్‌ను ఎంచు కున్నాడు. వారం క్రితం విజయ వాడలో దొంగిలించిన బైక్‌పై సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి, అ క్కడ కిలో 3 వేల రూపాయలకే కొనుగోలు చేసి, ఇక్కడ భారీ లాభాలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

    అయితే ప్రస్తుతం పోలీసులు అభి నవ్ తో పాటు రాకేశ్, మోహన్ కృ ష్ణ, రాజేశ్, శివ సాయిలను అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించారు. వీరి తో సంబంధం ఉన్న మరో ఆరుగు రు (నాగరాజు, మధు కుమార్, వి ష్ణు వర్ధన్, సంపత్ కుమార్, సుశాంత్, మనుకర్) పరారీలో ఉన్నా రు. వీరి కోసం గాలిం పు చర్యలు ముమ్మరం చేశారు.

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్యా ల వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నా మని కేవలం అమ్మేవారే కాదు, గంజాయి సేవించే వారిపై కూడా కఠిన చ ర్యలు తీసుకుంటామని నల్లగొం డ జిల్లా పోలీసులు హెచ్చరి స్తున్నా రు. యువత తమ బంగారు భవిష్యత్తును వ్యసనా ల పాలు చేసుకోవద్దని సూచిస్తున్నారు.

    ఇదిలా ఉండగా కేసును ఛేదించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి, సీఐ రాఘ వరావు, ఎస్సై సైదులు, కానిస్టేబుల్స్ రాజు, బాల కోటి, షకీల్‌లను ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.