Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం, మిల్లుల్లో ధాన్యం దిగుమ...

    Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం, మిల్లుల్లో ధాన్యం దిగుమ తిలో జాప్యంపై ఇక కఠినచర్యలు

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలోని మిల్లుల వద్ద ధాన్యం దించుకోవ డంలో జాప్యం జరగకుండా కఠిన మైన చర్యలు తీసుకోవాలని జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించా రు. దాన్యం సేకరణ, మొక్క జొన్న సేకరణ పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రె డ్డి మంగళవారం హైదరా బాద్ నుండి మంత్రులు, రాష్ట్రస్థా యి సీనియర్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధి త శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాకలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించా రు. ఇకపై జిల్లాలో ప్రతిరోజు కనీసం 20 నుం డి 25 వేల మె ట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసే లక్ష్యంతో పని చే యాలని అధికారులను ఆదేశిం చారు.మిల్లుల వద్ద వచ్చిన దాన్యం లారీలు, ఇతర వాహనాలు ఎట్టి పరిస్థితులలో వెం టవెంటనే అన్ లోడ్ కావాలని, ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరైనా జాప్యం చేసినట్ల యితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    గ్రేడ్ ఏ, కామన్ వెరైటీ రెండు కలిపి మిల్లులకు పంపించ కుం డా చూడాలని, ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారు లు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎప్పటి ట్రక్ చీ టీలు అప్పుడే తెప్పించుకోవాలని ఆదేశించారు. మిర్యాలగూడ మిల్లులలో 1,34,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అన్లోడ్ చే సుకునేందుకు అవకాశం ఉందని ,మిర్యాలగూడ రైస్ మిల్లు ల పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. రానున్న 20 రోజులు ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ చేస్తు న్న లారీలు రొటేషన్ అ య్యేలా చూడాలని, లారీల సమస్యను అ ధిగమించేందుకు ట్రాన్స్పోర్ట్ అధికారులతో పాటు, సంబంధిత అధి కారులు దృష్టి సారించాలన్నారు. దాన్యం ఎక్కువగా నిలువ ఉన్న కొ నుగోలు కేంద్రాలకు లారీలను పం పించే ఏర్పాటు చేయాల ని, లారీ స మస్యల వల్ల ధాన్యం మిల్లులకు పంపించడం ఆ గిపోకుండా చూసు కోవాలని చెప్పారు. జిల్లాలో ఇంకా 2 లక్ష ల 60000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ రైస్ మిల్లుల వద్ద మిల్ల ర్లు ఉద్దేశపూర్వకంగా ధాన్యాన్ని దిగు మతి చేసు కునేందుకు నిరాకరిస్తే అవసరమైతే పోలీస్ సహకారం అం దిస్తామని తెలిపారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలుపై జిల్లా కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొను గోలను కలెక్టర్లు ప్ర త్యక్షంగా పర్యవేక్షణ చేయాలని, ప్రతి ధా న్యం కొనుగోలు కేంద్రానికి ఒక బాధ్యత కలిగిన అధికారిని ని యమించాలని, ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక అధికారిని ఏర్పా టు చేయాలని, జిల్లాలో సమస్యలు వస్తే కలెక్టర్లదే పూర్తి బా ధ్యత అని అన్నారు. కలెక్టర్లు, అధికారులు మిషన్ మోడ్లో పనిచేయాలని, క్షేత్రస్థాయి లో వెళ్లి ఎప్పటికప్పుడు ధాన్యం సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పారు.

    లారీల సమస్య ఉన్న చోట రోడ్డుపై లారీలు గుర్తించి వెంటనే ధాన్యం నింపి మిల్లులకు పంపించి ధాన్యా న్ని అన్లోడింగ్ కు ఉపయోగించుకో వాలని చెప్పారు. హమాలీల సమ స్యను తీర్చేందుకు స్థానిక హామాలీ లతో పని చేయించుకునేలా కార్యా చరణ ప్రణాళిక తయారు చేయాల ని, ధాన్యం లోడు చేసిన చోటే రైతు లకు రశీదు ఇవ్వాలని, ఎక్కడ ఖాళీ వాహ నం కనిపించిన ధాన్యం కోసం ఉపయోగించాలని, వర్షం వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్ల ను ఏర్పాటు చేయాలని, ఇందుకు గాను స్థానికంగా సమస్య పరిష్కరమయ్యేలా చూ డాలన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నివేదికలను తెప్పించుకొని ధాన్యం సేకరణలో నిమగ్నమైన అధికార యంత్రాంగం అంతటిని అప్రమత్తం చేయాలని, ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహసిల్దార్, ఎంపీడీవో స్థాయి అధికారిని వాతావర ణ హెచ్చరికలకు సంబంధించిన విష యాలపై ఏర్పాటు చేయాలని, తడిసిన ధాన్యం కూడా తీసు కునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదే శించారు.

    మిల్లర్లు ఎవరైనా దాన్యం దించుకు నేందుకు అంగీకరించన ట్లయితే అవసరం అయితే పోలీస్ ఫోర్స్ ఉప యోగించాల న్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ధాన్యం దించుకోవడం లో ఇబ్బందులు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ వి షయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశిం చారు. ధాన్యం కొ నుగోలులో ఏదైనా కేంద్రంలో సమస్య వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్ర తిరోజు ధాన్యం కొనుగోలు పై వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు స్పందించి వివర ణలు ఇవ్వాలని ఆదేశించారు.

    రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమా ర్ రెడ్డి వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, తదితరులు మాట్లా డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కా ర్యదర్శి రామకృష్ణారావు పలు సూచనలు చేశారు. జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరె న్స్ కు రెవిన్యూ అదనపు కలెక్టర్ కలెక్టర్ జె. శ్రీనివాస్, పౌరస రఫరాల డిఎం రాంపతి నా యక్, పౌరసరఫరాల అధికారి వెం కటేశం, డిఆర్ డిఓ శేఖర్ రెడ్డి, డిసి ఓ పత్యానాయక్, మార్కెటింగ్ ఎ డి చాయాదేవి, వ్యవసాయ శాఖ జిల్లా అధి కారి శ్రవణ్ కుమార్ తది తరులు హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.